Telangana News: యాప్‌ తప్పుడు సమాచారంతో.. ఆగని రైలు..! ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు..!!
Sakshi News home page

యాప్‌ తప్పుడు సమాచారంతో.. ఆగని రైలు..! ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు..!!

Oct 3 2023 1:14 AM | Updated on Oct 3 2023 8:33 AM

- - Sakshi

మహబూబాబాద్‌: ‘షిర్డీ’ ఎక్స్‌ప్రెస్‌కు కేసముద్రం రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్‌ లేదు. అయినా ఓ యాప్‌లో హాల్టింగ్‌ చూపడంతో ప్రయాణికులు సోమవారం ఆ రైలు ఎక్కారు. తీరా ఆగకుండా వెళ్లడంతో గందరగోళానికి గురయ్యారు. ‘షిర్డీ’ ఎక్స్‌ప్రెస్‌కు కేసముద్రం రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్‌ ఉండగా, ఇటీవల రద్దు చేశారు. అయితే ఓ యాప్‌లో హాల్టింగ్‌ ఉన్నట్లు చూపడంతో కేసముద్రంలో దిగాల్సిన ప్రయాణికులు పలు రైల్వే స్టేషన్లలో ఆ రైలు ఎక్కారు.

తీరా చూస్తే డౌన్‌లైన్‌లో కేసముద్రంలో ఆగకుండా వెళ్లడంతో మహబూబాబాద్‌లో దిగారు. అలాగే, అప్‌లో లూప్‌లైన్‌ మీదుగా ఆగకుండా వెళ్తుండడంతో రైలులో ప్రయాణిస్తున్నవారితోపాటు, ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో స్టేషన్‌లో రైలును నిలిపారు. అనంతరం యథావిధిగా ముందుకు కదిలింది. మొత్తానికి ఓ యాప్‌ తప్పుడు సమాచారం చూపడంతో గందరగోళానికి గురైనట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement