breaking news
Andhra Bank
-
ALT Text Testing
-
Homepage Title -test
Body Test1Body Test2Body Test3Body Test4Body Test5 -
Bhuma Family: భూమా కుటుంబంలో 'దావా'నలం
దివంగత భూమా నాగిరెడ్డి దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆళ్లగడ్డ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తే భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ ప్రధాన అనుచరుడు గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్య ఈ దావా వేశారు. దీనికి ప్రధాన కారణం నంద్యాల ఆంధ్రా బ్యాంకులోని అప్పును ఎగవేసేందుకు ఓ పథకం ప్రకారం కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి తన పేరుపై ఉన్న భూమిని నంద్యాల ఆంధ్రా బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకున్నారు. నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకూ నెలవారీగా వాయిదాలు చెల్లించారు. వారు చనిపోయిన తర్వాత అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాలని బ్యాంకు నుంచి భూమా వారసులపై ఒత్తిడి పెరిగింది. దీని నుంచి బయట పడేందుకు వారు పథకం రచించారు. బ్యాంకులో రుణం తీసుకునేందుకు ముందే తనఖా పెట్టిన ఆస్తి మాదాల వెంకటరమణయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు ఓ అగ్రిమెంట్ సృష్టించారు. తర్వాత తమకు విక్రయించిన ఆస్తిని తమకు తెలియకుండా బ్యాంకులో తనఖా పెట్టి మోసం చేశారని కోర్టులో దావా వేశారు. అయితే, ఈ దావా దాఖలు వెనుక భూమా వారసుల ప్రమేయం ఉందనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఈ దిశగానే సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. బకాయిల బాగోతం ఇదీ 2011 డిసెంబరు నెలలో భూమానాగి రెడ్డి పేరు మీద ఉన్న సర్వే నంబర్ 66/1 లో 1.94, 66/1 లో 4.37, 73 లో 6.17, 370/1ఎ లో 1.50, 370/ఏ2 లో 4.10, 370 /ఏ3 లో 0.40, 370/బి3లో 0.43, ఎకరాలు, భూమా శోభానాగి రెడ్డి పేరుమీద ఉన్న 356/ఏ, 170/ఏ లోని 1190 చదరపు గజాలు, 75/3 లో 1.08, 75/1లో 013 ఎకరాలు, భూమా శివలక్షమ్మ పేరుమీద ఉన్న 574/1లో 1.00, 574/2లో 1.40 ఎకరాల భూము లను ఉమ్మడిగా నంద్యాల ఆంధ్రా బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకున్నారు. ఈ ఆస్తులను బ్యాంకు తనఖా కంటే 4 నెలల ముందే అంటే 2011 ఆగస్టు 10న తనకు విక్రయించారని, అందుకు సంబంధించి అగ్రిమెంట్ రాసిచ్చారని వెంకటరమణయ్య ఓ అగ్రిమెంట్ సృష్టించినట్లు తెలుస్తోంది. రూ. 30 లక్షలు అగ్రిమెంట్ రోజు ఇచ్చారని, ఆపై 2014 ఫిబ్రవరి 10న మరో రూ.3 లక్షలు ఇచ్చారని దావాలో పేర్కొన్నారు. శోభానాగిరెడ్డి మృతి తర్వాత వారి వారసులు అఖిల, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలు 2016 జనవరి 5న రూ.5 లక్షలు, భూమానాగిరెడ్డి మృతి తర్వాత 2019 డిసెంబర్ 26న రూ.6 లక్షలు తీసుకున్నారని, మిగిలిన సొమ్ము చెల్లిస్తామని సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాలని ఆళ్లగడ్డ కోర్టులో ఈ నెల 6న వెంకటరమణయ్య దావా వేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! తల్లిదండ్రులు మృతి చెందిన తరువాత వారి పేరు ప్రతిష్టలు తగ్గకుండా వారసులు చూస్తారు. ఎవరైనా వారి గురించి తప్పుగా మాట్లాడినా జీర్ణించుకోలేరు. ఇందుకు విరుద్ధంగా భూమా వారసులు రాజకీయంగా పదవులు.. కోట్లాది రూపాయల ఆస్తుల అనుభవిస్తూ వారిపైనే కోర్టులో దావా వేయించడం పట్ల భూమా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడమే కాదు వారు చేసిన అప్పులను కూడా చెల్లించాలని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు పై ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు రూ 100 కోట్ల దాకా ఉంటుంది. ఇంత విలువైన ఆస్తులను భూమా దంపతులు మాదాల వెంకటరమణయ్యకు కేవలం రూ. 45 లక్షలకు విక్రయించారంటే నమ్మశక్యం కావడం లేదని భూమా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎవరీ మాదాల వెంకటరమణయ్య గుంటూరు పట్టణానికి చెందిన వెంకటరమణయ్య ఇటీవల ఆళ్లగడ్డ ప్రాంతంలో తరచూ వినపడుతున్న గుంటూరు శీనుకు తండ్రి. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు శీను అత్యంత సన్నిహితుడు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసు, హైదరాబాద్‌లో స్థలం విషయంలో జరిగిన కిడ్నాప్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆయా కేసుల్లో అఖిలప్రియ, భార్గవరామ్‌తో పాటు గుంటూరు శీను ప్రధాన నిందితుడు. ఇప్పుడు అతని తండ్రి వెంకటరమణయ్య భూమా దంపతులతో పాటు వారి వారసులైన భూమా అఖిలప్రియ, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలపై కోర్టులో కేసు వేయడం ఒక ఎత్తైతే ఆ దావాకు వకాల్తా పుచ్చుకున్నది అభిలప్రియ వ్యక్తిగత లాయరే కావడం విశేషం. బ్యాంకుకు శఠగోపం పెట్టేందుకే! భూమా దంపతులు ఉన్నప్పుడు తీసుకున్న రుణానికి సంబంధించి 2015 సంవత్సరం వరకు క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తూ వచ్చారు. వారు మృతి చెందినప్పటి నుంచి వారసులు కంతులు కట్టక పోవడంతో ప్రస్తుతం సుమారు రూ. 19 కోట్ల వరకు బకాయి పడ్డట్టు తెలుస్తోంది. ఈ రుణం చెల్లించాలని అనేక దఫాలుగా వారి వారసులైన కూతుర్లు, కొడుకుకు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో విసిగి పోయిన బ్యాంకర్లు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని ఇటీవల నోటీసులు పంపించారు. అయితే, సదరు షెడ్యూల్ ఆస్తులు వివాదాస్పదంగా ఉన్నాయని సృష్టిస్తే వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనరు. తద్వారా బ్యాంకులకు శఠగోపం పెట్టొచ్చనే ఉద్దేశంతో తమకు అత్యంత సన్నిహితుడు అయిన గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్యతో దావా వేయించారని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. -
‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి..
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చిన ఒక మహిళ.. మరో మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.65 వేల రూపాయాలను కాజేసింది. ఆ తర్వాత మహిళ, పిల్లలతో సహా అక్కడ నుంచి పరారయ్యింది. కాగా, బాధిత మహిళ తన బ్యాగ్‌లో డబ్బులు కన్పించపోవడంతో కంగారుగా వేతికింది. ఈ క్రమంలో బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా గుర్తుతెలియని మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
బ్యాంకుల విలీనంతో ఖాతాదారుల పరిస్థితి అంతేనా..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల విలీన పరిణామాలతో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త మార్పుల కారణంగా గతంలో ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు బౌన్సయితే చార్జీల భారం పడటం, డివిడెండ్ చెల్లింపులను సక్రమంగా అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత ఎంఐసీఆర్ చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసేందుకు, డివిడెండ్లు మొదలైనవి చెల్లించాల్సిన సంస్థలకు కొత్తగా మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను అందించేందుకు మరింత సమయం పట్టేయనున్నందున విలీన అమలు ప్రక్రియ డెడ్‌లైన్‌ను మరింతగా పొడిగించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగిసింది. అకౌంట్ల అనుసంధానంలో సమస్యలు.. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) నాలుగు పీఎస్బీల్లో విలీనం చేసిన ఉత్తర్వులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకుల సిస్టమ్స్ మొదలైన వాటి అనుసంధానం, కొత్త ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ (ఐఎఫ్ఎస్సీ)ని అమల్లోకి తేవడం వంటి అంశాలకు మార్చి 31 డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, అకౌంట్ల అనుసంధానం మొదలుకుని ఇతరత్రా పలు సమస్యలు ఇంకా ఉంటున్నాయని కస్టమర్లు, పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లలో చాలా మందికి ఏవో కంపెనీల్లో షేర్లో లేదా బాండ్లలో పెట్టుబడులో ఉండే అవకాశముంది. వాటి మీద డివిడెండ్లు, ఇతరత్రా చెల్లింపులు మొదలుకుని ఐటీ రీఫండ్లు కూడా రావాల్సి ఉండొచ్చు. అయితే, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోవడం తదితర పరిణామాల వల్ల ఇలాంటివి పొందడం సమస్యగా మారే అవకాశం ఉంటోంది. పోనీ అలాగని కొత్త మార్పుల గురించి ఆయా సంస్థలకు తెలియజేయాలన్నా చాలా సమయం పట్టేయొచ్చు. ఈ నేపథ్యంలోనే డెడ్‌లైన్‌ను మూడు నెలల పాటు పొడిగించాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇక కొత్త మార్పులకు అలవాటు పడేందుకు కూడా ఖాతాదారులకు ఇబ్బందిగా ఉంటోంది. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఓ కస్టమరు విషయం తీసుకుంటే.. దాదాపు అన్ని లావాదేవీలకు గతంలో ఈ–యూబీఐ యాప్ ఉపయోగించేవారు. కానీ విలీనం తర్వాత ప్రస్తుతం కొత్త యాప్‌ను వినియోగించడం చాలా మటుకు తగ్గించేశారు. యాప్ చాలా సంక్లిష్టంగానే కాకుండా నెమ్మదిగా లోడ్ అవుతుండటం కూడా ఇందుకు కారణమని వివరించారు. ఇక తండ్రి మరణానంతరం ఆయనకు చెందిన సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంటు నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు పైగా పట్టేసిందని మరో యూబీఐ ఖాతాదారు వాపోయారు. ఇలాంటి సాంకేతిక సమస్యలతో విలీన బ్యాంకుల కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఇలా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేశారు. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమయ్యాయి. చదవండి: రిటైల్ రుణాలు.. రయ్రయ్! -
ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్!
ఏప్రిల్ 1 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. తద్వారా వివిధ ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారనున్నాయి. ఈ మార్పులు వల్ల ఆయా బ్యాంకు యూజర్లు ప్రభావితం కానున్నారు. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అలా విలీనం అయిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు నిలిపివేయనున్నారు. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం అయ్యాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. పిఎన్‌బి, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం అయిన బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి సంబంధిత బ్యాంకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నందున పాస్‌బుక్, చెక్‌బుక్, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు అని వారు సమాచారం ఇచ్చారు. సిండికేట్ బ్యాంకు యూజర్లకు ఊరట అదేవిధంగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం అయినసంగతి తెలిసిందే. అయితే, ఇతర బ్యాంకుల్లా కాకుండా సిండికేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు కొంత ఊరటనిచ్చింది. ఈ బ్యాంకు కస్టమర్లు తమ పాస్‌బుక్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారి ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. చదవండి: జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు! సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్!
ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖలు విలీనం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వినియోగదారులు కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ లు కలిగిన కొత్త చెక్ పుస్తకాలను పొందవలసి ఉంటుందని యుబిఐ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్) లావాదేవీల సమయంలో బ్యాంక్ శాఖను గుర్తించడానికి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్(ఐఎఫ్ఎస్సీ) కోడ్ ఉపయోగిస్తారు. అలాగే, చెక్ ప్రాసెసింగ్ కోసం మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్(ఎంఐసీఆర్) కోడ్ ను ఉపయోగిస్తారు. పాత ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖల ఐఎఫ్ఎస్సి, ఎంఐసీఆర్ కోడ్ లు గల చెక్ బుక్స్ 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. పాత బ్యాంక్ వినియోగదారులు తమ బ్రాంచ్ నుంచి కొత్త చెక్ బుక్ పొందాలని లేదా మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎటిఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యుబిఐ బ్యాంకు కోరింది. అయితే, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూజర్లు యూనియన్ బ్యాంకుకు మారినా పాత అకౌంట్ నెంబర్లు అలాగే ఉంటాయి. అకౌంట్ నెంబర్లో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు కస్టమర్ ఐడీ కూడా పాతదే ఉంటుంది. కోత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ మీ బ్రాంచ్‌లో లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తెలుసుకోవాలి. కస్టమర్లకు ఏవైనా సందేహాలుంటే యూనియన్ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44 లేదా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110కు సంప్రదించవచ్చు. చదవండి: ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ -
బ్యాంకు ఉద్యోగులకు బదిలీ శిక్ష!
