
విశాఖ : ఏపీపై ఉపరితల ఆవర్తనాల ప్రభావ కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. దీనిలోభాగంగా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఇక కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 24 గంటలపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తుఫాన్ హెచ్చరికల కేంద్ర ముఖ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు.
