పేదరికం.. పర్యావరణ కాలుష్యం.. సామాజిక వివక్ష.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు బోలెడు. ఒక పద్ధతి ప్రకారం ఈ సమస్యలన్నీ సమసిపోయేలా చేసేందుకు ఐక్యరాజ్య సమితి పదేళ్ల క్రితమే కంకణం కట్టుకుంది. ఈ భూమి సుస్థిరాభివృద్ధికి ఆ 17 లక్ష్యాల సాధన అత్యవసరమని నిర్ణయించింది. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్.. క్లుప్తంగా ఎస్‌డీజీ గోల్స్ అనే లక్ష్యాలకూ.. 2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకూ అతి దగ్గర సంబంధం ఉంది. ఒక్కో పథకం వెనుక ఏ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్ (ఎస్‌డీజీ) లక్ష్య సాధన ఉంది అనేది తెలుసుకుందాం
వైఎస్సార్ రైతు భరోసా.. ఈ పథకం ప్రధానంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలవడానికి ఉద్దేశించింది. వైఎస్సార్ రైతు భరోసా.. ఈ పథకం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు భరోసా కల్పించడంపై దృష్టి పెడుతుంది. ఆశల జూదంగా ఉన్న వ్యవసాయాన్ని మళ్లీ గాడిన పెట్టడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
ఏటా రైతులకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించడం ద్వారా పంటల సాగును సులభతరం చేశారు. గత ఐదేళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని అంచనా. ఐక్య రాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా ఈ పథకం ద్వారా పేదరిక నిర్మూలన (SDG-1), ఆకలి లేని ప్రపంచం (SDG-2) బాధ్యతాయుతమైన ఉత్పత్తి, వినియోగం (SDG-12) వంటి లక్ష్యాలను సాధించడానికి కృషి జరుగుతోంది.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకం దోహదపడుతోంది. వైద్య సాయం విషయంలో వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించింది. గత ఐదేళ్ల కాలంలో సుమారు కోటి నలభై మంది లబ్ధిదారులు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందారు. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో అందరికీ ఆరోగ్యం, సంక్షేమం (SDG-3)తో పాటు సమాజంలో అసమానతల తొలగింపు (SDG-10) లక్ష్యాలను ఈ పథకం ప్రతిబింబిస్తుంది.
నాడు.. నేడు ! ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా నాణ్యమైన విద్య (ఎస్డీజీ-4), మౌలిక వసతులు, సృజనాత్మకత, పరిశ్రమలు (ఎస్డీజీ-9) దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చేసి విద్యార్థులకు అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, తాగునీరు తదితర సౌకర్యాల కల్పన లక్షించిన పథకం. మూడు దశల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 45 వేల పాఠశాలల రూపురేఖలు మార్చేసే యత్నం.
వైఎస్సార్ పెన్షన్ కానుక.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1), అసమానతల తొలగింపు (ఎస్డీజీ-10). రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు అర్హులైన ఇతరులకు నెలనెలా ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పథకం. ఐదేళ్ల కాలంలో సుమారు 65 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. వాలంటీర్ల వ్యవస్థ పుణ్యమా అని బీదాబిక్కీ, వృద్ధుల ఇళ్ల వద్దకే పెన్షన్ సొమ్ము అందింది.జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా నాణ్యమైన విద్య (ఎస్డీజీ-4), లింగ సమానత్వం (ఎస్డీజీ-5). విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు నివాసానికి కూడా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం. మగపిల్లలు, ఆడపిల్లలు అన్న తేడాల్లేకుండా అందరికీ ఈ పథకం వర్తింపజేశారు. ఐదేళ్ల కాలంలో సుమారు అరవై ఐదు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
పేదలందరికీ ఇళ్లు.. జగనన్న కాలనీలు.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగాసుస్థిర నగరాలు, సమాజాలు (ఎస్డీజీ-11), పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1). ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేసిన పథకం. ఇళ్లస్థలాలు, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కూడా అందించడంతో 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది జగనన్న కాలనీలు వెలిశాయి. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు... ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా చౌక, కాలుష్య రహిత విద్యుత్తు (ఎస్డీజీ-7), గౌరవప్రదమైన పని, ఆర్థికాభివృద్ధి (ఎస్డీజీ-8).కరెంటు కోతలతో వ్యవసాయానికి జరుగుతున్న నష్టానికి చెక్ పెట్టిన పథకం. పగటిపూటే తొమ్మిది గంటలపాటు విద్యుత్తు సరఫరా, అది కూడా ఉచితంగా.. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారు.
మహిళా సాధికారత (అమ్మ ఒడి, చేయూత)... ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా లింగ సమానత (ఎస్డీజీ-5), పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1). పేదలు చదువుకునేందుకు అడ్డంకిగా మారిన పేదరికాన్ని తొలగించే లక్ష్యంతో మొదలైన పథకం. బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు 'చేయూత' పథకం ద్వారా సాయం. 'అమ్మ ఒడి' ద్వారా 45 లక్షల మంది, 'చేయూత' ద్వారా 25 లక్షల మందికి సాయం అందింది. ప్రకృతి విపత్తుల సహాయ నిధి.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా వాతావరణ మార్పులపై చర్యలు (ఎస్డీజీ-13), ఆకలి లేని ప్రపంచం (ఎస్డీజీ-2). వరదలు, కరువు కాటకాల వంటి ప్రకృతి విపత్తుల సమయాల్లో రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పథకం. ఐదేళ్ల కాలంలో సుమారు పది లక్షల మంది సహాయ, సహకారాలు అందుకున్నారు.


