బాబు సర్కారు మరో రూ.2,000 కోట్ల అప్పు | Chandrababu Govt another Rs 2000 crore Debt | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు మరో రూ.2,000 కోట్ల అప్పు

Sep 17 2026 10:08 AM | Updated on Sep 17 2026 10:08 AM

Chandrababu Govt another Rs 2000 crore Debt

ఎస్‌బీఐ నుంచి ఏపీపీఎఫ్‌సీఎల్‌ రుణం 

గ్యారెంటీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  

సాక్షి, అమరావతి: బడ్జె­ట్‌ బయట వివిధ సంస్థ­ల ద్వారా అప్పులు చే­యడాన్ని చంద్రబాబు స­ర్కారు నిరంతరంగా కొనసాగిస్తోంది. ఇందు­లో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ­స్‌­బీఐ) నుంచి ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కా­ర్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీఎఫ్‌సీఎల్‌) రూ.­2,000 కోట్లు టర్మ్‌ రుణం తీసుకునేందుకు అ­ను­మతిస్తూ ఆ మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 ప్రభుత్వ హామీ రుణం మొత్తం కాలపరిమితి వరకు వర్తిస్తుంది. అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుంది. అసలు, వడ్డీ చెల్లింపుల షెడ్యూల్‌తోపాటు వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం కాలం వంటి వివరాలను సమర్పించాలి. ఏపీపీఎఫ్‌సీఎల్‌ తన సొంత వనరుల నుండే రుణ సేవా బాధ్యతలను నిర్వహించాలి.రుణమొచ్చన సంస్థకు చెల్లించాల్సిన బాధ్యతలను తీర్చడంలో విఫలమైన సందర్భంలో మాత్రమే ఈ ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. హామీ ఇచి్చన మొత్తంపై  ఐదు శాతం హామీ కమీషన్‌ను చెల్లించాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement