హస్తిన దురహంకారం తలవంచమంది. ఆయన ఆత్మాభిమానం అది జరగదంది. ఢిల్లీ గద్దలు అక్రమ కేసుల కుట్రలు పన్నారు. ఆయన ధీరత్వం లొంగేది లేదంది. స్కామ్‌లు, స్కీమ్‌ల్లో మునిగిన చంద్ర బాబు సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పడానికి అడుగేశారు. అప్పుడు మొదలైంది ప్రజా సంకల్ప యాత్ర. తమ కష్టాలను చెప్పుకుని ఆదుకోమంది అఖిలాంధ్ర జనసందోహం. ఆయన నేనున్నానని అభయం ఇచ్చారు. అప్పుడు పుట్టింది సరికొత్త చరిత్ర. నాడు బాబు కబంధ హస్తాల్లో గాడి తప్పిన పాలన.. బేలగా స్వాగతం పలికింది. ఆయన తొలి సంతకంతోనే సరిచేయడం మొదలుపెట్టారు.
అప్పుడు మొదలైంది రాజన్న తనయుడు జగనన్న జన రంజక పాలన. క్షుద్ర రాజకీయాన్నే నమ్ముకున్న కూటమి మళ్లీ గద్దెనెక్కి గంతులేస్తోంది. ఆయన.. దిక్కుతోచని ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండ దండ అయ్యారు. అప్పుడు మొదలైంది మళ్లీ ఆటవిక పాలనపై జగన్ గర్జన. జనగర్జన. వ్యక్తిగా, పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా, జన హృదయ నేతగా... ఆయన ప్రతి మలుపు లోనూ... ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడుగుతోన్న ఒకే ఒక్కడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా.. తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్కడు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రజాపాలనకి అర్థం చెప్పిన ఒకే ఒక్కడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించి.. అద్భుత పాలనా దక్షత ప్రదర్శించిన ఒకే ఒక్కడు. చంద్రబాబు ఆటవిక పాలనపై సమర గర్జన చేస్తోన్న ఒకే ఒక్కడు. మనిషికి, మంచికి, మాటకి ఏమాత్రం విలువలేని రాజకీయాల్లో.. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే ఒకే ఒక్కడు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అండ దండ ఉంటే చాలని నమ్మిన.. మాట తప్పని, మడమ తిప్పని ఒకే ఒక్కడు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. దేశ రాజకీయాల్లో టార్చ్ బేరర్. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అలవికాని కష్టాలను అనుభవించాడు. భరించాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అక్రమ కేసుల కుట్రలను ఎదుర్కొన్నాడు. ఎదిరించాడు. మాట తప్పడమే, మాయ చేయడమే పాలిటిక్స్ అయిపోయిన ప్రస్తుత రోజుల్లో... మాట తప్పని రాజకీయాలను దేశానికి పరిచయం చేశాడు. ఆ ఒక్కడే.. వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి మహా శక్తిగా ఎదిగాడు. ఆ ఒక్కడే...దేశమంతా అబ్బుర పడేలా జనరంజక పాలన చేశాడు. వైఎస్ జగన్‌కి ఇదంతా ఎలా సాధ్యమైంది? వైఎస్ జగన్.. ఇంతటి ప్రజాకర్షక నాయకుడు ఎలా అయ్యాడు? జగన్‌మోహన్ రెడ్డి ఇంతటి దార్శనికత కలిగిన పాలకుడుగా ఎలా నిలిచాడు ? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సమాధానం మాత్రం ఒక్కటే. జగన్.. జనమంతా తన వాళ్లు అనుకున్నాడు. జనమంతా.. జగన్ తమ వాడు అనుకున్నారు.
మాట తప్పని జగన్‌కి.. జనమే అండా దండా అయ్యారు. బాగోగులు పట్టించుకునే నాథుడు లేని జనానికి.. అన్నీ జగనే అయ్యాడు. నిజమైన నాయకుడు జనం కోసం ఎంత చేయగలడో జగన్ చేసి చూపించాడు. జగన్ గుండెల్లో జనం. జనం గుండెల్లో జగన్. ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఈ క్రమంలో ఎదురైన ఎన్నో కష్టాలను, నష్టాలను ప్రజలకిచ్చిన మాట కోసం చిరునవ్వుతో భరించాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. జగన్ ప్రజలనే నమ్ముకున్నాడు. ఆ జనం నువ్వే మా నమ్మకం అని జగన్‌ని అక్కున చేర్చుకున్నారు. ఈ అనుబంధానికి 16 ఏళ్లు దాటిపోయాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇకలేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అంతటి దు:ఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు.
వైఎస్సార్ మరణంతో తట్టుకోలేక ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి, అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించార వైఎస్. జగన్ ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రెండు విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే..కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెర తీశాయి. హస్తినకి లేనిపోనివి నూరి పోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్సార్ తనయుడు ఎందుకవుతాడు?. పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జనపథ్‌కు తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
సుఖాలు, హోదాలు, పదవులు. వీటన్నింటన్ని కన్నా.. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు.. ప్రజల కిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయిం చుకున్నారు. ఓదార్పు యాత్రని యాథావిధిగా కొనసాగించారు. అటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చే రాజకీయాలకు పదును పెట్టింది. అదే సమయంలో జగన్ ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతే.. కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెర తీసింది. చంద్ర బాబుతో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు జగన్‌మోహన్‌రెడ్డి
కడప లోక్‌సభ నుంచి జగన్ వైఎస్సార్సీపీ తరపున అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో... కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే.. పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్సార్సీపీలోకి ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు.
18 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్‌ను విచారణకి అని పిల్చి సీబీఐతో అరెస్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్‌ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తలదించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్ వెనకే ఉన్నామని ఉప ఎన్ని కల సాక్షిగా తేల్చి చెప్పారు.
ఈ దేశంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు.. దాన్ని భర్తీ చేయడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. పాలకుల మీద ప్రజావ్యతిరేకత పెరిగినప్పుడు.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. కులాల కేంద్రంగా పుట్టుకొచ్చిన పార్టీలున్నాయి. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం సృష్టిస్తే.. ప్యాకేజీ కోసం బానిసిజం ప్రదర్శించే పార్టీలున్నాయి. కానీ.. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.. ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో పుట్టింది. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా...మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయం లోంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని.. 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్న వైఎఎస్ జగన్.. దేశంలోని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు.
2014 ఎన్నికలు.. జగన్ని సింగిల్‌గా ఎదుర్కొనే దమ్ము లేక.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జగన్ని ఢీకొట్టే ప్రయత్నం చేశాయి. ప్రజలనే నమ్ముకున్న జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు.. 6 వందలకు పైగా అలవి కాని హామీలను ప్రకటించి.. భ్రమలు కలిగించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ మ్యానియా హల్‌చల్ చేస్తోన్న సమయం అది. రైతు రుణ మాఫీ హామీ ఇస్తే.. అధికారంలోకి రావడం ఖాయమని జగన్‌తో ఆయన శ్రేయోభిలాషులు చెప్పారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రైతు రుణమాఫీ చేసే స్థితిలో రాష్ట్ర ఆదాయం ఉండదు. హామీ ఇస్తే అధికారం వస్తుంది. కానీ.. మాట తప్పడం ఎలాగో, ప్రజలను మోసం చేయడం ఎలాగో జగన్‌కి తెలీదు. అందుకే.. మాట తప్పితే అధికారంలోకి వస్తామని తెలిసినా.. ప్రజలను వంచించి అందుకునే అధికారం వద్దంటూ రైతు రుణ మాఫీ హామీ ఇవ్వలేదు వైఎస్ జగన్. 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్సార్సీపీ. ఒంటరిగా పోటి చేసినా 67 అసెంబ్లీ స్థానాల్లో, 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మాట తప్పడం, ప్రజలను మభ్య పెట్టడం ఇష్టం లేక అధికారాన్ని సైతం వదలుకున్న జగన్.. జన హృదయాలను మాత్రం సంపూర్ణంగా గెలుచుకున్నారు.
తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వై.ఎస్. జగన్. రైతులను, డ్వాక్రా మహిళ లను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ... ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోలోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపర్చాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వా మ్యాన్ని వెక్కిరిస్తూ.. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు.. వారిలో కొందరిని క్యాబినెట్‌లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వై.ఎస్.జగన్.. ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు...పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారు. దీంతో...ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసు కోవడానికి ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తోన్న జగన్ని చూసి జనం చలించిపోయారు. జనం కోసం జగన్ కదిలితే.. జగన్ కోసం జనం పోటెత్తారు. తమ కష్టాలను కళ్లారా చూడటానికి, కన్నీళ్లు తుడవడానికి తమ ఊరికొచ్చిన రాజన్న బిడ్డని దీవించడానికి... జనం కెరటాల్లా ఎగసిపడ్డారు. కోట్ల మందికి భరోసా ఇవ్వడానికి ఒక్క జగన్. ఆ ఒక్కడిలో తమ అన్నని, కొడుకుని, మనవడుని, మామయ్యని చూసుకుని మురిసిపోయారు కోట్ల మంది ప్రజలు. రావాలి జగన్. కావాలి జగన్. ఈ పాట తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పాట మాత్రమే కాదు. సోషల్ మీడియా లో భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా నెటిజన్స్ని ఫిదా చేసిన పాట. నిజానికి రావాలి జగన్. కావాలి జగన్ అన్నది ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నినాదం. చంద్రబాబు రాక్షస పాలనలో అల్లాడుతోన్న కోట్ల మంది ప్రజల హృదయాంతరాల నుంచి వెల్లువలా ఎగసిపడిన నినాదమే రావాలి జగన్. కావాలి జగన్. తర్వాత కాలంలో ఆ నినాదమే పాటగా మారింది.
ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయిన వెంటనే...నాటి చంద్రబాబు ప్రభుత్వం విషం కక్కింది. ముద్దుల యాత్ర అంటూ చంద్రబాబు తన వంకర బుద్ధిని ప్రదర్శించారు. స్వచ్ఛంధంగా వచ్చిన జనం కాదన్నారు. తమ పాలనలో జరుగుతోన్న అభివృద్ధిని జగన్ చూడలేకపోతున్నారంటూ పైత్యాన్ని ప్రదర్శించారు. కానీ...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోయారు. నాడు జగన్ మనసులో ఉన్నది ఒక్కటే. ప్రజలకు భరోసా ఇవ్వాలి. చంద్రబాబు అవినీతి పాలనలో, దుష్టపాలనలో నలిగిపోతున్న వారికి అండగా నిలవాలి. భవిష్యత్తు మీద వారికి ఆశ పోనివ్వకూడదు. వాళ్ల కోసం ఏం చేయాలో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ దిశగానే ప్రజా సంకల్ప యాత్ర కదిలింది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది.
2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన...2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. 50 శాతానికి పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపిం చారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలపెట్టడం మీద దృష్టి పెట్టారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అప్పటి దాకా జగన్లో ప్రజలు ఆదర్శవంతమైన నాయకుడుని చూశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆయనలో అద్భుతమైన పాలకుడుని, దార్శనికుడుని చూశారు దేశ ప్రజలు.
ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి చూసి వేసారిన ప్రజల కోసం... సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు.. నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాల కులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ పరుగులు పెడుతోన్న ఏపీని చూసి దేశమంతా అబ్బురపడి చూసేలా చేశాడు. జనరంజక పాలన అంటే ఎలా ఉంటుందో ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చాడు. 2019 నుంచి 2024 మధ్య వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన...ఏపీకి స్వర్ణయుగం మాత్రమే కాదు. ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం, ఏం చేయాలో, ఎలా చేయాలో పాలకులకు పాఠాలు చెప్పింది జగన్ పాలన.