త్వరలో రిటైరయ్యే వారిపై నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ సమయంలో బదిలీ వేటు! మహిళలని కూడా చూడకుండా ఉన్నఫళాన పొరుగు రాష్ట్రాలకు ‘పని ష్మెంట్ బదిలీ’..! ఇంతకీ వారు చేసిన నేరం.. దర్యాప్తు సంస్థ చట్టబద్ధంగా కోరిన వివరాలను అందచేయడమే! సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తె బ్యాంకు లావాదేవీల వివరాలను దర్యాప్తు సంస్థ ఏసీబీకి అందచేసినందుకు యూనియన్ బ్యాంక్ తమ ఉద్యోగులను ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్స్’ చేయడం సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి భూ కుంభకోణంలో జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెలు భువన, తనూజలపై దర్యాప్తు సంస్థ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. వారి లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఖాతాలున్న బ్యాంకులకు లేఖలు రాసింది. జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరి కుమార్తెల్లో ఒకరి ఖాతా ఆంధ్రాబ్యాంకు (ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైంది)లో ఉంది. ఆమె ఖాతా తాలూకు లావాదేవీలు, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఏసీబీ ఆ బ్యాంకును కోరింది. ఏసీబీ విజ్ఞప్తిపై స్పందించిన బ్యాంకు సిబ్బంది లీగల్ విభాగం అభిప్రాయాన్ని తీసుకున్నారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వడం చట్టబద్ధమేనని లీగల్ విభాగం తెలిపింది. పోలీసులు అడిగిన ఖాతాలు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ శాఖలో ఉన్నాయని గుర్తించారు. దీంతో ఆన్లైన్లో లెడ్జర్ తెరిచి లావాదేవీల వివరాలు పోలీసులకు అందచేశారు. అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల బ్యాంకు లావాదేవీలను ఏసీబీ అధికారులకు ఇచ్చిన తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులపై ఉన్నత స్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ వివరాలను వెల్లడించడం చట్ట విరుద్ధం కాదని అభిప్రాయాన్ని చెప్పిన బ్యాంక్ లీగల్ విభాగం అధికారుల మీద ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘అమరావతి భూ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వారి బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వడం చట్ట విరుద్ధం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలకు దేశంలో చట్టం వేరుగా ఉండదు. వివరాలు పోలీసులకు ఇవ్వడం తప్పేమీ కాదు’ అని లీగల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు బదులిచ్చిన్నట్లు తెలిసింది. ఒక్క బ్యాంకుతో ఆగదని.. అనుమానాస్పద లావాదేవీల వివరాలను వెల్లడించడం ప్రారంభమైతే అది ఒక్క బ్యాంకుతో ఆగదని, మిగతా బ్యాంకుల్లోని ఖాతాల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తారని నిందితులు అనుమానించారు. తమ ఖాతా లావాదేవీల వివరాలను వెల్లడించిన యూనియన్ బ్యాంకు అధికారుల మీద చర్యలు తీసుకుంటే మిగతా బ్యాంకులు వివరాలు ఇచ్చేందుకు జంకుతాయని భావించారు. ఈ నేపథ్యంలో సమాచారం ఇచ్చిన అధికారులకు ‘పనిష్మెంట్’ ఇవ్వాలని యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీనికి తలొగ్గిన అధికారులు విజయవాడ రీజనల్ కార్యాలయంలో పని చేస్తున్న ఐదుగురు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అయితే తామేమీ చట్టవిరుద్ధమైన పని చేయలేదని వారు గట్టిగా తేల్చి చెప్పడంతో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఆ ఐదుగురిని హఠాత్తుగా బదిలీ చేసినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. ఇద్దరు మహిళా అధికారులే.. బదిలీ వేటు విధించిన ఐదుగురిలో ఒకరు లీగల్ విభాగం మహిళా అధికారి కాగా మరొకరు ‘పీ అండ్ డీ’ విభాగానికి చెందిన మహిళా అధికారి. లెడ్జర్ తెరిచి చూసిన మరో ముగ్గురు అధికారుల మీద కూడా బదిలీ వేటు వేశారు. మొత్తం ఐదుగురిలో ముగ్గురిని చెన్నైకి మరో ఇద్దరిని ముంబైకి బదిలీ చేశారు. ముంబైకి బదిలీ అయిన ఓ అధికారి మరో ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న అధికారిని బదిలీ చేయకూడదనే నిబంధనను కూడా బ్యాంకు పాటించకపోవడం గమనార్హం. ఏం తప్పు చేశారని...? ‘కోవిడ్ నేపథ్యంలో 2021 మార్చి వరకు బదిలీలు లేవని నెల క్రితం సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. కోవిడ్ భయం వెంటాడుతున్న సమయంలో 59 ఏళ్ల వయసున్న అధికారిని ముంబైకి బదిలీ చేశారు. ఇలా చేస్తే ఉద్యోగుల ఆత్మవిశ్వాసం దెబ్బతినదా? వాళ్లు ఏం తప్పు చేశారు? చట్టబద్ధంగానే నడుచుకున్నారు’ అని అధికారులు పేర్కొంటున్నారు. బదిలీ షెడ్యూల్ పాటించకుండా.. బ్యాంకు ఉద్యోగులను ఎప్పుడుపడితే అప్పుడు బదిలీలు చేయరు. నిర్దిష్ట షెడ్యూల్లో మాత్రమే బదిలీలు జరుగుతాయి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తె ఖాతా లావాదేవీల వివరాలు ఇచ్చినందుకు వారికి పనిష్మెంట్ శిక్ష విధించడం గమనార్హం. ఉద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు యూనియన్లు గట్టిగా ప్రశ్నించడం సాధారణం. ఈ వ్యవహారంలో సుప్రీంను బూచిగా చూపిస్తూ యూనియన్ నేతల నోరు మూయించినట్లు బ్యాంకు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. -
హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితలో ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్వరూప్ నగర్‌కు చెందిన బాల సుదర్శన్ (38) కింగ్ కోఠి ఆంధ్రా బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య, ఇద్దరు కూతుళ్లు నిద్రిస్తుండగా బాల్కానీలోని హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సుదర్శన్ కుటుంబసభ్యులు మాత్రం పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఐదో అతిపెద్ద బ్యాంక్ యూబీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనం (అమాల్గమేషన్) తర్వాత దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా యూబీఐ అవతరించిందని ఎండీ అండ్ సీఈఓ రాజ్‌కిరణ్ రాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం యూబీఐకు దేశవ్యాప్తంగా 9,500 బ్రాంచీలు, 13,500 ఏటీఎంలు, 120 మిలియన్ల మంది కస్టమర్లున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల వినియోగదారులు తమ డెబిట్ కార్డ్‌లను యూబీఐ ఏటీఎంలలో వినియోగించినా సరే ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కస్టమర్ల ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ పోర్టల్స్‌లో ఎలాం టి మార్పులు ఉండవని.. గతంలో మాదిరిగానే వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నగదు ఉపసంహరణ, నిల్వ, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బేసిక్ సర్వీస్‌లను మూడింట్లో ఏ బ్యాంక్‌లోనైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. -
బోర్డు మారింది.. ప్రస్థానం ముగిసింది
సాక్షి, మచిలీపట్నం: ఆంధ్రాబ్యాంక్ ప్రస్థానం ముగిసింది. యూనియన్ బ్యాంక్‌లో విలీనమైపోయింది. తొంబై ఏడేళ్ల చరిత్ర ఇక చరిత్రపుటల్లో కలిసిపోయింది. జిల్లా కేంద్రమైన బందరులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923వ సంవత్సరం నవంబర్ 28న స్థాపించిన ఆంధ్రాబ్యాంకు 1980లో తీసుకొచ్చిన బ్యాంకుల జాతీయకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా దినదిన ప్రవర్థమానమై 2,885 శాఖలు, 3798 ఏటీఎంలు, 20,346 మంది సిబ్బందితో విస్తరించిన ఈ బ్యాంక్ రూ.3,98,511 కోట్ల వ్యాపారంతో రూ.1,80,258 కోట్ల రుణాలు, రూ.2,16,721 కోట్ల డిపాజిట్లతో దేశంలోనే అగ్రశ్రేణి బ్యాంకుల సరసన నిలిచింది. అంతటి చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనం చేయాలని గత ఏడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తినా, రాష్ట్ర స్థాయిలో వివిధ రూపాల్లో ఉద్యమాలు సాగినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల విలీనం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆరుబ్యాంకులు విలీనం కాగా, జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య పుట్టిన బందరులో పురుడుపోసుకున్న ఆంధ్రాబ్యాంక్ కనుమరుగైంది. బందరులోని వ్యవస్థాపక బ్రాంచ్‌లో బుధవారం ఆంధ్రాబ్యాంక్ స్థానంలో యూనియన్ బ్యాంక్ పేరిట సైన్‌బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా తయారు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆంధ్రాబ్యాంక్ నేమ్ బోర్డు వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. -
నేడే మెగా విలీనం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆంధ్రా బ్యాంకు సహా ఆరు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ విలీన ప్రక్రియను ప్రణాళిక ప్రకారంగానే అమలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత తరుణంలో విలీన ప్రక్రియ అంత సజావుగా జరగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, యాంకర్ బ్యాంకుల చీఫ్‌లు మాత్రం ఎలాంటి సమస్యలూ ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు. ‘అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. సమస్యలేమీ తలెత్తే అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితులను కూడా సమీక్షించే నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులు, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం‘ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ జి తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే దాకా రుణ మంజూరు తదితర ప్రక్రియల్లో ఎలాంటి మార్పులు లేకుండా యథాప్రకారమే కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాల అనుసంధానికి తమ బ్యాంకు కూడా సర్వ సన్నద్ధంగా ఉందని ఇండియన్ బ్యంక్ ఎండీ పద్మజా చుండూరు తెలిపారు. విలీనం కాబోయే అలహాబాద్ బ్యాంక్ కస్టమర్లకు కూడా తమ ఎమర్జెన్సీ రుణ పథకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె వివరించారు. 2020 డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం ఐటీ వ్యవస్థ అనుసంధానం పూర్తి కాగలదని చెప్పారు. విలీన ప్రక్రియతో తమ బ్యాంకు మరింత శక్తిమంతంగా మారగలదని కెనరా బ్యాంకు ఎండీ ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. మరోవైపు, లాక్డౌన్ కారణంగా కొన్ని ప్రక్రియల అమలు మాత్రం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యాంకర్ బ్యాంకుల వర్గాలు తెలిపాయి. ప్రణాళిక ఇదీ.. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేంద్రం.. ప్రభుత్వ రంగంలో బ్యాంకుల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమవుతాయి. అలాగే కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు .. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు .. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమవుతాయి. పీఎన్బీ, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు .. యాంకర్ బ్యాంకులుగా ఉంటాయి. ఈ కన్సాలిడేషన్‌తో ప్రభుత్వ రంగంలో 7 భారీ బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు ఉంటాయి. ఒక్కో భారీ బ్యాంకు పరిమాణం రూ. 8 లక్షల కోట్ల పైగా ఉండనుంది. ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంకుగా పీఎన్బీ ఆవిర్భవిస్తుంది. కెనరా బ్యాంక్ నాలుగో స్థానంలో, యూనియన్ బ్యాంక్ (5), ఇండియన్ బ్యాంక్ ఏడో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉంటాయి. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఉండగా ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులను, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరికొన్ని బ్యాంకులను విలీనం చేయగా 18కి తగ్గాయి. ఇకపై 12 మాత్రమే ఉండనున్నాయి. -
వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం
సాక్షి, అమరావతి : టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గురువారం పత్రికా ప్రకటన జారీచేసింది. ఈ నేపథ్యంలో రూ.837.37 కోట్ల విలువైన రుణం బకాయి పడటంతో గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు సంబంధించిన ఆస్తులను మార్చి 23న వేలం వేస్తున్నట్లు పేర్కొంది. గుంటూరు అరండల్‌పేటలోని 22,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న వాణిజ్య భవనంతో పాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేస్తున్నట్టు తెలిపింది. గుంటూరు భవనం ఆస్తి విలువను రూ.16.44 కోట్లుగాను, ఢిల్లీలోని ఫ్లాట్ విలువను రూ.1.09 కోట్లుగా నిర్ధారించింది. ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ రుణాన్ని ట్రాన్స్ట్రాయ్ ఇండియాతో పాటు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరిట తీసుకున్నారు. ఈ రుణానికి గ్యారంటెర్లుగా రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, జగన్మోహన్ యలమంచలి ఉన్నారు. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంక్ వెబ్సైట్ లేదా టెండర్స్ డాట్ గవ్ డాట్ ఇన్ను సంప్రదించాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు. (రాయపాటిపై ఈడీ కేసు నమోదు) -
రాయపాటికి బిగ్ షాక్
-
స్తంభించిన బ్యాంకింగ్ రంగం
సాక్షి, అమరావతి: వేతన సవరణతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లావాదేవీలు స్థంభించాయి. రాష్ట్రంలోని 4,570 ప్రభుత్వరంగ బ్యాంకుల శాఖల్లో ఒక్క లావాదేవీ కూడా జరగలేదని, సమ్మెలో 45,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన సవరణతో పాటు, ఐదురోజుల పని దినాల అమలు వంటి డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (అయిబాక్) రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ గత వేతన సవరణ గడువు పూర్తయి రెండేళ్లు దాటినా ఇంత వరకు నూతన వేతన సవరణ అమలు చేయలేదన్నారు. కనీసం 20 శాతం పెంచుతూ సవరణ చేయనిదే ఉద్యోగులు అంగీకారం తెలిపే ప్రసక్తి లేదన్నారు. శనివారం విజయవాడ ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
అలా వెళ్లాడు.. ఇలా దొరికిపోయాడు
సాక్షి, కదిరిటౌన్: తన వద్దనున్న వేరొకరి బ్యాంకు పాసుపుస్తకం తీసుకుని, ఖాతాదారు సంతకం ఫోర్జరీ చేసి నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మోసగాడిని బ్యాంకు అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కదిరికి చెందిన గంగిశెట్టి 2019 జూన్ 30న స్థానిక ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లాడు. నిరక్షరాస్యుడు కావడంతో బ్యాంకులో చిప్పలమడుగుకు చెందిన శివ అనే వ్యక్తి సహాయంతో విత్‌డ్రా ఫాం పూరించి, అందులో సంతకం చేశాడు. అదే సమయంలో సెల్‌ఫోన్‌కు ఎవరో కాల్ చేయడంతో గంగిశెట్టి మాట్లాడేందుకని విత్డ్రాం ఫాం, బ్యాంకు పాసుపుస్తకం సదరు వ్యక్తి వద్దే ఉంచేసి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. దరఖాస్తు రాసిచ్చిన శివ అనే వ్యక్తికి దురాశ కలిగింది. సంతకం చేసేసి ఉన్న రూ.27వేల విత్ డ్రా ఫాం తీసుకుని కౌంటర్లోకి వెళ్లాడు. అక్కడ సిబ్బంది ఖాతాదారు ముఖం చూడకుండానే నగదు ఇచ్చేశారు. ఆ తర్వాత నెల రోజులకు గంగిశెట్టి తన పాసుపుస్తకం పోయిందని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన కంప్యూటర్లో పరిశీలించగా ఖాతాలోంచి రూ.27వేలు నగదు డ్రా అయిపోయిన విషయం బయటపడింది. తనకు సహాయం చేసిన వ్యక్తే ఈపని చేసి ఉంటాడని తెలపగా మేనేజర్ కొత్త పాసుపుస్తకం జారీ చేశారు. పాత పుస్తకం ఎవరైనా తీసుకువస్తే స్వాదీనం చేసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు. చదవండి: మైనర్‌పై అత్యాచారం.. 65 ఏళ్ల వృద్ధుడికి మరణ శిక్ష ఈ క్రమంలో శివ శనివారం మరోసారి గంగిశెట్టి ఖాతాలోంచి రూ.2వేలు నగదు డ్రా చేసుకుందామని ఆంధ్రాబ్యాంకుకు వెళ్లాడు. విత్‌డ్రా ఫాం నింపి, పాసుపుస్తకం తీసుకుని కౌంటర్‌కు వెళ్లాడు. అక్కడ నీ పేరేమి అని అడిగితే వాస్తవ ఖాతాదారు పేరు కాకుండా తన పేరు శివ అని చెప్పాడు. మరోసారి అడిగేసరికి పేరు పూర్తిగా చెప్పలేక నీళ్లు నమిలాడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి శివను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
మాకు నగలే కావాలి
చిత్తూరు, యాదమరి : ‘మాకు మా బంగారు నగలే కావాల’ని మంగళవారం యాదమరిలో ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులు ధర్నా చేశారు. యాదమరి ఆంధ్రాబ్యాంకులో చోరీ అయిన బంగారు నగలకు సంబంధించి ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నగదు చెల్లిస్తామన్నారు. అందుకు ససేమిరా అంటున్న ఖాతాదారులు మంగళవారం బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. తమకు నగదు వద్దని.. నగలే కావాలని ధర్నా నిర్వహించారు. చోరీకి గురైన నగలకు సంబంధించి గ్రాముకు రూ.2,600 ఇస్తామని సోమవారం బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఖాతాదారులు నగదు వద్దు నగలు కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడదామని బ్యాంకు అ«ధికారులు సర్దిచెప్పి పంపారు. దీనిపై మంగళవారం బ్యాంక్ అధికారులు స్పందించలేదు. దాంతా ఖాతాదారులు బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. అధికారులను లోనికి వెళ్లనీయకుండా గేటుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పురుషోత్తం రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని ఖాతాదారులతో, బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. ఈ నెల 17న బ్యాంకు డీజీఎం స్థాయి అధికారులు, ఖాతాదారులతో సమావేశం నిర్వహించి చర్చిస్తారని పోలీసులు హామీ ఇవ్వడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు. -
నేడు ఆంధ్రా బ్యాంక్ చివరి వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, అమరావతి: ఆంధ్రా బ్యాంకుకి నవంబర్ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్ 28న బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో గురువారం జరిగే ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుందని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య విగ్రహానికి ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈవో జె.పకీర్‌సామితోపాటు, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళి అర్పించారు. -
బ్యాంకులో మీ బంగారం సేఫేనా?
చిత్తూరు అర్బన్: బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవడం ఆనవాయితీ. బ్యాంకుకు రుణం తీసుకునే వ్యక్తికి మధ్యలో ఆభరణాల విలువ నిర్ధారకుడు కీలకం. అతడే అప్రైజర్. కుదువ పెట్టేందుకు తెచ్చిన ఆభరణాల నాణ్యతలో అప్రైజర్ ఏం చెబితే అదే వేదం. బ్యాంకులో ఇంటర్నల్ ఆడిట్, విజిలెన్స్ విభాగాలున్నా కూడా కిలోల కొద్దీ ఉన్నా ఆభరణాలు అసలైనవా..? గిల్టువా..? నాణ్యతలో ఎన్ని క్యారెట్లు ఉన్నాయి..? అనే విషయాలను గుర్తించడంలో కొందరు బ్యాంకు అధికారులతో పాటు బంగారం కుదువపెట్టి రుణాలు ఇచ్చే ప్రైవేటు సంస్థలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. యాదమరి మండలంలోని మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు ఘటనలో వెలుగుచూసిన వాస్తవాలు అసలు జిల్లాలో బ్యాంకుల్లో కుదువపెట్టిన నగలు అసలైనవా, నకిలీవా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. నిద్దరోతున్న నిఘా.. జిల్లాలో 39 ప్రధాన బ్యాంకులు, 616 ఉప శాఖలు ఉన్నాయి. వీటిలో దాదాపు 40 లక్షల మంది ఖాతాదారులున్నారు. సగటున 60 శాతం మంది బ్యాంకుల నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నారు. ఏటా రూ.వంద కోట్ల వరకు బంగారు ఆభరణాలపై లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ఆభరణాల నాణ్యతను పరిశీలించడంతో పాటు వాటి విలువ లెక్కించడానికి విజిలెన్స్, ఆడిట్ పేరిట తనిఖీలు నిర్వహించాలి. కానీ కొన్ని జాతీయ బ్యాంకుల్లో ఇవి తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ఆడిట్‌కు వచ్చే బృందంలో కూడా అప్రైజర్లదే కీలకపాత్ర. వారు ఆభరణాలు పరిశీలించి అవన్నీ అసలైననవే అని చెబితే ఆ మాటనమ్మి విజిలెన్స్ బృందాలు వెనక్కు వచ్చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం చేతివేళ్లపై అందుబాటులో ఉన్నా కూడా బంగారం నాణ్యతను పరిశీలించడంలో బ్యాంకులు మూస పద్ధతినే ఉపయోగిస్తున్నాయి. ఇక కొన్ని బ్యాంకుల ఏటీఏం కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డులను ఉంచకపోవడం, లోపలున్న సీసీ కెమెరాలు పనిచేయడపోవడం, కొన్ని పనిచేసినా అందులోని దృశ్యాలు అస్పష్టతగా ఉండడం బ్యాంకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఒకే అప్రైజర్‌తో పనులు మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకులో పనిచేసిన అప్రైజర్ రమేష్.. చిత్తూరులోని మరో ఆంధ్రాబ్యాంకుకు సైతం అప్రైజర్‌గా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమైనా గిల్టు నగలు తాకట్టుపెట్టి రుణాలు పొందాడా..? అని బ్యాంకు అధికారులను అడిగితే తెల్లమొహాలు వేస్తున్నారు. పైగా థర్డ్‌పార్టీ ఆడిట్‌కు వెళ్లేప్పుడు పలు బ్యాంకులకు ప్రధాన అప్రైజర్ స్థాయిలో తనిఖీలుచేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు కంటే ఎక్కువ సం ఖ్యలో శాఖలను కలిగి ఉన్న కొన్ని బ్యాంకులు ఒకే వ్యక్తిని అప్రైజర్‌గా నియమించుకుంటున్నాయి. పైగా ఎంపిక సమయంలో అతని గురించి వాకబు చేయకపోవడం, కనీసం పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా అడగకపోవడం ఇక్కడి జవాబుదారితనాన్ని ప్రశ్నిస్తోంది. మాల్యా, నీరవ్ మోదీ లాంటి మహా మోసగాళ్లకు రూ.వేల కోట్లలో రుణాలు ఇచ్చి, ఓ సామాన్య రైతు రూ.లక్ష రుణం అడిగితే మాత్రం లక్ష యక్ష ప్రశ్నలు వేసే బ్యాంకర్లు బంగారు ఆభరణాలపై రుణాల విషయంలో కూడా ఇదే ఉదాతీనత ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సెక్యూరిటీ ఆడిట్ బ్యాంకులో పరిస్థితిపై లీడ్‌బ్యాంక్ మేనేజరుతో కలిసి అన్ని బ్యాంకుల మేనేజర్లతో మరో రెండు రోజుల్లో సమావేశం నిర్వహిస్తాం. సెక్యూరిటీ ఆడిట్ పేరిట బ్యాంకుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏటీఎం కేంద్రాల్లో ఉండాల్సిన కెమెరాల నాణ్యత ఇతర విషయాలపై ఇక్కడ చర్చిస్తాం. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటంపై సమీక్షిస్తాం. – సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు ♦ బ్యాంకులు చూడ మేలిమై యుండు ♦ పొట్లాలు విప్పి చూడ పసిడి నగలుయుండు ♦ అసలు నగలేవో.. నకిలీ నగలేవో తెలియకుండు ♦ ప్రజల సొమ్ముతో జల్సాలేరా రామా..! ♦ ప్రస్తుతం జిల్లాలో బ్యాంకుల పరిస్థితి ఇలాగే తయారయ్యింది. జిల్లాలో బ్యాంకుల గణాంకాలు జాతీయ బ్యాంకులు 370 గ్రామీణ బ్యాంకులు 133 సహకార బ్యాంకులు 31 ఇతర బ్యాంకులు 82 ఖాతాదారులు 40 లక్షల మంది బంగారు రుణగ్రస్తులు 24 లక్షల మంది ఏటా లావాదేవీలు రూ.100 కోట్లు -
క్రిమినల్ ప్లాన్! అప్రైజరే నిందితుడు
మనిషికి ఉన్న వ్యసనాలు వారిపతనానికి దారితీస్తాయనడానికియాదమరి మండలంలోని మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు చోరీ ఘటనేనిదర్శనం. తొలినుంచి ఈ కేసులోఅందరూ మేనేజర్నుఅనుమానించగా.. చివరకు అతను నిర్దోషిగా బయటపడ్డాడు. బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న విగ్రహాల రమేష్ ఆచారి (45)ను పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. చిత్తూరు అర్బన్: యాదమరి ఆంధ్రా బ్యాంకులో చోరీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నిందితుడు అప్రైజర్‌ను అరెస్టు చేసిన అనంతరం చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి వివరాలనువెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుకు చెందిన రమేష్ చదువుకుంది తొమ్మిదో తరగతి. త్వరగా రూ.కోట్లకు పడగెత్తాలన్నది అతని ఆకాంక్ష. 12 ఏళ్ల క్రితం నెల్లూరులో ఓ సినిమాకు సంబంధించి బాక్సు కొని చేతులు కాల్చుకున్నాడు. అటు తరువాత హోటల్ పెట్టినా త్వరగా కోటీశ్వరుడు కాలేకపోయాడు. కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం చిత్తూరుకు చేరుకుని దూరపు బంధువుల ద్వారా ఇక్కడే స్థిరపడ్డాడు. స్నేహితుల సాయంతో 2015లో ఆంధ్రా బ్యాంకులో అప్రైజర్ (ఆభరణాల విలువ నిర్ధారకుడు) పోస్టుకు దరఖాస్తు చేసుకుని రూ.2.50 లక్షలు డిపాజిట్‌చేసి ఉద్యోగం సంపాదించాడు. తాను చెప్పిందే బంగారం.. ఎంత కావాలన్నా రుణాలు. ఇక తన జీవితాశయం నెరవేర్చడానికి స్టాక్ మార్కెట్లు ఒక్కటే దారనుకున్నాడు. బ్యాంకుకు వచ్చే రైతులతో పరిచయాలుపెంచుకున్నారు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను రైతుల ఖాతాల్లో పెట్టి రుణాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇదే సమయంలో గత రెండేళ్లలో ఏడు కిలోల బరువున్న గిల్టు నగలను బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1.30 కోట్ల రుణం తీసుకుని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం ఆవిరైపోయింది. ఇక బ్యాంకు అధికారులు ఆడిట్‌కు వచ్చి నగలు తనిఖీ చేస్తారనే భయం వెంటా డింది. నకిలీ నగలు దొరికిపోతాయని ఓవైపు, అప్పులు తీరాలంటే బ్యాంకులో ఉన్న బంగారు నగలు కూడా కావాలని మరో ఆలోచన రమేష్‌ను చోరీ చేయించి.. ఇప్పుడు దోషిగా నిలబెట్టింది. ‘క్లూ’ కీలకం ఈనెల 14వ తేదీ బ్యాంకులో 18.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత కొందరు అధికారులపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే బ్యాంకులో తాళాలు తీసి చోరీ చేయడం, సీసీ కెమెరాల ఫుటేజీ రికార్డు అయ్యే హార్డ్ డిస్క్ దొంగలించడంతో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉందని అనుమానించారు. ఓవైపు అందరి గురించి ఆరా తీస్తూనే మరోవైపు రికార్డులు పరిశీలించారు. 11వ తేదీ ఒకే ఒక్క వ్యక్తి రూ.5 లక్షలు చెల్లించి తన నగలను బ్యాంకు నుంచి విడిపించుకెళ్లినట్లు గుర్తించారు. మొబైల్ నంబరును సాంకేతిక పరిజ్ఞానంతో చూస్తే 12వ తేదీన మోర్దానపల్లె సెల్‌టవర్ వద్ద చూపించింది. ఆ నంబరు మరెవరిదోకాదు.. అప్రైజర్ రమేష్‌ది. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పేశాడు. జనవరిలోనే బ్యాంకులో చోరీ చేయాలనుకున్న రమేష్ తాళాలను ముద్రించే క్యాస్టింగ్ ఇసుక, బంగారాన్ని కరిగించే యంత్రం సిద్ధం చేసుకున్నాడు. ఓ రోజు మేనేజరు సెలవుపెట్టి ఇన్చార్జ్ మేనేజరుకు తాళాలు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయాడు. రెండు రోజుల పాటు తాళాలు తనవద్దే ఉండడంతో తమిళనాడులోని వేలూరు వెళ్లిన రమేష్ అక్కడ నకిలీ తాళాలు సిద్ధం చేశాడు. ఓసారి క్యాషి యర్ అన్నం తింటుండగా రమేష్ జేబులో క్యాస్టింగ్ ఇసుకను పెట్టుకుని క్యాషి యర్ దృష్టి మరల్చాడు. క్యాషియర్ వద్ద ఉన్న తాళాలను మట్టిలో ముద్రించుకున్నాడు. స్వతహాగా ఆచారి కావడంతో క్యాస్టింగ్ ఇసుకతో ఇత్తడితో తాళాలు తయారు చేసుకున్నాడు. ఈ రెండు తాళాలువేస్తే తప్ప బ్యాంకు తెరుచుకోదు. దీంతో పక్కా ప్రణాళికతో ఈ నెల 12న బ్యాంకులో చోరీ చేశాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజరు, క్యాషియర్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పోలీసులు శ్రమ బ్యాంకులో 442 మంది ఖాతాదారుల నగలు చోరీ కావడంతో ఎస్పీ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. రమేష్ బ్యాంకులో కుదువపెట్టిన ఏడు కిలోల గిల్టు నగలు చిత్తూరులోని కాలువలో పడేయడం, అవి మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చిక్కడంతో వారి నుంచి నకిలీ నగలను రికవరీ చేయడం, చోరీ చేసిన 11.5 కిలోల బంగారు ఆభరణాలతో పాటు తాళాలు, హార్డ్‌డిస్క్, రూ.10.20 లక్షల నగదు, ఓ కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, చిత్తూరు తూర్పు, పశ్చిమ సీఐలు బాలయ్య, ఈశ్వర్‌రెడ్డి, క్రైమ్ సీఐ రమేష్‌కుమార్, భాస్కర్, ఎస్ఐలు నెట్టికంఠయ్య, విక్రమ్, రాజశేఖర్‌లు కీలకంగా పనిచేశారు. వీరిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
వైరాలో ముసుగుదొంగ
సాక్షి, వైరా(ఖమ్మం): వైరా ఆంధ్రాబ్యాంక్‌లో చోరీ చేసేందుకు ఓ దొంగ బుధవారం అర్ధరాత్రి విఫలయత్నం చేశాడు. అలారం మోగడంతో పలాయనం చిత్తగించాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..రోజూలాగే బుధవారం కూడా వైరా పాత బస్టాండ్ సెంటర్లోని ఆంధ్రాబ్యాంక్ సిబ్బంది విధుల అనంతరం బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు. రాత్రి 11.33 గంటల సమయంలో బ్యాంక్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పక్కనే ఉన్న మెడికల్ షాపు యాజమాని మిథున్ చక్రవర్తి 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. శబ్దాలు ఎక్కువ కావడంతో మళ్లీ ఫోన్ చేశాడు. దీంతో రాత్రి 12 గంటల సమయంలో ఏసీపీ, సీఐ, ఎస్ఐ బ్యాంక్ వద్దకు చేరుకుని పరిశీలించారు. చోరీకి యత్నం జరిగినట్లు గుర్తించారు. బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారూ వచ్చారు. బ్యాంకు పక్కనే సందులో ఉన్న గేటుకు తాళం లేకపోవడంతో ముసుగు ధరించిన ఓ దొంగ బ్యాంకు వెనుకవైపు వెళ్లి.. కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. చేతికి, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లిన దొంగ ముందుగా క్యాష్ కౌంటర్లోకి, అటు తర్వాత స్టాఫ్ డైనింగ్ హాల్లోకి వెళ్లాడు. మళ్లీ 5 నిమిషాల తరువాత స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి పరిశీలన చేశాడు. ఈ క్రమంలో ముందుగా తన వెంట తెచ్చుకున్న గడ్డపార, సుత్తి, ఇనుపరాడ్లతో స్ట్రాంగ్ రూంను పగులగొట్టే యత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాంక్‌లోని అలారం మోగింది. దీంతో బ్యాంకు వెనుక నుంచి కూరగాయల మార్కెట్ రోడ్డు మీదుగా మధిర రోడ్డు వరకు వెళ్లాడు. పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించగా.. చోరీ యత్నం పూర్తిగా రికార్డై ఉంది. కాగా చోరీ చేయడానికి ముందే గేటు సమీపంలో బల్బును తొలగించినట్లు, బయట ఉన్న సీసీ కెమెరాను పగలగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ యత్నం జరిగిన ఆంధ్రాబ్యాంక్ పగలు రెక్కీ.. ఆంధ్రాబ్యాంక్ ఎదుట ముగ్గురు వ్యక్తులు బుధవారం మధ్నాహ్నం రెక్కీ నిర్వహించినట్లు సమీపంలోని దుకాణదారులు పేర్కొంటున్నారు. బ్యాంకులో అలారం మోగకపోతే భారీ చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలన వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ వసంతకుమార్‌ల సమాచారం మేరకు ఖమ్మం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం బ్యాంకుకు చేరుకుని పరిశీలించాయి. పోలీసులకు కొన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రత ఏదీ? వైరా: ఖమ్మం జిల్లాలో బ్యాంకులనే టార్గెట్ చేస్తూ చోరీలకు యత్నిస్తున్నారు. వైరా, కారేపల్లి మండలాల్లో ఆంధ్రాబ్యాంక్, డీసీసీబీ, ఎస్బీఐ బ్రాంచిలో చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బ్యాంకు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఖాతాదారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఖాతాదారులు దాచుకున్న బంగారం, నగదుకు భద్రత ఉందా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. కాగా పోలీసులకు ఈ చోరీ యత్నాలు సవాల్‌గా మారుతున్నాయి. ఈ నెల 13వ తేదీన వైరా ఎస్బీఐ టౌన్ బ్రాంచిలో మెట్లపై నుంచి పైకి వెళ్లి షట్టర్ పగులగొట్టి మరీ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు. ఏకంగా సీసీ పుటేజీలో హార్డ్ డిస్క్‌లను, సీసీ కెమెరాలను తొలగించి మరీ చోరీకి యత్నం చేశాడు. ఇక్కడి బ్యాంకులో కనీసం సెక్యూరిటీ కూడా లేడు. షట్టర్ పగులగొడితే బ్యాంకులోకి వెళ్లాడంటే బ్యాంకు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నెల రోజుల క్రితం కారేపల్లి డీసీసీబీ బ్యాంకులో కూడా భారీ యంత్రాలను వినియోగించి బ్యాంకులోకి చొరబడి చోరీ యత్నం చేశారు. అక్కడా కూడా భద్రత చర్యలు ఏమీ తీసుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు బుధవారం అర్ధరాత్రి ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నం జరిపిన ప్రదేశంలో కనీసం ఉన్న గేటుకు కూడా తాళం వేయలేదు. గ్రిల్స్ పగులగొట్టి దొంగ సులువుగా బ్యాంకులోకి ప్రవేశించాడు. కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు. ఏటీఎంల వద్ద కూడా భద్రత ఉండడంలేదు. విచారణ చేస్తున్నాం ఎస్బీఐలో చోరీకి యత్నించింది ప్రొఫెషనల్ దొంగగా గుర్తించాం. విచారణ చేపడుతున్నాం. సీసీ పుటేజీలు కూడా సేకరించాం. బ్యాంకుల వద్ద బ్యాంకర్లు కనీసం జాగ్రత్తలు పాటించాలి. సెక్యూరిటీ గార్డ్స్‌ను రాత్రివేళ్లల్లో నియమించి భద్రత చర్యలు తీసుకోవాలి. జె.వసంత్‌కుమార్, సీఐ, వైరావైరా: ఖమ్మం జిల్లాలో బ్యాంకులనే టార్గెట్ చేస్తూ చోరీలకు యత్నిస్తున్నారు. వైరా, కారేపల్లి మండలాల్లో ఆంధ్రాబ్యాంక్, డీసీసీబీ, ఎస్బీఐ బ్రాంచిలో చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బ్యాంకు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఖాతాదారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఖాతాదారులు దాచుకున్న బంగారం, నగదుకు భద్రత ఉందా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. కాగా పోలీసులకు ఈ చోరీ యత్నాలు సవాల్‌గా మారుతున్నాయి. -
ఆరు కిలోల గిల్ట్ నగలతో రూ.కోటి రుణం
చిత్తూరు అర్బన్ : యాదమరి మండలంలో జరిగిన ఆంధ్రాబ్యాంకు చోరీ కేసు విభిన్న కోణాల్లో మలుపులు తిరుగుతోంది. మండలంలోని మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకులో 17 కిలోల బంగారు నగలు చోరీకి గురైన ఘటనలో అసలు దోషి బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ రమేషేనంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే చోరీలో బ్యాంకు మేనేజర్ పాత్రపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే 11 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మరో 6 కిలోల గిల్ట్ నగలు సైతం చోరీకి గురైనట్లు గుర్తించారు. బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న చిత్తూరులోని గిరింపేటకు చెందిన రమేష్ బ్యాంకునే మోసం చేసి రూ.కోటికిపైగా నిధులు కాజేసినట్లు విశ్వశనీయ సమాచారం. పలువురి పేర్లతో ఆరు కిలోల బరువున్న గిల్ట్ నగలను బ్యాంకులో కుదువపెట్టి రూ.కోటి వరకు రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు తాళాలను సైతం మేనేజర్ పురుషోత్తం నుంచి ఏమార్చి కాజేసినట్లు సమాచారం. చోరీ సమయంలో బ్యాంకులో తాను కుదువపెట్టిన ఆరు కిలోల గిల్ట్ నగలను సైతం చోరీ చేసిన రమేష్.. వాటిని చిత్తూరు నగరంలోని ఓ మురుగునీటి కాలువలో పడేసాడు. ఇవి ఇద్దరు మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దొరికాయి. వారు వీటిని పంచుకున్నారు. తీరా రమేష్ ద్వారా అసలు విషయం రాబట్టిన పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా ఇద్దరు కార్మికుల వద్ద ఉన్న ఐదు కిలోల గిల్ట్ నగలు, రమేష్ వద్ద ఉన్న ఇంకో కిలో గిల్ట్ నగలను సీజ్ చేశారు. ఇక చోరీ జరిగినప్పటి నుంచి అతని కారులో ఉంచుకున్న 11 కిలోల బంగారు ఆభరణాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చిన ఆంధ్రాబ్యాంకు బంగారు ఆభరణాల చోరీ కేసులో చిన్నపాటి విచారణ పూర్తవగానే నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. నగలు ఇవ్వాలని ఆంధ్రా బ్యాంకు ఖాతాదారుల ఆందోళన యాదమరి : బ్యాంకులో కుదవకు పెట్టిన తమ నగలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖాతాదారులు సోమవారం ఆం«ధ్రా బ్యాంకు ముందు చేశారు. గత వారం మండలలోని మోర్థానపల్లె వద్ద ఆంధ్రా బ్యాంకులో ఘరానా చోరీ జరగడం విదితమే. ఈ చోరీకి పాల్పడింది సాక్షాత్తు ఇంటి దొంగలేనని, ఈ నగలను కరిగించారనే వార్తలు రావడంతో ఖాతాదారులు ఉదయం బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న యాదమరి ఎస్ఐ పురుషోత్తం రెడ్డి తన సిబ్బందితో వెళ్లి ఖాతాదారులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
మురుగుకాలువలో 5 కిలోల ఆభరణాలు !
