
ఒక చిన్నారి గల్లంతు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం
రాయచోటి: అన్నమయ్య జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన కుంభవృష్టి రాయచోటిలో విషాదం నింపింది. పట్టణంలో వరదలా ప్రవహించిన వర్షపునీటిలో నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతిచెందారు. ఒక చిన్నారి ఆచూకీ లభించలేదు. వర్షపునీటితో రాయచోటిలోని మురుగు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్‌ఎన్ కాలనీ వెనుక భాగాన ఉన్న కాలువలో వృద్ధురాలు(60), ఆమె కుటుంబానికి చెందిన చిన్నారి(5) నీళ్లల్లో కొట్టుకుపోసాగారు.
వారిని కాపాడేందుకు స్థానికుడు గంగయ్య (30) ప్రయత్నించాడు. ప్రవాహ వేగానికి ముగ్గురూ కొట్టుకుపోయారు. స్థానికులు గాలించి అక్కడికి సమీపంలోని కల్వర్టు వద్ద ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కె.రామాపురం సమీపంలో ఉన్న 4 కుళాయిల వద్ద నీటి ప్రవాహంలో యామిని (7) కొట్టుకుపోయింది. ఆమె ఆచూకీ లభించలేదు.
