breaking news
Oke Okkadu
-
ఒకే ఒక్కడు విజయ్
ఒక్కరోజు ముఖ్యమంత్రి అనే సరికొత్త కథాంశంతో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘ముదల్వన్’. తెలుగులో ‘ఒకే ఒక్కడు’గా విడుదలైంది. 1999లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌పై ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సంగతి ఏంటంటే.. విజయ్ హీరోగా ఈ సినిమా సీక్వెల్‌ని తెరకెక్కించనున్నారట శంకర్. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’(భారతీయుడు 2) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు శంకర్. కరోనా లాక్డౌన్ కాలంలో ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌కి కథ తయారు చేశారట ఆయన. ఇందులో విజయ్ హీరోగా నటించనున్నారని సమాచారం. -
నేనే చేయమని అడుగుతా : బాహుబలి రచయిత
బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా మారిపోయాడు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలతో పాటు ఇతర దర్శకులకు కూడా కథలు అందిస్తూ బిజీగా ఉన్నాడు విజయేంద్ర ప్రసాద్. అయితే ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ స్టార్ రైటర్. శంకర్ తన సినిమాకు మిమ్మల్ని కథ ఇవ్వమని అడిగితే ఇస్తారా అన్న ప్రశ్నకు ' అదేం ప్రశ్న..? ఆయన నన్ను అడగటం కాదు.. నేనే కథ రెడీ చేసి, ఆ కథతో సినిమా చేయమని శంకర్ ను కోరుతా' అంటూ సమాధానం ఇచ్చారు. అంతే కాదు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమాకు సీక్వల్స్ రాస్తున్నట్టుగా తెలిపారు. పర్ఫెక్ట్ సీక్వల్ కాకపోయినా.. తన కథ ఒకే ఒక్కడు లైన్ లోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కథ బాలీవుడ్ సినిమా కోసం రెడీ చేస్తున్నట్టుగా తెలిపారు.