
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించింది. జల ప్రళయాన్ని తలపిస్తూ..కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 24 గంటల్లో 43.35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.

కుండపోతగా కురిసిన వర్షంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది.

కామారెడ్డి పట్టణం చిగురుటాకులా వణికిపోయింది. కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి.

