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెలకు రూ.11 వేల వేతనంతో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఐదు రోజుల క్రితం నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద ఉన్న బాణాలవీధిలో మురుగునీటి కాలువలోకి దిగి వ్యర్థాలను తొలగిస్తున్నారు. వారి చేతికర్రకు లోపల నుంచి ఓ రాయి అడ్డు తగినట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా దీన్ని కర్రతో తీయడం సాధ్యపడలేదు. కాలువలోకి దిగి దాన్ని చేత్తో బయటకు తీసి చూస్తే అది రాయి కాదు.. ఓ సంచి. గుండెల్లో ఏదో అలజడి రేగింది. ఇద్దరు కార్మికులు కాస్త పక్కకు వెళ్లి సంచిని తెరచి చూశారు. గుండె ఆగినంత పనయ్యింది. సంచిలో దాదాపు 5 కిలోలకు పైగా ఆభరణాలున్నాయి. 30కి పైగా రకాల గాజులు, 25 రకాల కమ్మలు, 80 వరకు హారాలు, ఉంగరాలు ఉన్నాయి. అక్కడికక్కడ పని వదిలేసి ఇద్దరూ ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. సంచిలో ఉన్న ఆభరణాలను ఇద్దరూ సమంగా పంచుకున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా పనులకు వస్తున్నారు. ఇంట్లో దాచిన ఆభరణాలను రోజూ చూస్తూ మురిసిపోయారు. కానీ సోమవారం నలుగు రు పోలీసులు వెళ్లి ఆ కార్మికుల ఇళ్ల తలుపులు కొట్టారు. మీకు కాలువలో దొరికన ఆభరణాలు ఎక్కడ అని ప్రశ్నించారు. మాకా..? ఆభరణాలు దొరికాయా..? అలాంటిదేమీలేదే.. అని సమాధానమిచ్చారు. ఇదిగో మీరు తీసుకెళుతున్న సంచి వీడియో చూడండి అని చెప్పగానే చేసేదేమీలేక ఒప్పుకున్నారు. ‘అయ్యా.. దొరికిన దాంట్లో కొంతైనా మాకు ఇస్తే ఉన్న కష్టాలు తీరిపోతాయి. కాస్త కనికరించడండి దొరా..!’ అని వేడుకున్నారు. ఒరేయ్ పిచ్చి మొద్దుల్లారా ఇది బంగారం కాదు.. గిల్టు నగలు, పదండి మాతో అని విచారణకు తీసుకెళ్లారు. సీన్ కట్‌చేస్తే చిత్తూరు జిల్లాలోని యాదమరి మండలం ఆంధ్రాబ్యాంకులో పది రోజుల క్రితం చోరీకి గురైన ఆభరణాల్లో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న అప్రైజర్ రమేష్ గిల్టు నగలను బ్యాంకులో ఉంచి రుణం పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడిని తమదైన శైలిలో విచారిస్తే వీటిని పడేసిన కాలువను చూపించాడు. సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా పారిశుద్ధ్య కార్మికుల వద్ద ఉన్న గిల్టు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బ్యాంక్‌లోని 17 కిలోల బంగారం మాయం!
వేసిన తాళం వేసినట్లే ఉంది. గేట్లు.. తలుపులు మూసుకునే ఉన్నాయి. అయినా సరే రూ.కోట్ల విలువచేసే నగలు మాయమైపోయాయి. యాదమరి మండలం మోర్దానపల్లె గ్రామంలోని ఆంధ్రాబ్యాంకులో జరిగిన చోరీ ఇంటి దొంగలపనేనంటూ అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు కిలోల బంగారం మాయమైపోవడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. సాక్షి, యాదమరి/చిత్తూరు అర్బన్ : నిర్మానుష్యమైన ప్రదేశం. అసలు బ్యాంకు పెట్టడానికి ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాని స్థలం. జనసంచారం ఉండదు. ఎక్కడో అడవిలో ఓ మూలన విసిరేసినట్లున్న అద్దె భవనంలో బ్యాంకును పెట్టారు. లోపలకు వెళ్లిచూస్తే స్ట్రాంగ్‌రూమ్‌లు కనిపించవు. సెక్యూరిటీ కనిపించదు. రాత్రికి రాత్రే ఓ జేసీబీ తెచ్చి భవనాన్ని పడగొట్టి బ్యాంకు మొత్తం దోచుకెళ్లినా ఎవ్వరికీ తెలియదు. ఊర్లో జనం బ్యాంకు వద్దకు రావాలన్నా 20 నిముషాలు పడుతుంది. అలాంటి చోట నాలుగేళ్లుగా ఆంధ్రాబ్యాంకును నడుపుతున్నారు. గేట్లకు వేసిన తాళాలు, మూసిన బీరువాలు అలాగే ఉన్నాయి. అసలు బ్యాంకులో ఎక్కడా కూడా చోరీ జరిగిన ఆనవాళ్లులేవు. మొత్తం రూ.6,29 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.34 లక్షల నగదు చోరీకి గురయ్యింది. ఆ నగలపై రూ.3.47కోట్ల రుణాలు బాంకు మంజూరు చేసి ఉంది. ఈ ఘటనలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్‌తో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారిస్తున్నారు. ఎలా జరిగిందంటే.. చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఆనుకుని ఉన్న మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు శాఖలో మేనేజరు పురుషోత్తం, క్యాషియర్ నారాయణస్వామితో పాటు మొత్తం ఆరుగురు పనిచేస్తున్నారు. బ్యాంకులోని లాకర్ (ఓ అల్మారా లాంటిది) తెరవాలన్నా, మూయాలన్నా మేనేజరు, క్యాషియర్ ఇద్దరి వద్ద ఉన్న తాళాలు తీస్తేనే జరుగుతుంది. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం మేనేజరు, క్యాషియర్ అన్నింటిని లాక్ చేశారు. క్యాషియర్ తాళాలు మేనేజర్‌కు ఇచ్చేశారు. ప్రధాన ద్వారానికి సంబంధించిన తాళాలు క్యాషియర్, మేనేజర్ వద్ద ఉంటాయి. ఏ ఒక్కరు వచ్చైనా దీన్ని తెరిచే అవకాశముంది. శనివారం బ్యాంకు సెలవు అయినప్పటికీ మేనేజరు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. ఆదివారం ఎవరూ బ్యాంకుకు రాలేదు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో క్యాషియర్ బ్యాంకు ప్రధాన ద్వారం తెరచి లోపలకు వెళ్లాడు. ఓ టేబుల్‌పై కంప్యూటర్ సీపీయూను తెరిచినట్లు ఉండటాన్ని గుర్తించాడు. కంప్యూటర్లు ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే అవి పనిచేయలేదు. కొద్దిసేపటికి మేనేజర్ కూడా వచ్చి చూడగానే ఇక్కడ చోరీ జరిగిందని సిబ్బందికి చెప్పాడు. పోలీసులకు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్‌చేసి తమ బ్యాంకులో చోరీ జరిగినట్లు సమాచారమిచ్చారు. వెంటనే చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డితో పాటు యాదమరి, చిత్తూరు క్రైమ్ పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పక్కా ప్రణాళికతో.. బ్యాంకులో చోరీ జరిగిన తీరు పరిశీలిస్తే నివ్వరెపోవాల్సిందే. దొంగతనాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్న వ్యక్తి కచ్చితంగా షటర్‌ను పగులగొట్టడమే, గేట్లను విరచడమో చేయాలి. కానీ ఎంచక్కా ప్రధాన ద్వారం తాళాలు తీసి బ్యాంకు లోపలికి వెళ్లి లాకర్ల తాళాలు తీసి, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఇక బ్యాంకు లోపల, బయట సీసీ కెమెరాలు ఉన్నా ఏ ఒక్కటీ పనిచేయలేదు. అలాగని వైర్లను కత్తిరించలేదు. బ్యాంకు లోపలున్న ప్రధాన కంప్యూటర్ సర్వర్‌లో అమర్చిన హార్డ్‌డిస్క్‌ను ముందుగానే తీసుకెళ్లిపోయారు. బ్యాంకులో రూ.4 లక్షలకు పైగా నగదు ఉంటే కేవలం రూ.2.30 లక్షల వరకు మాత్రమే చోరీ చేసి, మిగిలిన నగదును ఇక్కడే వదిలేశారు. ఇవన్నీ చోరీలో బ్యాంకులో పనిచేసేవారి హస్తం ఉందని నిర్ధారిస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే చోరీకి పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది. పైగా బ్యాంకు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చోరీలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకులో నగలు, నగదు చోరీకి గురికావడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. పద్నాలుగేళ్ల క్రితం.. 2005వ సంవత్సరం.. యాదమరి మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి ఇక్కడున్న బ్యాంకు లాకర్లను తొలగించిన దుండగులు ఏకంగా 22 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కొల్లగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో తమిళనాడుకు చెందిన అయ్యనార్, మరో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 19 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఖాతాదారులకు పంచడానికి ఏళ్ల సమయం పట్టింది. మరోవైపు బెయిల్‌పై బయటకొచ్చిన ఈ ముఠా కేరళలోని మరో బ్యాంకుకు కన్నంవేసి అక్కడ 20 కిలోలకు పైగా బంగారం దోపిడీ చేయడం సంచలనం రేకెత్తింది. -
ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్‌లో బారీ దోపిడీ జరిగింది. బ్యాంక్‌లో రూ. 3.5 కోట్లు విలువచేసే తాకట్టు బంగారం మాయం అయింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అలాగే బ్యాంక్ సెక్యూరిటీ, అకౌంటెంట్, క్యాషియర్, అకౌంటెంట్, మేనేజర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ దోపిడీకి సంబంధించి మేనేజర్ సుబ్రహ్మణ్యం పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆంధ్రాబ్యాంకు విలీనం దుర్మార్గపు ఆలోచన
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రాబ్యాంక్ విలీనానికి వ్యతిరేకంగా ఆంధ్రాబ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్(ఏఐబీఈఏ), బీఈఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 22న సమ్మె చేయనున్నట్లు ఏఐబీఈఏ డిప్యూటీ జోనల్ కార్యదర్శి బి.మోహనరావు తెలిపారు. బ్యాంక్ విలీనానికి వ్యతిరేకంగా ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది జీటీరోడ్‌లోని ఆంధ్రాబ్యాంక్ మెయిన్ బ్రాంచి వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను అగౌరవపరచడమేనన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమించి బ్యాంకును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాభాల్లో నడుస్తున్న బ్యాంకును వేరే బ్యాంకులో విలీనం చేయడం దుర్మార్గపు ఆలోచనగా దుయ్యబట్టారు. నిరసన ప్రదర్శనలో ఏఐబీఈఏ మహిళా కార్యదర్శి జి.కరుణ, సహాయ కార్యదర్శి ఎన్.ఎం.కె రాజు, సంతోషి, జయరాం, రెడ్డి, దీపిక, బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యూనియన్ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్ ఓకే
హైదరాబాద్: యూనియన్ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ కూడా విలీనమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి ఇటీవలనే యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ కూడా ఆమోదం తెలిపింది. -
‘ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అందరూ వ్యతిరేకించాలి’
సాక్షి, కృష్ణా: ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడమంటే అయిదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వంద వసంతాల వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేయడం ద్వారా బ్రాంచీలు మూతపడి ఉద్యోగాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆంధప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. కాగా ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. బ్యాంకుల నుంచి మొండి బకాయిలు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎల్ఐసీ, రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోందని దోనెపూడి పేర్కొన్నారు. -
ఆ కంపెనీలకు ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీనం
సాక్షి, విశాఖపట్నం : కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీనం జరిగిందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ది జరిగిన తర్వాత ఆంధ్రాబ్యాంక్ విలీనం చేయడం దారుణమన్నారు. మహారాష్ట్ర బ్యాంకులను ఎందుకు విలీనం చేయరని ప్రశ్నించారు. ఆంధ్రాబ్యాంకు విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 28న విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాగా, గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బ్యాంక్‌ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పది బ్యాంక్‌లు విలీనమై నాలుగు బ్యాంకులుగా అవతరించనున్నాయి. తొంభై ఆరేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనం కానుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ సింధ్ బ్యాంక్‌లు యధాతధంగా కొనసాగుతాయి. ఆంధ్రాబ్యాంక్ విలీనంపై అన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. -
ఆంధ్రాబ్యాంక్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17,200 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సోమవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.13,000 కోట్లు సమీకరిస్తామని తెలిపింది. అలాగే అదనపు టైర్ వన్/టూ బాండ్ల జారీ ద్వారా రూ.4,200 కోట్లు సమీకరిస్తామని వెల్లడించింది. బ్యాంక్‌ల విలీనానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలపడం, రూ.17,200 కోట్ల మేర నిధులు సమీకరించనుండటం వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్ఈలో యూనియన్ బ్యాంక్ షేర్ 2.2% లాభంతో రూ.56.25 వద్ద ముగిసింది. 12కు తగ్గనున్న ప్రభుత్వ బ్యాంక్‌లు... గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బ్యాంక్‌ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పది బ్యాంక్‌లు విలీనమై నాలుగు బ్యాంక్‌లుగా అవతరించనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్‌లు విలీనమవుతున్నాయి. అలాగే కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ సింధ్ బ్యాంక్‌లు కొనసాగుతాయి. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గనున్నది. -
ఏపీలో బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ ధర్నాలు
-
ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తాం
సాక్షి, విజయవాడ : ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల ధర్నాతో విజయవాడ వన్‌టౌన్ దద్దరిల్లుతోంది. బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ ఆంధ్రబ్యాంక్ స్థానిక ఉద్యోగుల యూనియన్ విజయవాడలోని వన్ టౌన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బ్యాంక్ విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. కేంద్రం మొండి వైఖరిని వీడకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రాబ్యాంక్‌ను కాపాడి ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తామంటూ వారు నినాదాలు చేశారు. అదేవిధంగా బడాబాబుల నుంచి మొండి బకాయిలను వసూలు చేసి బ్యాంకును నిలబెట్టాలనేది ప్రతి ఆంధ్రుడి గుండెచప్పుడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలైన మధు, రామకృష్ణలు బ్యాంకు ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా గళం విప్పి వారికి అండగా నిలిచారు. అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరహరిశెట్టి నరసింహారావు కూడా శిబిరం వద్దకు వచ్చి ధర్నాకు సంఘీభావం తెలిపారు. -
9న యూనియన్ బ్యాంక్ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసే క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సెప్టెంబర్ 9న సమావేశం కానుంది. రూ. 11,700 కోట్ల మూలధన సమీకరణ అంశంపై కూడా ఇందులో చర్చించనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు బ్యాంకు తెలియజేసింది. మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో విలీన ప్రతిపాదనను ఆమోదించేందుకు సెప్టెంబర్ 6న బోర్డు సమావేశం కానున్నట్లు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం ఆగస్టు 30న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఆంధ్రాబ్యాంక్ మటుమాయం!
ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఉద్యమంలో ఆవిర్భం చిన ఒక ముఖ్య ఘట్టం సహకార ఉద్యమం. 1904లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు మొదటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అమలులోకి వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ సహకార ఉద్యమానికి, వ్యవస్థకి ప్రోత్సాహం ఇచ్చింది. ఆ ఉద్యమంలో ఒక అంశం ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్‌ని నెలకొల్పడం. బందరులో డాక్టర్ పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు అనేక సంస్థలని, సంస్కరణలను చేపట్టారు. 1915లో పట్టాభి సీతారామయ్య రూ. 50 వేలతో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్‌ను స్థాపించారు. ఆ బ్యాంక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌గా ఎదిగింది. పట్టాభిగారు 1919–1921లో ఆంధ్ర ప్రొవిన్షియల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్‌కి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన పొదుపు ఎలా చేయాలో, ప్రజలకు ధనసహాయం ఎలా చేయాలో నేర్పారు. మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు పట్టాభిగారిని ఉద్దేశించి ‘ధనం సద్వినియోగం చేయడంలో, పొదుపు చేయడంలో పట్టాభి ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్త’ అన్నారు. 1923లో పట్టాభిగారు ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపిం చారు. సామాన్య మానవునికి, రైతుకీ, చిన్న వ్యాపారికీ ధనం అందుబాటులో ఉంచడానికి వీలుగా ఈ వ్యవస్థని పెట్టి రెండు సంవత్సరాలలో 12 శాతం డివిడెండ్ ప్రకటించారు. ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించడం కూడా జాతీయ ఉద్యమంలో ఒక భాగం అన్నారు. బ్యాంక్‌ను స్థాపించడానికి లక్ష రూపాయలు సేకరించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సులభం కాలేదు. ఇంపీరియల్ బ్యాంక్ బందరు మేనేజర్ గార్డన్ అడ్డుపెట్టగా, పట్టాభి గారు మద్రాస్ వెళ్లి ప్రాంతీయ మేనేజర్ ల్యాంబ్‌ను కలిసి పోరాటంలో విజయం సాధించారు. ఆంధ్రా బ్యాంక్ స్వాతంత్య్ర ఉద్యమంలో కట్టుబానిసత్వం నుంచి ఆర్థిక స్వాతంత్య్రానికి అద్దంపట్టిందన్నారు. ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఖ్యాతి గడించడం ఒక ముఖ్య విషయం అని ఆయన గర్వపడ్డారు. 1969లో ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసి, అందుకు కారణం పేద రైతుకి, శ్రామికుడికీ, కార్మికుడికీ ధనం అందుబాటులో ఉంచడమే అన్నారు. అప్పటి ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ కె. గోపాల రావు దీటుగా 50 ఏళ్ల క్రితం మా ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ముందుచూపుతో, ఆ లక్ష్యాలతోనే ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించార’ని అన్నారు. ఆంధ్రా బ్యాంక్ చరిత్ర జాతీయ ఉద్యమంలో భాగం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సేవాభావానికి చిహ్నం. పవిత్రమైన ఆశయాలతో స్థాపితమై క్రమంగా జాతీయ స్థాయికి ఎదిగిన ఆంధ్రా బ్యాంక్ పేరుని మార్చడం ఆంధ్రులకు అవమానం. వ్యాసకర్త: ప్రొ‘‘ అయ్యగారి ప్రసన్నకుమార్, విశాఖపట్నం -
పేరు మాయం!
-
విలీనం వెతలు
ఆర్థిక రంగం నుంచి రోజుకో ప్రమాద ఘంటిక వినిపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల్ని విలీనం చేసి, వాటిని నాలుగు బ్యాంకులుగా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. ఈ విలీనం వల్ల బ్యాంకుల పనితీరు మెరు గుపడటంతోపాటు వాటి నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని, అవి పెద్ద వ్యాపార సంస్థలకు అప్పు లిచ్చే స్తోమత సంతరించుకుంటాయని, మొండి బాకీల సమస్యను అధిగమించగలుగుతాయని, వృద్ధికి ఊతం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వీటితోపాటు బహిరంగ మార్కెట్లో వాటికి నిధులు సేకరణ కూడా ఇకపై సులభమవుతుందని అంటున్నది. మన బ్యాంకులు ఎన్ని సమస్య లతో సతమతమవుతున్నాయో అందరికీ తెలుసు. అందులో ప్రధానమైనది పారు బాకీలైతే, మూల ధన కొరత, విస్తరణ వగైరాలు ఇతరత్రా సమస్యలు. ముప్పు ముంచుకొస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసినట్టు కనబడటం కాక, నికార్సయిన పని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల విలీ నం చర్య పూర్తిగా నిరర్థకమైనదని ఎవరూ అనరు. కానీ అలా విలీనం చేయక తప్పని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో, వాటి మూలాలెక్కడున్నాయో, ఏం చేస్తే అవి విరగడవుతాయో ప్రభు త్వాలెప్పుడూ ఆలోచించినట్టు కనబడదు. అలా ఆలోచించి ఉంటే బ్యాంకుల రుణ వితరణలో రాజ కీయ జోక్యం ఎప్పుడో ఆవిరయ్యేది. అది లేకపోబట్టే బ్యాకులు నిస్సహాయ స్థితిలో పడ్డాయి. అంతక్రితం పూర్తిగా లేదని చెప్పలేంగానీ... దాదాపు 20 ఏళ్లుగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడం అనే ధోరణి పెరిగింది. రఘురాం రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఇలాంటి ఎగవేతదార్ల నుంచి బ్యాంకులకు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నదని ప్రకటించారు. అంతక్రితం యూపీఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమైనా ఆ మాదిరి చర్యకు ఉపక్రమించిన సూచనలు లేవు. రాజకీయ ఒత్తిళ్లతో వెనకా ముందూ చూడకుండా రుణాలిచ్చి నిస్సహాయ స్థితిలో పడిన బ్యాంకులు ఓ పెద్ద బ్యాంకులో విలీనం కావడం వల్ల ఆ బరువు బదిలీ అవుతుంది తప్ప మాయం కాదు. కనుక విలీనం కన్నా ముందు ఆ రుణాలిచ్చే తీరును మార్చడం, బకాయిలను రాబట్టుకోవడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం అత్యవసరం. ఆ పని ఫలితాలనివ్వడం ప్రారంభించాక విలీనం చేసినా అందువల్ల ఎంతో కొంత ప్రయోజనం సిద్ధిస్తుంది. బకాయిలు అధికంగా ఉన్న బ్యాంకులకు కొత్తగా రుణాలిచ్చే అవకాశాన్ని కుదించే విధంగా రిజర్వ్ బ్యాంకు కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇది అమలయ్యాక బకాయిలు రాబట్టడంలో బ్యాంకులు పురోగతి సాధించాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. మంచిదే. కానీ అందువల్ల వాటి వ్యాపా రానికి అవరోధాలు కూడా ఏర్పడ్డాయని గుర్తించుకోవాలి. నిర్దిష్ట శాతానికి మించి బకాయిలున్న బ్యాంకులు కొత్తగా రుణాలివ్వరాదని ఆంక్షలు పెట్టడంతో వాటి వ్యాపారం స్తంభించిపోయింది. ఒక సంస్థకు రుణం ఇచ్చే ముందు దాని కార్యకలాపాలు వ్యాపారపరంగా లాభదాయకమో కాదో అవగాహన చేసుకుని, నిర్వాహకుల గత చరిత్రేమిటో, వారి సామర్థ్యమేమిటో తెలుసుకుని రుణాలు మంజూరు చేస్తే బ్యాంకులకు నష్టాల శాతం ఎక్కువుండదు. ఇలా వృత్తిగత నైపుణ్యంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా మదింపు వేసుకునే అవకాశం బ్యాంకులకు ఉంటే వాటిమధ్య వ్యాపారపరమైన పోటీ పెరుగుతుంది. శరవేగంతో అవి విస్తరించగలుగుతాయి. మన దేశంలో బ్యాంకుల్ని జాతీయం చేసి 50 ఏళ్లు కావస్తోంది. కానీ ఏనాడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల చాలా బ్యాంకులు తమ సామర్థ్యాన్ని సంపూర్ణంగా నిరూపించుకోలేకపోయాయి. కొన్ని బ్యాంకులు పడకేశాయి. ఇప్పుడు విలీనాల వల్ల ఇతరత్రా అంశాలమాటెలా ఉన్నా, పోటీతత్వం మందగిస్తుంది. ఇంతక్రితం రెండు దఫాలు బ్యాంకు విలీనాలు జరిగాయి. కానీ అందువల్ల బ్రహ్మాండం బద్దలైన జాడలేదు. దాని సంగ తలా ఉంచి ఇప్పుడు ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ విలీనం సాహసమనే చెప్పాలి. ఈ ప్రక్రి యంతా పూర్తికావడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది కాలం పడుతుందంటున్నారు. ఈ కాలమంతా ఆ బ్యాంకులు తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేవు. రుణ వితరణ ద్వారా మార్కెట్ పుంజుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఇంత పెద్ద ప్రక్రి యను తలకెత్తుకోవడంలోని తర్కం బోధపడదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చాలా యాంత్రికంగా జరుగుతున్నదని ఇంతక్రితం జరిగిన విలీనాలు నిరూపించాయి. వాటిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆ ధోరణిలో ఏమాత్రం మార్పురాలేదని తాజా నిర్ణయాన్ని చూస్తే అర్ధమవుతుంది. నిజాం కాలంనాటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాలగర్భంలో కలిసిపోయింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఏర్పడిన మూడు బ్యాంకుల పరిస్థితి కూడా అంతే. 1930లనాటి ఆర్థిక మాంద్యంలో ఆవిర్భవించిన విజయాబ్యాంకు ఇంతక్రితం మాయంకాగా, 1906 మార్చిలో ఏర్పడిన కార్పొరేషన్ బ్యాంకు, అదే ఏడాది జూన్‌లో పురుడుపోసుకున్న కెనరాబ్యాంక్, అంతకు కొంచెం ముందు రంగంలోకొచ్చిన సిండికేట్ బ్యాంకు తాజా విలీనం జాబితాలో ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమ నాయకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య చొరవతో 1923లో ఆవిర్భవించి తెలుగు ప్రజల మనోభావాలతో పెనవేసుకున్న ఆంధ్రా బ్యాంకు సైతం కనుమరుగవుతోంది. అది కొన్నేళ్లుగా నష్టాలతో ఉన్న మాట వాస్తవమైనా, ఇప్పు డిప్పుడే వాటినుంచి కోలుకొని లాభాల బాట పడుతోంది. ఇతర బ్యాంకులకు ఆదర్శప్రాయంగా ఉంది. దాని వెనకున్న జాతీయోద్యమ చరిత్రను గౌరవించి, దానికిగల కోలుకునే సామర్థ్యాన్ని గుర్తించి ఆంధ్రాబ్యాంకును అలాగే ఉంచి మరో బ్యాంకును అందులో విలీనం చేసి ఉంటే బాగుం డేది. కానీ విలీనంపై తప్ప మరి దేనిపైనా పాలకులకు ధ్యాస ఉన్నట్టు లేదు. ఇది సరైంది కాదు. -
‘ఏపీకి మరోసారి బీజేపీ ద్రోహం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వన్‌టౌన్ ఆంధ్రా బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు మాట్లాడుతూ.. 90 వేల శాఖలు కలిగిన ఆంధ్రాబ్యాంక్‌ను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధి కోసమే విలీనం చేస్తున్నామంటూ.. బీజేపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఆంధ్రా బ్యాంక్ విలీనానికి కమ్యూనిస్టు పార్టీలు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఏపీకి బీజేపీ ద్రోహం.. బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏపీకి ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని సీపీఎం, సీపీఐలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. నిరంకుశ విధానాలు మానుకోవాలి.. వైఎస్సార్ జిల్లా: ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కడప నగరంలోని ఏడు రోడ్లు సర్కిల్లో ఆంధ్రా బ్యాంక్ ఎదుట సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. తెలుగు ప్రజల పట్ల ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ విధానాలు మానుకోవాలని హితవు పలికారు. -
ఆంధ్రాబ్యాంక్ ఇక కనపడదు
మచిలీపట్నం: తొంభై ఆరేళ్ల చరిత్ర కాలగర్భంలో కలసిపోతోంది. శత వసంతాల సంబరాలకు సిద్ధమవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బందరులో పురుడు పోసుకున్న తెలుగోళ్ల బ్యాంక్ కనుమరుగు కాబోతుందనే విషయాన్ని ఈ ప్రాంత వాసులు జీజీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అనాలోచిత నిర్ణయమని బ్యాంక్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. కేంద్రం తీరుపై ప్రజాసంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇదీ ప్రస్థానం బందరులో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆర్థిక తగాదాను పరిష్కరించే క్రమంలో స్వాతంత్య్ర సమరయోథుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్ స్థాపనకు పూనుకున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో ఆర్థిక పటిష్టత అవసరమని గుర్తించిన ఇంకొంతమంది పట్టాభికి వెన్నుదన్నుగా నిలిచారు. అలా 1923 నవంబర్ 20న రూ.లక్ష మూలనిధితో భోగరాజు ఇంట్లోనే ఆంధ్రాబ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభయ్యాయి. పొదుపుతో మూలధనం పోగుచేయడం ద్వారా రైతుల ఆర్థిక అవసరాల్ని తీర్చటానికి భోగరాజు రచించిన ప్రణాళికలు ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలిచాయి. 1980లో రెండో దఫాగా చేపట్టిన బ్యాంకుల జాతీయకరణతో ఆంధ్రాబ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగానికి ఇతోధిక సేవలందిస్తూ వస్తోంది. 1981లో క్రెడిట్ కార్డులను మన దేశానికి పరిచయం చేసిన బ్యాంక్‌గా ఇది పేరొందింది. పెట్టుబడులను రాబట్టడంలో ఆసియాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టాభి జ్ఞాపకాలు పదిలం బ్యాంక్ ఆర్థిక పటిష్టతకు పునాదులు వేసిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకాలు మచిలీపట్నంలో నేటికీ పదిలంగానే ఉన్నాయి. బ్యాంక్‌లో డబ్బు దాచేందుకు ఉపయోగించిన ఇనుప బీరువా పట్టాభి రోడ్‌లోని వ్యవస్థాపక బ్యాంక్‌లో నేటికీ ఉంది. భోగరాజు నివసించిన ఇంట్లో గాంధీ కస్తూర్బా సేవా సమితి పేరుతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్ ఆర్థిక సహకారంతో పట్టాభి సీతారామయ్య ట్రస్ట్ ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానుండటంతో పట్టాభి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ కల్పన శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయా లేదా అనేది చర్చనీ యాంశమైంది. తెలుగోడి బ్యాంక్ లేకుండా చేస్తారా? తెలుగోడు స్థాపించిన బ్యాంక్‌ను లేకుండా చేయటం బాధాకరం. స్వాతంత్రోద్యమ కాలంలో ఆర్థిక భరోసా కలి్పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్‌కు ఎంతో చరిత్ర ఉంది. – గుడివాడ వెంకట గున్నయ్యశెట్టి, వ్యవస్థాపక డైరెక్టర్ -
నిర్మలా సీతారామన్‌కు కేవీపీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బ్యాంకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతుంటే, ప్రజాప్రతినిధులు కేంద్రానికి లేఖలు రాస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఆంధ్రాబ్యాంకు విలీనంను ఆపివేయాలని, పబ్లిక్ సర్వీస్ బ్యాంక్‌గా కొనసాగించాలని కోరారు. విలీనం తప్పనిసరైతే బ్యాంకు పేరును అలాగే కొనసాగించాలనికేవీపీ విజ్క్షప్తి చేశారు. ఆంధ్రాబ్యాంక్ విలీనం తెలుగు ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఉందని, పట్టాభి సీతారామయ్య జ్ఞాపకంగా తెలుగు వారికి గుర్తుగా ఆంధ్ర బ్యాంకు పేరును కొనసాగించాలి లేఖలో పేర్కొన్నారు. -
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల నిరసన
-
హైటెక్ మార్ఫింగ్ మాయ!
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : ప్రభుత్వం అందించే పథకాలు అడ్డదారిలోనైనా దక్కించుకోవడానికి కుతంత్రాలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఎంతటి అక్రమాన్నైనా చేసేసే ప్రబుద్ధులు ఇందుకు తోడ్పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌కు అర్హత వయసు సరిపోకపోతే దానిని ఆధార్‌లో మార్చేసి అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్న వైనం తాజాగా బయటపడింది. చీపురుపల్లి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్‌లో కొంతకాలంగా ఆధార్ నమోదు కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో డబ్బులిస్తే వయస్సు మార్చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 వేల నుంచి రూ.5 వేలు తీసుకుని పక్క జిల్లా శ్రీకాకుళం నుంచి కూడా లబ్ధిదారులను తీసుకొచ్చి ఇక్కడ వయస్సు మార్ఫింగ్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ఓ మీసేవా కేంద్ర మాజీ నిర్వాహకుడు బ్రోకర్ అవతారమెత్తినడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్‌కార్డులో వయస్సు మార్చడానికి నాలుగైదు వేలు ఖర్చుచేస్తే ఆ తరువాత నెలకు రూ.2 వేలు దాటి పెన్షన్ వస్తుంది అంటూ లబ్ధిదారులను మభ్యపెట్టి 65 సంవత్సరాలు నిండని వారిని సైతం ఆధార్‌కార్డులో మార్చేస్తూ కొత్త కార్డులు సృష్టిస్తున్నారు. వెలుగు చూసిందిలా... శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో గల సీతారాంపురం గ్రామానికి చెందిన పది మంది లబ్ధిదారులు శుక్రవారం ఇక్కడకు రావడంతో ఈ తతంగం బయటపడింది. వారిని ప్రశ్నించగా తాము ఆధార్‌కార్డు మార్చడానికి వచ్చామని బదులిచ్చారు. ఓ ఆటోలో వచ్చిన పది మందిని ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌కాలనీ సందులో ఉంచి ఇద్దరేసి ఒకసారిగా బ్యాంకులోకి వచ్చి తమ పనులు ముగించుకుని వెళుతుండటాన్ని గమనించిన విలేకరులు వారిని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా చల్లగా జారుకున్నారు. రాజాం పట్టణంలో ఓ మీసేవ కేంద్ర మాజీ నిర్వాహకుడు బ్రోకర్‌గా అవతారమెత్తి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. వీరిని తీసుకువచ్చిన ఆటోవాలా సత్యనారాయణ సాక్షితో మాట్లాడుతూ సీతారాంపురం నుంచి పది మందిని బేరం కుదర్చుకుని తీసుకొచ్చాననీ, రాజాంలో ఓ వ్యక్తికి వీరంతా డబ్బులిచ్చారనీ, తరువాత చీపురుపల్లి ఆంధ్రాబ్యాంకు దగ్గరకు తీసుకెళ్లమంటే తీసుకొచ్చాననీ తెలిపారు. ప్రూఫ్ లేకుంటే మార్చడం కుదరదు ప్రూఫ్ ఉంటే తప్ప వయస్సు మార్పిడి కుదరదు. రోజుకు 40 వరకు ఆధార్ నమోదు, మార్పిడులు వస్తాయి. అందులో అత్యధికంగా బయోమెట్రిక్, సెల్ నంబరు, అడ్రస్ మార్పులు వంటివి అధికంగా ఉంటాయి. ఒకటో రెండో వయస్సు మార్పిడి ఉంటే దానికి కచ్చితంగా ప్రూఫ్‌లు ఉంటేనే మారుతుంది. ప్రతీ దరఖాస్తును విచారించిన తరువాతే ఆధార్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎలాంటి వయస్సు మార్పిడి ప్రక్రియ జరగడం లేదు. – ఎ.ప్రసాద్, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్, చీపురుపల్లి -
నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ
సాక్షి, అవుకు(కర్నూలు) : మండలంలోని రామాపురం ఆంధ్రాబ్యాంక్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి బ్యాంక్‌నే బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.40 లక్షల వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్‌కు కొత్త మేనేజర్ రావడంతో ఈ వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. రామాపురంలోని ఆంధ్రాబ్యాంక్‌లో కాంట్రాక్ట్ ప్రతిపదికన గోల్డ్ అౖప్రైజర్‌గా శ్రీనివాసులు అనే వ్యక్తి నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. రుణాల కోసం ఖాతాదారులు తెచ్చే బంగారం సరైనదా లేదా అని బ్యాంక్ అధికారులకు ఈయన నివేదిక అందిస్తారు. అనంతరం రుణాలు మంజూరు అవుతాయి. అయితే నమ్మకంగా ఉండాల్సిన గోల్డ్ అప్రైజర్..అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. చనుగొండ్ల, శింగనపల్లె, అవుకు చెందిన 12 మంది ఖాతాదారుల సంతాకాలు తీసుకొని నకలీ బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంక్ డబ్బును కాజేశాడు. ఇటీవల మేనేజర్ లింగన్న బదిలీ కాగా.. నంద్యాల శివారులోని ఉడుమార్పరం ఎస్బీఐ శాఖ నుంచి రామాపురానికి నవీన్ కుమార్ రెడ్డి బ్యాంక్ మేనేజర్ బదిలీపై వచ్చారు. ఖాతాదారులకు సంబంధించి అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే రుణాలకు సంబంధించిన వివరాలు నూతన మేనేజర్‌కు అప్పజేప్పే క్రమంలో నకిలీ బంగారం వ్యవహారం బట్టబయలైంది. సంబంధిత రైతులను విచారించగా తాము ఎలాంటి రుణాలు పొందలేదని చెప్పడంతో సదరు గోల్డ్ అప్రైజర్ శ్రీనువాసులు అక్రమాలు బయటపడ్డాయి. -
మెగా బ్యాంకుల సందడి!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎస్బీఐ, బీవోబీ తర్వాత మరో రెండు మెగా బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దఫా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్‌లలో ప్రభుత్వ రంగంలోని మరికొన్ని బ్యాంకులను విలీనం చేయడంపై కసరత్తు ఆరంభమయింది. పీఎన్బీలో రెండు లేదా మూడు చిన్న సైజు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. విలీనమయ్యే బ్యాంకుల లిస్టులో ఆంధ్రా బ్యాంకుతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) అలహాబాద్ బ్యాంక్‌ల పేర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో ఈ బ్యాంకులను టేకోవర్ చేసే ప్రక్రియను పీఎన్బీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొండిబాకీల భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విలీనాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో గట్టి పట్టున్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు పీఎన్బీ గతేడాదే ప్రయత్నాలు చేసింది. విజయ బ్యాంకుపై కూడా దృష్టి పెట్టింది. అయితే, మొండి బాకీలు ఏకంగా 18 శాతానికి ఎగియడం, నీరవ్ మోదీ కుంభకోణాల ప్రభావం తీవ్రంగా పడటం వంటి పరిణామాలతో ఇతర బ్యాంకులను విలీనం చేసుకునే యత్నాలు తాత్కాలికంగా విరమించుకుంది. ప్రస్తుతం కోలుకుంటూ ఉండటంతో విలీన ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అధికార పార్టీతో పాటు విపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న దరిమిలా ఈ విలీన ప్రక్రియ జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు భారీ బ్యాంకులు.. 2017లో ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం అయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో ఎస్బీఐ చోటు దక్కించుకుంది. ఇక ఈ ఏడాది తొలినాళ్లలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయ బ్యాంక్‌లను కలిపేశారు. దీంతో 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 ఉద్యోగులతో ఎస్బీఐ తర్వాత దేశీయంగా రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చింది. ఇక గతేడాది మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన ఐడీబీఐ బ్యాంకును ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ టేకోవర్ చేసింది. ఇందులో కేంద్రమే కీలకపాత్ర పోషించింది. పెద్ద బ్యాంకులతో.. ఎక్కువ ప్రయోజనాలు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 159 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఏకంగా 1,44,952 శాఖలతో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ నిలుస్తోంది. అయితే, చిన్నా చితకా బ్యాంకులు పెద్ద సంఖ్యలో ఉండటం కన్నా.. మెరుగైన భారీ బ్యాంకులు కొన్ని ఉండటం ఎకానమీకి శ్రేయస్కరమని కేంద్రం భావిస్తోంది. ఇందుకు తగినట్లుగానే.. బీవోబీలో రెండు బ్యాంకుల విలీనం తర్వాత ప్రభుత్వ రంగంలో బ్యాంకుల సంఖ్య 21 నుంచి 18కి దిగి వచ్చింది. వీటిని కూడా కుదించి దాదాపు 6 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వం, ఆర్థిక నిపుణుల అభిప్రాయం. తదనుగుణంగానే కొన్ని మధ్య స్థాయి బ్యాంకులు కేంద్రం దృష్టిలోకి వచ్చాయి. ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంకులను కాస్త పెద్దవైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లలో విలీనం చేసే అంశం తెరపైకి వచ్చింది. విలీనాలకు అనేక కారణాలు.. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను విలీనం చేసి భారీ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వెనుక చాలా కారణాలే ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. ►చిన్న బ్యాంకులు ఇటు మొండిబాకీల సమస్యలను అటు రుణ వృద్ధి సవాళ్లను (ముఖ్యంగా పారిశ్రామిక రంగాలకు రుణాలు) సమర్ధంగా ఎదుర్కొనలేకపోతున్నాయి. దీంతో వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. వాటిని గాడిన పెట్టేందుకు, నిధుల సమీకరణ సామర్థ్యాలను పెంచేందుకు మెరుగైన ఇతర బ్యాంకులో విలీనం చేయొచ్చన్నది ఒక అభిప్రాయం. ► చిన్న బ్యాంకుల వ్యాపార కార్యకలాపాలు కొంత స్థాయికి మాత్రమే పరిమితం అవుతాయి. అదే పెద్ద బ్యాంకులైతే భారీ స్థాయిలో కార్యకలాపాలు ఉండటం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వీటిలో విలీనం కావడం వల్ల చిన్న బ్యాంకులు తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ సమస్యలను అధిగమించేందుకు వీలుంటుంది. ► విలీనంతో బ్యాంకింగ్ కార్యకలాపాల వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు మొండిబాకీల నిర్వహణ, రిస్కు మేనేజ్మెంట్ మెరుగుపర్చుకోవచ్చు. ► అధిక మూలధనం, అధిక లిక్విడిటీ అందుబాటులో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం పదే పదే అదనపు మూలధనం సమకూర్చాల్సిన భారం తగ్గుతుంది. ► ఇక భారీ బ్యాంకులో భాగంకావడం వల్ల భౌగోళికంగా సేవలను మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. పెద్ద బ్యాంకులు మరిన్ని పథకాలు, సర్వీసులు అందించడం ద్వారా ప్రొఫెషనల్ ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ బ్యాంకింగ్ రంగ వృద్ధికి తోడ్పడవచ్చు. అలాగే, భారీ భారతీయ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మెరుగైన రేటింగ్ లభించవచ్చు. మరో తెలుగు బ్యాంకు కనుమరుగు.. ఒకవేళ ఈ విలీన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో బ్యాంకు కనుమరుగు కానుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఉనికి కోల్పోయింది. అదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (పీఎన్బీ) విలీనమైతే ఆంధ్రా బ్యాంకు కూడా కనుమరుగు కావచ్చు. -
బ్యాంక్ కుంభకోణంపై ఆన్లైన్లో ఫిర్యాదు
గుంటూరు, కాజ(మంగళగిరి): మండలంలోని కాజ ఆంధ్రాబ్యాంక్‌లో నకిలీ బంగారం కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నట్లు సమాచారం. బ్యాంకు పెట్టిన నాటి నుంచి గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్న గుత్తికొండ ప్రసాద్‌కు ముప్పై సంవత్సరాల అనుభవం, స్వగ్రామం కావడంతో ఏ అధికారి వచ్చినా అతడు చెప్పినట్లే జరిగేదని సమాచారం. గ్రామంలో మంచి పేరున్న ప్రసాద్.. గోపి మాటల మాయలో పడి నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి రుణం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రసాద్‌కు వాటాలున్న కారణంగానే ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. కుంభకోణం గురించి స్థానిక అధికారులు గోప్యం పాటిస్తుండగా, ఉన్నతాధికారులు ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, రాతపూర్వకంగా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని కోరినట్లు తెలిసింది. మరో వైపు విషయం బయటకు పొక్కిననాటి నుంచి గంధం గోపి పరారవ్వడం గమనార్హం. ముందే బ్యాంకులో మాట్లాడుకున్న అతడు, ఓ యువకుడిని తీసుకుని వెళ్లి ఖాతాను ప్రారంభించాడు. తర్వాత బంగారం తనఖా పెట్టి యువకుడి ఖాతాలోకి వచ్చిన నగదును తన ఖాతాలోకి మార్చుకుని జల్సా చేసినట్లు చర్చ జరుగుతోంది. రుణం తీసుకున్న యువకులు పలువురిని గత కొద్దికాలంగా గోవా తదితర ప్రాంతాలకు తిప్పి, వారితో పాటు కలిసి జల్సా చేశాడని, దీంతో వారంతా రుణం తీసుకునేందుకు సహకరించారని సమాచారం. ఎలాగైనా బ్యాంకు నగదు జమ చేసి కేసులు లేకుండా చూసుకుని తమ భవిష్యత్తును కాపాడుకోవాలని గత మూడు నెలల నుంచి బ్యాంకు ఉద్యోగులంతా గ్రామ పెద్దలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కొలిక్కి రాలేదు. విషయం బయటకు పొక్కడంతో బ్యాంక్ ఉన్నతాధికారులు సైతం తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఇక నకిలీ బంగారంతో రుణాలు తీసుకోకపోయినా, అవి తమ పేర్లతో ఉండడంతో కేసులు తమ మెడలకు ఎక్కడ చుట్టుకుంటాయోనని గోపికి సహకరించిన వారి కుటుంబాలను వేధిస్తోంది. ఇంత జరుగుతున్నా బ్యాంక్ అధికారులు మాత్రం నోరు విప్పకపోవడం గమనార్హం. -
సుజనాకు సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రుణాల ఎగవేత కేసులో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుజనా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉద్దేశపూర్వకంగా తమను రూ. 71 కోట్ల మేరకు మోసం చేసిందంటూ ఆంధ్రా బ్యాంకు 2017లో ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నై కేంద్రంగా నడిచిన ఈ కంపెనీలో కాకులమర్రి శ్రీనివాస కల్యాణరావు సహా ఐదుగురు మేనేజింగ్ డైరెక్టర్ల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. భారత శిక్షా స్మృతిలోని నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కంపెనీపై అభియోగాలు మోపింది. ఇదీ నేపథ్యం.. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) చెన్నైలోని ఆంధ్రా బ్యాంకుతోపాటు సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులతో కూడిన కన్సార్షియం నుంచి 2010 నుంచి 2013 మధ్య రూ. 364 కోట్ల రుణం తీసుకుంది. వాటిలో ఆంధ్రా బ్యాం కు నుంచి పొందిన రూ. 71 కోట్లను బీసీఈపీఎల్ కొనుగోళ్లు, విక్రయాలు జరిపినట్లు నకిలీ ఎంట్రీలు సృష్టించి తద్వారా ఆ సొమ్మును కుట్రపూరితంగా డొల్ల కంపెనీల్లోకి బదిలీ చేసుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆంధ్రా బ్యాంకు చేసిన ఫిర్యాదుతో నమోదైన కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంబించింది. బ్యాంకు రుణాల నిధులను సుజనా... బినామీ కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించింది. ఇందుకోసం పలు డొల్ల కంపెనీలను ఆయన సృష్టించినట్లు, పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు కూడా తేల్చింది. దీంతో కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి బదిలీ చేసింది. ఈ క్రమంలోనే సుజనా గ్రూప్‌లో పెద్ద మొత్తంలో డొల్ల కంపెనీలున్నట్లు ఈడీకి సైతం ఆధారాలు లభించాయి. సుజనా సృష్టించిన వైస్రాయ్ హోటల్స్ అండ్ మహల్ హోటల్ పొందిన రుణంలో నుంచి నగదును బదిలీ చేశారు. దీంతో వైస్రాయ్ హోటల్స్ అండ్ మహల్ హోటల్‌కు చెందిన రూ. 315 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులోని సంస్థ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈడీ దాడుల్లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట నాగార్జునహిల్స్‌లోని సుజనా కంపెనీలో ఈడీ అధికారులకు 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. -
ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నం
సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకులో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. బెల్లంపల్లి ఏసీపీ వి.బాలుజాదవ్ వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2:05 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి టీషర్టు, ప్యాంటు ధరించి ముఖం కనబడకుండా వస్త్రం కట్టుకుని బ్యాంకు ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న గడ్డపారతో తాళాన్ని పగులగొట్టి షెటర్‌ను పైకి లేపి లోనికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన అగంతకుడు నేరుగా డబ్బు భద్రపర్చి ఉన్న లాకర్ల వద్దకు వెళ్లి పగులగొట్టేందుకు యత్నించాడు. గడ్డపారతో లాకర్‌ను తెరవడానికి శతవిధాల ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే ప్రధాన ద్వారం పక్కనే ఉన్న ఏటీఎం గది వద్దకు వచ్చాడు. ఏటీఎం గదిని ధ్వంసం చేసి లోనికి వెళ్లడానికి యత్నించే క్రమంలో సైరన్ మోగింది. ఆన్లైన్ సెక్యూరిటీ ఫోన్ ముంబై నుంచి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రాములు, ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ ప్రసాద్‌కు ఏకకాలంలో వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎస్‌హెచ్‌వో సిబ్బందితో హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆ లోపే అగంతకుడు పరారయ్యాడు. ఫింగర్ ప్రింట్స్ సేకరణ.. ఆన్లైన్ సెక్యూరిటీ ఫోన్ అలర్ట్ చేయడంతో ఎస్‌హెచ్‌వోతో పాటు బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ఏకకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోనికి వెళ్లి ఏం జరిగిందో పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు లాకర్లను తెరవడానికి గడ్డపారతో చేసిన తవ్వకాలు, ధ్వంసం చేసిన పరికరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించారు. తెల్లవారుజామున జాగిలాన్ని రప్పించి వ్యక్తి ఆచూకీ కోసం యత్నించారు. జాగిలం బ్యాంకు పక్కనే ఓ వీధి వరకు వెళ్లి వెనక్కివచ్చింది. అగంతకుడు ఆ వీధిలోంచి పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలన.. చోరీ జరిగిన తర్వాత పోలీసులు నేరుగా బ్యాంకులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అగంతకుడు ఎక్కడి నుంచి బ్యాంకులోకి ప్రవేశించాడు, డబ్బుకోసం యత్నించిన తీరును ఎస్‌హెచ్‌వోతో పాటు ఏసీపీ బాలుజాదవ్ సీసీ కెమెరాల్లో చూశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. లావుగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కడే బ్యాంకులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. కాని బయట ఇంకెవరైనా ఉన్నారా లేదా ఒక్కడే ఈ సాహసానికి ఒడిగట్టాడా అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో.. బ్యాంకుల వద్ద గతంలో రాత్రిపూట సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహించేవాడు. కాని కొన్నాళ్ల క్రితం నుంచి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును తొలగించారు. దీంతో అగంతకుడు రాత్రిపూట చోరీకి యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పట్టణంలో రాత్రిపూట పోలీసు గస్తీ ఉన్నా అగంతకుడు బ్యాంకు చోరీకి యత్నించి పోలీసులకు సవాల్ విసిరినంత పనిచేశాడు. బ్యాంకుల వద్ద పాయింట్ బుక్ పెడతాం.. బ్యాంకుల వద్ద భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డు ఉంటే అగంతకుడు చోరీకి యత్నించేవాడు కాదన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సెక్యూరిటీ గార్డును నియమించేలా చూస్తామన్నారు. పెట్రోలింగ్ పోలీసులు రాత్రిపూట బ్యాంకును విధిగా తనిఖీ చేయడానికి పాయింట్ బుక్ పెడతామని వెల్లడించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. -
వేలానికి రాయపాటి ఇల్లు
సాక్షి, అమరావతి: తీసుకున్న రుణాలను తిరిగి తీర్చని నేపథ్యంలో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి ఆంధ్రా బ్యాంక్ తాజాగా వేలం ప్రకటన జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–7లో ఉన్న జీ+3 వాణిజ్య భవనాన్ని 25/04/2019న వేలం వేస్తున్నట్లు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది. 631 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బిల్డింగ్ కనీస ధరను రూ.7,36,14,000గా నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనేవారు ధరావత్తు కింద రూ.73,61,400 జమ చేయాల్సి ఉంటుంది. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ మార్చి 20 నాటికి రూ.748.77 కోట్లు రుణాలు బకాయి ఉండటంతో కంపెనీకి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ఆ ప్రకటనలో పేర్కొంది. చదవండి....(ఆర్థిక నేరగాళ్లకు టీడీపీ అడ్డా) ఈ రుణానికి గ్యారంటర్లుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారులు రాయపాటి రంగారావు, కుమార్తెలు దేవికారాణి, లక్ష్మీలతోపాటు మొత్తం 14 మందికి నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్లకుపైగా రుణాలను తీసుకుని ఎగ్గొట్టింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును నిర్మించే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని అందరూ మొత్తుకున్నా సీఎం చంద్రబాబు ఆ కంపెనీకి అండగా నిలబడటమేగాక మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో భారీగా నిధులను అందజేశారు. అయితే ఎన్నికల ముందు ట్రాన్స్ట్రాయ్కు సత్తా లేదని, అందుకే పనులను నవయుగకు అప్పచెప్పినట్లు చెప్పి హడావుడి చేయడం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి రాయపాటి సాంబశివరావు మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు విజయ్‌మాల్యా లాంటి వాళ్లు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారంటూ విమర్శలు గుప్పించే సీఎం చంద్రబాబు ఇలా వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన రాయపాటికి మరోసారి ఎంపీ టికెట్ ఎలా ఇస్తున్నారంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. -
డ్వాక్రా రుణాల చెల్లింపులో అవకతవకలు
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: బ్యాంకు నుంచి తీసుకున్న డ్వాక్రా రుణాలను ఏనెల కానెల చెల్లిస్తున్నా నగదు బ్యాంకులో జమకాకపోవడంపై జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు లక్కవరం ఆంధ్రాబ్యాంకు వద్ద, ప్రధాన రహదారిపై బుధవారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం బ్యాంకులో వేసిన పసుపు–కుంకుమ పథకంలో నగదును తీసుకునేందుకు ఈనెల 19న లక్కవరం ఆంధ్రాబ్యాంకు దుర్గాభవాని గ్రూప్ సభ్యులు వెళ్లగా గత 12 నెలలుగా తీసుకున్న రుణానికి నగదు జమచేయడం లేదంటూ బ్యాంకు అధికారులు చెప్పడంతో ఈ గ్రూపు సభ్యులు నిమ్మలగూడెంలో మిగతా గ్రూపులకు కూడా సమాచారం అందించారు. దీంతో 24 గ్రూపులకు చెందిన మహిళా సంఘాల సభ్యులు బుధవారం లక్కవరం బ్యాంకు వచ్చి తమ ఖాతాలను చెక్‌చేసుకోవడంతో గత 14 నెలలుగా చెల్లిస్తున్న నగదు జమకాకపోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రతీ నెలా డ్వాక్రా సీఎ నందమూరి లక్ష్మి ద్వారా బ్యాంకు మిత్ర కె.రాజేశ్వరికి రుణాన్ని చెల్లిస్తున్నామని, తాము చెల్లించిన సొమ్ము నెలల తరబడి బ్యాంకులో జమకాకపోవడం ఏమిటని దీనిపై అధికారులు విచారణ చేపట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డ్వాక్రా మహిళలు కందుల నరసమ్మ, బల్లే వెంకటలక్ష్మి, దాసరి దుర్గ, ఉగ్గం రామలక్ష్మి, మాసం దుర్గమ్మ, లేగల వెంకట సుబ్బలక్షిమ, దాసరం నక్షత్రం డిమాండ్ చేశారు. 24 గ్రూపుల మీద చెల్లించిన సుమారు రూ.20 నుంచి రూ.24 లక్షల వరకు బ్యాంకులో జమకాలేదని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. దీనిపై డ్వాక్రా సంఘాలు లక్కవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే వెలుగు ఏపీఎం ఝాన్సీ మహిళా సంఘాల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై ఏలూరు నుంచి ఆంధ్రాబ్యాంకు ఏజీఎం సీహెచ్ నాగేశ్వరరావు విచారణ చేపట్టారు. ఆందోళన చేపట్టిన మహిళా సంఘాలకు లక్కవరం వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. పార్టీ నాయకులు పత్తి వీరాస్వామి, సయ్యద్ మస్తాన్, చిట్టిబొమ్మ శివరామకృష్ణ, మన్నెల్లి సూర్య, దల్లి నాగేశ్వరరావు తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. -
ఏడు బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ, ప్రవేటు రంగాలకు చెందిన ఏడు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలు, యాంటీ మనీ లాండరింగ్ (ఏఎంఎల్) ప్రమాణాలపై ఆర్బీఐ జారీ చేసిన పలు సూచనలను పాటించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా అలహాబాదు బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకు 1.5 కోట్ల రూపాయల జరిమానా విధంచగా, ఆంధ్రాబ్యాంకునకు కోటి రూపాయల పెనాల్టీ వడ్డించింది. వీటితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహింద్ర బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులకు రూ. 20 లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఈ చర్య కేవలం క్రమబద్ధీకరణను పాటించడంలో జరిగిన లోపాలపై తీసుకున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఖాతాదారులతో బ్యాంకుల ఎలాంటి లావాదేవీని, లేదా ఒప్పందాల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఉద్దేశించినది కాదని తెలిపింది. నిధుల అంతిమ వినియోగంపై పర్యవేక్షణ, ఇతర బ్యాంకులతో సమాచార వినిమయం, మోసాల వర్గీకరణ, వివరణ, ఖాతాల పునర్నిర్మాణంపై ఆర్బీఐ నిబంధనలను పాటించని కారణంగా ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
పెరిగిన ఆంధ్రా బ్యాంకు నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు నష్టాలు డిసెంబర్ త్రైమాసికంలో మరింత పెరిగాయి. ఈ కాలంలో బ్యాంకు రూ.578 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2017 డిసెంబర్ త్రైమాసికంలో ఈ నష్టం రూ.532 కోట్లుగా ఉంది. టర్నోవరు రూ.5,093 కోట్ల నుంచి రూ.5,322 కోట్లకు ఎగసింది. ఏప్రిల్– డిసెంబర్ కాలంలో మొత్తం రూ.15,663 కోట్ల టర్నోవరుపై రూ.1,552 కోట్ల నష్టం వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు రూ.1,749 కోట్ల నుంచి రూ.1,790 కోట్లకు చేరాయి. 2018 డిసెంబర్ నాటికి అడ్వాన్సుల్లో మొండి బకాయిల వాటా 14.26 నుంచి 16.68%కి పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు రూ.21,599 కోట్ల నుంచి రూ.28,703 కోట్లను తాకాయి. నికర నిరర్ధక ఆస్తులు 7.72% నుంచి 6.99%కి దిగొచ్చాయి. సోమవారం బీఎస్ఈలో ఆంధ్రా బ్యాంకు షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.42% తగ్గి రూ.23.95 వద్ద స్థిరపడింది. -
చాంపియన్ ఆంధ్రా బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–డివిజన్ వన్డే లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ జట్టు విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆసాంతం మెరుగ్గా రాణించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తుదిమెట్టుపై బోల్తా పడింది. బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమవడంతో ఆదివారం ఆంధ్రా బ్యాంక్‌తో జరిగిన ఫైనల్లో ఎస్బీఐ 152 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్రా బ్యాంక్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 310 పరుగుల భారీస్కోరు సాధించింది. పీఎస్ చైతన్య రెడ్డి (93 బంతుల్లో 107; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. నీరజ్ బిష్త్ (44 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కనబరిచాడు. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 72 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నీరజ్ పెవిలియన్ చేరాక అభినవ్ కుమార్ (14)తో నాలుగో వికెట్‌కు 29 పరుగులు, టి. రవితేజ (37; 2 ఫోర్లు)తో కలిసి 89 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి చైతన్య ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 246/5. తర్వాత ఆశిష్ రెడ్డి (25; 2 ఫోర్లు, 1 సిక్స్), ఖాదిర్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్ భండారి, టి. సుమన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఎస్బీఐ జట్టు 33.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సయ్యద్ అహ్మద్ ఖాద్రి (34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్లు టి. సుమన్ (9), డానీ ప్రిన్స్ (17), అనూప్ పాయ్ (6), బి. సుమంత్ (0), ఆకాశ్ భండారి (16), అనిరుధ్ సింగ్ (18), కేఎస్కే చైతన్య (22; 4 ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఆంధ్రా బ్యాంక్ బౌలర్లలో టి.రవితేజ, అమోల్ షిండే, నీరజ్ బిష్త్ తలా 2 వికెట్లు దక్కించుకున్నారు., , , -
