● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్
మహబూబాబాద్ రూరల్ : న్యాయవాదులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను బుధవారం ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్, సీనియర్ సివిల్ జడ్జి షాలిని షాకెల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, ఆడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ క్యారమ్ బోర్డు ఆడారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ.. న్యాయవాదులు ప్రతీరోజు కోర్టు విధుల్లో ఉంటూ తమ ఆరోగ్యాలను కాపాడుకోలేక పోతున్నారన్నారు. ప్రతీ న్యాయవాది క్రీడల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ జనగం సిద్ధార్థ, జీపీ తోర్నాల నగేష్ కుమార్, పీపీ కొంపెల్లి వెంకటయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు.


