40 మంది చిన్నారులకు విముక్తి | - | Sakshi
Sakshi News home page

40 మంది చిన్నారులకు విముక్తి

Aug 2 2026 12:34 AM | Updated on Aug 2 2026 12:34 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జూలై 1నుంచి జూలై 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ విజయవంతంగా ముగిసింది. నెల మొత్తం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన, అనాథ, నిరాశ్రయులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించేందుకు ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.

40 మందికి విముక్తి..

ఆపరేషన్‌ ముస్కాన్‌ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 40 మంది చిన్నారులను గుర్తించి రక్షించారు. వీరిలో 24 మంది బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 20 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోగా, మిగిలిన 16 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి వారికి అప్పగించారు.

అధికారులు, సిబ్బందికి అభినందనలు..

ఆపరేషన్‌ ముస్కాన్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, మహిళా, శిశు సంక్షేమ శాఖ (సీడబ్ల్యూసీ, డీసీపీయూ), చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, కార్మిక శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాల కార్మికులు, అనాథలు లేదా ప్రమాదంలో ఉన్న చిన్నారులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్‌ 100, 112 లేదా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు సమాచారం అందించి వారి భవిష్యత్‌ను కాపాడడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం

బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ప్రతీ చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యకరమైన బాల్యం రాజ్యాంగం కల్పించిన హక్కు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవు. – శబరీష్‌, ఎస్పీ

విజయవంతంగా ముగిసిన ఆపరేషన్‌ ముస్కాన్‌

యజమానులపై 20 కేసులు నమోదు

పోలీస్‌స్టేషన్ల వారీగా రక్షించబడిన చిన్నారులు

మహబూబాబాద్‌ సబ్‌ డివిజన్‌ : 23 మంది చిన్నారులకు రక్షణ, 10 కౌన్సెలింగ్‌, 12 కేసులు నమోదు

తొర్రూర్‌ సబ్‌ డివిజన్‌ : 17 మంది చిన్నారులకు రక్షణ, 6 కౌన్సెలింగ్‌, 8 కేసులు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement