నేనే చేయమని అడుగుతా : బాహుబలి రచయిత | vijayendhra prasad on giving story to shankar | Sakshi
Sakshi News home page

నేనే చేయమని అడుగుతా : బాహుబలి రచయిత

Jul 29 2017 11:26 AM | Updated on Sep 5 2017 5:10 PM

నేనే చేయమని అడుగుతా : బాహుబలి రచయిత

నేనే చేయమని అడుగుతా : బాహుబలి రచయిత

బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా మారిపోయాడు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.

బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా మారిపోయాడు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలతో పాటు ఇతర దర్శకులకు కూడా కథలు అందిస్తూ బిజీగా ఉన్నాడు విజయేంద్ర ప్రసాద్. అయితే ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ స్టార్ రైటర్.

శంకర్ తన సినిమాకు మిమ్మల్ని కథ ఇవ్వమని అడిగితే ఇస్తారా అన్న ప్రశ్నకు ' అదేం ప్రశ్న..? ఆయన నన్ను అడగటం కాదు.. నేనే కథ రెడీ చేసి, ఆ కథతో సినిమా చేయమని శంకర్ ను కోరుతా' అంటూ సమాధానం ఇచ్చారు. అంతే కాదు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమాకు సీక్వల్స్ రాస్తున్నట్టుగా తెలిపారు. పర్ఫెక్ట్ సీక్వల్ కాకపోయినా.. తన కథ ఒకే ఒక్కడు లైన్ లోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కథ బాలీవుడ్ సినిమా కోసం రెడీ చేస్తున్నట్టుగా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement