
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం దంచికొడుతోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, చైతన్యపురి, సరూర్‌నగర్, ఉప్పల్, బోడుప్పల్, చాంద్రాయణగుట్టలో కుండపోత వర్షం కురుస్తోంది.
దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. గంటసేపు కురిసిన భారీ వర్షానికి నాగోల్ సాయినగర్ వైపు భారీగా వచ్చిన వరద నీరు చేరుకుంది. వరద నీటిలో బైక్‌లు కొట్టుకుపోయాయి.
ఎల్‌బీ నగర్‌లో గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది నాగోల్, బండ్లగూడలో 8.78 సెం.మీ, ఎల్బీనగర్ 3.6 సెం.మీ, రామాంతాపూర్ 3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

