
పిడుగుపాటుతో మహిళ మృతి
సాక్షి నెట్‌వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, నవాబుపేట, దేవరకద్ర మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
నవాబుపేట మండలం రుద్రారంలో వాగు నిండి గ్రామంలోకి నీరు ప్రవహించడంతో ఇళ్లలోకి భారీగా వరద వచ్చి చేరింది. చెన్నారెడ్డిపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో కాజ్‌వే ఉధృతంగా ప్రవహించడంతో మదనాపురం–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా పళ్ల ప్రాంతానికి చెందిన కందుకూరు పద్మ(35) పొలం పనులకు వెళ్లగా.. అక్కడ పిడుగు పడటంతో మృత్యువాతపడింది.