దశాబ్దాలుగా విజనరీ ముసుగులో తెలుగు ప్రజలను మోసం చేస్తూ వచ్చిన నయవంచకుడు నారా చంద్రబాబు నాయుడు. అసలు విజన్ అంటే ఏంటో...దార్శనికత అంటే ఏంటో తన పాలనతో చూపిం చారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఏపీ ఖజానా లో ఉన్న సొమ్ము కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే. ఐదేళ్ల పాటు స్కామ్ల స్కీమ్లతో లక్షల కోట్ల రూపా యల ప్రజాధనాన్ని దిగమింగిన చంద్రబాబు ఘనకార్యాల ప్రతిఫలం అది. అలాంటి అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ పరిస్థితుల చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్న వేళే.. కరోనా దాడి చేసింది.
ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసు పత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడి నప్పుడు... అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలికొదిలేసి...మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే...ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే కారణం... జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు... పాలనను ప్రజలు ముగింటకి తీసుకువెళ్లాయి. పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థతో సాకారం చేశారు జగన్.
సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు. డవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన ఇలాంటి సిద్ధాంతాల నడ్డి విరగ్గొట్టిన పాలకుడు జగన్మో హన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొచ్చేలా చేశారు జగన్ అభివృద్ధి అనగానే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేశారు జగన్. ఐదేళ్ల పాలనలో...జగన్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి..., జగన్ ప్రారంభించిన విప్లవాత్మక మార్పుల గురించి..,జగన్ సాధించిన విజయాలు గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఇలా చెప్పు కుంటూ పోతే ఆ జాబితాకి అంతే ఉండదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలు చేరే సమయంలో... లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేసిన పాలకుడు వైఎస్ జగన్
తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 22 లక్షల ఇళ్లు నిర్మించారు. 73 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. డిజిటల్ క్లాస్రూమ్స్ని తీసుకొచ్చారు. నవరత్నాల నుంచి మొదలు పెడితే... అవినీతికి తావులేని స్వచ్ఛ మైన పారదర్శక పాలన వరకు... జగన్ మోహన్ రెడ్డి పాలన...అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జగన్ పాలనలో ఆంధ్రప్ర దేశ్ ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి పరుగులు పెట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇలా చేతల్లో, అంకెల్లో చూపించిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి.
ఐదేళ్ల పాలనలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు జగన్మోహన్ రెడ్డి. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1 లక్షా 88 వేల 541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు.
2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1923లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే. అయితే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. జగన్ పాలనలోనే ఏడు మెడికల్ కాలేజీలు సిద్ధమైయ్యాయి. ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలైయ్యాయి. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా వరకు జగన్ పాలనలోనే పూర్తి అయింది. అలానే...వైజాగ్ని ఐటీ కారిడార్గా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీచ్ ఐటీ కాన్సెప్ట్తో...ఇన్ఫోసిస్, టెక్ మహేంద్రా, హెచ్సీఎల్, రాండ్స్టాడ్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజర సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి పునాదులు జగన్ పాలనలోనే పడ్డాయి.
ఉద్యోగ కల్పనలోనూ జగన్ అద్భుతాలు చేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా ? కేవలం 34 వేలు మాత్రమే. మరి...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తన పాలనలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలు సా ? 6 లక్షల 31 వేల 906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి అయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.
కాలం కఠినమైంది. ఐదున్నర కోట్ల మంది ప్రజలకి విషమ పరీక్ష పెట్టింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచకత్వానికి సరికొత్త నిర్వచనం చెబుతూ...ఆటవిక పాలన మొదలుపెట్టారు. ప్రజారంజక పాలనకి నిర్వచనం చెబుతూ జగన్ పాలన సాగిస్తే...ప్రజాకంటక పాలనకి సరికొత్త అర్థం చెబుతూ చంద్ర బాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది. అటు అభివృద్ధి లేదు. ఇటు సంక్షేమం లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేస్తున్నారో తెలీదు. ఎన్నికల హామీల అమలు లేదు. అన్ని వర్గాల ప్రజలు కష్టాలక డలిని ఈదే దుస్థితి ఏర్పడింది. పాలకులే పగ పడితే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. నేనున్నాన్న భరోసా అందిస్తున్నారు. ప్రజాకంటక పాలన పై సమరశంఖం పూరించారు.