అధికారం అండతో దారుణం
పశ్చిమగోదావరి, భీమవరం: జిల్లాలో టీడీపీ నేతల అగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. అధికారం అండతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేస్తున్నారు. వీరవాసరం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడు కౌలు రైతులకు రుణాల పేరుతో అధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేసి లక్షలాది రూపాయల రుణాలు తీసుకున్నాడు. విషయం బయటకు పొక్కడంతో ఆత్మహత్యాయత్నం చేసి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణ పథకం అమలుచేస్తోంది. 5 నుంచి 10 మంది కౌలు రైతులు గ్రూపుగా ఏర్పడి వ్యవసాయశాఖాధికారి ధ్రువీకరణతో జాతీయ బ్యాంకుల్లో రుణం పొందే వెసులుబాటు కల్పించారు. బ్యాంకులకు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరంలేకుండా రూ. 5 లక్షల వరకు రుణం పొందే అవకాశముంది. దీనిలో గ్రూపు సభ్యులకు రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం, రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీకి రుణం ఇస్తారు. కౌలు రైతులను గుర్తించేది వ్యవసాయశాఖాధికారే అయినా.. వీరి కింద పనిచేసే మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(ఎంపీఈవో) పెత్తనం చెలాయిస్తున్నారు. వ్యవసాయ విçస్తరణ కోసం ప్రభుత్వం ప్రతి వెయ్యి హెక్టార్లకు ఒక ఎంపీఈవోను నియమించింది. వీరంతా స్థానికులు కావడంతో అ«ధికార పార్టీ నాయకుల అండతో ప్రభుత్వ అధికారులను శాసిస్తున్నారు. వ్యవసాయాధికారి ఫిర్యాదుతో వెలుగులోకి వీరవాసరం మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల నాయకుడి కుమారుడు గత కొంతకాలంగా ఎంపీఈవోగా పనిచేస్తున్నాడు. రైతులకు రుణాలు, సబ్సిడీ యంత్ర పరికరాలు, విత్తనాలు వంటివి ఇప్పించి రైతుల నుంచి మామూళ్లు వసూలు చేయడం చేసేవాడు. ఎక్కడైనా తేడా వస్తే పార్టీ నాయకులు కొమ్ముకాస్తారనే ధైర్యంతో గత ఏడాది కౌలు రైతులకు రుణాలు ఇప్పించడంలో అక్రమాలకు పాల్పడ్డాడు. వ్యవసాయశాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి కౌలు రైతుల గ్రూపులు ఏర్పాటుచేసినట్లు ప్రతాలు సిద్ధం చేసి బ్యాంకు అధికారుల సాయంతో లక్షల రూపాయల రుణం పొందాడు. బ్యాంకు రుణం మంజూరుచేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమైన సొమ్మును వెంటనే తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకోవడం ప్రారంభించాడు. గతేడాది నవంబర్ నెలలో వ్యవహారం బయటకు పొక్కడంతో వ్యవసాయాధికారి బ్యాంకు అధికారుల్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందని భయపడి వ్యవసాయశాఖాధికారి బ్యాంకు అధికారులను నిలదీయంతో ఒక్క బ్యాంకులోనే సుమారు రూ. 20 లక్షలు కౌలు రైతులకు తెలియకుండా రుణాలు మంజూరు చేయించి సొంతానికి వాడుకున్నట్లు బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు వారు తాత్సారం చేశారు. పోలీసులు కూడా టీడీపీకీ అండగా ఉండడం వల్లే ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయలేదనే విమర్శలు వినిపించాయి. వ్యవసాయశాఖాధికారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడిందనే భయంతో టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెబుతున్నారు. కాగా వ్యవసాయ రుణాల కుంభకోణం రూ. కోటి వరకు ఉండవచ్చని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆత్మహత్యాయత్నం డ్రామా అని, కేసునుంచి బయటపడేందుకు టీడీపీ నాయకులు కొత్త డ్రామా తెరపైకి తెచ్చారని అంటున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపితే మరికొన్ని స్కాంలు బయటపడతాయని చెబుతున్నారు. కేసు మాఫీకి టీడీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
తెలుగు రాష్ట్రాల్లో 1,600 మంది బిజినెస్ కరస్పాండెంట్లు
న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్తగా 1,600 మంది బిజినెస్ కరస్పాండెంట్స్ (బీసీ)ను నియమించుకోనుంది. బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఇంటి వద్దకే బ్యాంకింగ్, ఏటీఎంల ఏర్పాటు, మొండిబాకీల రికవరీ మొదలైన వాటికి వీరి సేవలను వినియోగించుకోనుంది. 2019 జనవరి 31 నాటికల్లా బీసీల నియామకాలు జరిపే ప్రక్రియ పర్యవేక్షణ కోసం కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్స్ (సీబీసీ) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆంధ్రా బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) ప్రచురించింది. దీని ప్రకారం 2019 మార్చి ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 922 మంది, తెలంగాణలో 695 మంది బీసీలను నియమించుకోనుంది. బ్యాంకులకు అనుసంధానమైన స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) మొదలైన వాటికి బీసీ ఏజెంట్లుగా నియామకంలో ప్రాధాన్యం ఉంటుందని బ్యాంకు వివరించింది. బ్యాంకు ఆమోదించిన.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు, రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, కిరాణా షాప్ ఓనర్లు, ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్న డీలర్లు, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ మొదలైన వారు కూడా దీనికి అర్హులు. ప్రస్తుతం సీబీసీ విధానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రా బ్యాంకు సుమారు 2,200 మంది బిజినెస్ కరస్పాండెంట్స్‌ను నియమించుకుంది. -
మొండిబాకీల విక్రయంలో ఆంధ్రాబ్యాంక్
న్యూఢిల్లీ: సుమారు 50 ఖాతాల నుంచి రావాల్సిన మొండిబాకీలను రికవర్ చేసుకోవడంపై ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ దృష్టి సారించింది. దాదాపు రూ. 1,553 కోట్ల మేర మొండిబాకీలను (ఎన్పీఏ) వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్సీ) నుంచి బిడ్లను ఆహ్వానించింది. నవంబర్ 30లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు(ఈవోఐ) సమర్పించాల్సిందని టెండర్ డాక్యుమెంట్లో పేర్కొంది. డిసెంబర్ 3న ఈ–బిడ్డింగ్ జరుగుతుందని, డిసెంబర్ 10లోగా ఒప్పందాలను కుదుర్చుకోవడం, నగదు బదిలీ తదితర లావాదేవీలు పూర్తవుతాయని బ్యాంక్ పేర్కొంది. 53 ఖాతాల్లో రూ. 1,552.96 కోట్ల మొత్తానికి సంబంధించిన ఎన్పీఏల ప్రతిపాదిత వేలంలో పాల్గొనేందుకు ఏఆర్‌సీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. పూర్తిగా నగదు ప్రాతిపదికన ఈ ఎన్పీఏల వేలం ఉంటుందని తెలిపింది. వేలానికి వస్తున్న పెద్ద మొండిపద్దుల్లో ట్రాన్స్ట్రాయ్ దిండిగల్–తెని–కుమ్లి టోల్వేస్ (మొత్తం బాకీ రూ. 147 కోట్లు), ట్రాన్స్ట్రాయ్ కృష్ణగిరి దిండివనం హైవేస్ (రూ. 103 కోట్లు), కార్పొరేట్ పవర్ (రూ. 306.65 కోట్లు), వీసా స్టీల్ (రూ. 211.76 కోట్లు), తుల్సియాన్ ఎన్ఈసీ (మొత్తం బాకీ రూ. 154 కోట్లు), కార్పొరేట్ ఇస్పాత్ అలాయ్స్ (రూ. 148 కోట్లు) ఉన్నాయి. -
ఆ కంపెనీల దివాలా ప్రక్రియ ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులకు రుణాలు ఎగవేసిన ల్యాంకో గ్రూపు కంపెనీల్లో తాజాగా మరో రెండు కంపెనీలు కూడా చేరాయి. ఆంధ్రా బ్యాంక్‌కు ల్యాంకో థర్మల్ పవర్ లిమిటెడ్, ల్యాంకో సోలార్ ఎనర్జీ లిమిటెడ్‌లు వరుసగా రూ. 129.99 కోట్లు, రూ. 150.57 కోట్ల మేర బకాయి పడ్డాయి. తీసుకున్న ఈ రుణాలను తిరిగి చెల్లించడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని, అందువల్ల ఆ కంపెనీల దివా లా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ముందు ఆంధ్రా బ్యాంక్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ల్యాంకో థర్మల్ పవర్ లిమిటెడ్‌పై దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ సభ్యులు (జ్యుడీషియల్) రాతకొండ మురళీ విచారణ జరిపారు. ఇరు ఇరు వర్గాల వాదనలు విన్న మురళీ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ల్యాంకో సోలార్కు నోటీసులు.. ల్యాంకో సోలార్ ఎనర్జీపై దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ మరో సభ్యులు అనంత పద్మనాభస్వామి (జ్యుడీషియల్) విచారణ జరిపారు. ఈ పిటిషన్లో కూడా ఆంధ్రా బ్యాంకు తరఫున లక్ష్మీనర్సింహ వాదనలు వినిపించారు. తమ బ్యాంకుకు ల్యాంకో సోలార్ రూ. 150.57 కోట్ల మేర బకాయి పడిందని చెప్పారు. ఈ కంపెనీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం రుణం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు ల్యాంకో సోలార్కు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
బ్యాంక్‌ల్లో పోలీసుల మాక్‌డ్రిల్
బరంపురం ఒరిస్సా : నగరంలో ఏటీఎం కేంద్రాలు, బ్యాం క్ల చోరీ యత్నం వంటి నేరాల సంఘటనలతో బరంపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని 29 బ్యాంక్‌ల్లో బుధవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్యాంక్‌లకు వెళ్లి బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడారు. అదేవిధంగా బ్యాంక్‌లకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి భద్రతపై ఆరా తీశారు. ఈ మాక్‌డ్రిల్‌లో అన్ని పోలీసు స్టేషన్లకు చెందిన ఐఐసీ అధికారులు పాల్గొన్నారని ఏఎస్పీ సంతున్ కుమార్ దాస్ తెలిపారు. -
ఆంధ్రాబ్యాంకుకు నిప్పు పెట్టిన ఆకతాయి
పొన్నలూరు: స్థానిక ఆంధ్రాబ్యాంకుకు ఆకతాయి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. శని, ఆదివారం బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో అధికారులు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌తో వచ్చి బ్యాంకు ఆవరణలో ఉన్న చెత్తకు నిప్పు పెట్టాడు. అంతేకాకుండా బ్యాంకు తలుపులపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సమయం తర్వాత చెత్త పూర్తిగా దగ్ధమై పెద్దగా మంటలు వచ్చాయి. బ్యాంకు తలుపులు కూడా పాక్షికంగా తగలబడ్డాయి. ఇంతలో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి మంటలు పెద్దవి కాకముందే నీరు పోసి ఆర్పేశారు. పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే బ్యాంకు లోపలి భాగంలో మంటలు అంటుకోని ఉంటే భారీగా నష్టం జరిగేది. ఈ పని కావాలనే చేశారా, లేకుంటే ఎవరైనా ఆకతాయిలు చేశారనేది తేలాల్సి ఉంది. బ్యాంకు ఆవరణంలోకి ఎవరు వచ్చారనేది సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించే అవకాశం ఉంది. ఈ సంఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ కె. సురేష్ తెలిపారు. -
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే బ్యాంకుల జాతీయీకరణ
శ్రీకాకుళం అర్బన్ : దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకుల జాతీయీకరణ ఎంతగానో తోడ్పాటునందించిందని ఆలిండియా ఆంధ్రాబ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యురాలు జి.కరుణ అన్నారు. బ్యాంకులను జాతీయీకరణ చేసి 50 ఏళ్లవుతున్న సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళంలోని ఆంధ్రాబ్యాంక్ ఆర్సీబీ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం నాటికి 648 వాణిజ్య బ్యాంకులు పూర్తిగా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవని, స్వాతంత్య్రానంతరం రెండు దశాబ్దాల్లో(1948–1968) దాదాపు 300కు పైగా బ్యాంకులు మూతపడ్డాయన్నారు. 1969 జూలై 19న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయీకరణ చేశారని గుర్తు చేశారు. 1980 ఏప్రిల్ 15న మరో ఆరు బ్యాంకులను జాతీయీకరణ చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ అసిస్టెంట్ ఉమెన్ కన్వీనర్ వీఎస్ఆర్ సౌమ్య మాట్లాడుతూ దేశ ప్రజల నగదుకు భద్రత బ్యాంకులేనని అన్నారు. సామాజిక సంక్షేమానికి, బ్యాంకింగ్ వ్యవస్థను, గ్రామీణ ప్రాంతాలకు విçస్తృత పరచడానికి, ప్రాధాన్యతా రంగాలకు రుణ వితరణ ద్వారా ఆర్థిక స్వావలంబన, ప్రజల్లో బ్యాంకుల ద్వారా ఆర్థిక అవగాహన కల్పించడాని జాతీయీకరణ దోహదపడిందన్నారు. కార్యక్రమంలో యూనియన్ మహిళా ప్రతినిధులు స్వాతి, దివ్య, ప్రతిభ, మానస, సౌజన్య, మాధవీలత, శాంతకుమారి, స్వర్ణశ్రీ, శ్రీలక్ష్మి, మహిళా ఖాతాదారులు పాల్గొన్నారు. -
ఇక సీబీఐ చేతికి..
చీపురుపల్లి విజయనగరం : గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్)లో వినియోగదారుల డబ్బు రూ.1.71 కోట్లు పక్కదోవ పట్టిన వ్యవహారం సీబీఐ చేతికి చేరింది. నిధులు గల్లంతైన విషయమై ఇంతవరకు ఆంధ్రాబ్యాంకులో ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ పూర్తి చేసుకున్న అనంతరం కేసు సీబీకి అప్పగించారు. స్థానిక ఆంధ్రాబ్యాంకులో 2015 జూలై నుంచి 2017 జూలై వరకు క్యాషియర్‌గా పని చేసిన వి.సంతోషిరాము ఆ నిధుల గల్లంతుకు ప్రధాన కారకుడిగా గుర్తించి సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు సంతోషిరాము నివాసం, ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం పర్లాకిమిడిలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోషిరాము నివాసంలో పలు పత్రాలను సీబీఐ అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. అలాగే ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి పలు ఓచర్లు తీసుకెళ్లారు. ఆర్ఈసీఎస్ పరిధిలో గల చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో వినియోగదారులు నుంచి విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేసి ఆ డబ్బును ప్రతిరోజూ ఆంధ్రాబ్యాంకులో ఉన్న ఆర్ఈసీఎస్ ఖాతాలో జమ చేస్తుంటారు. అలా జమ చేసిన డబ్బులో 133 ఓచర్లకు సంబంధించిన రూ.1.71 కోట్లు డబ్బు ఆంధ్రాబ్యాంకులో ఉన్న క్యాషియర్ సంతోషి రాము జమ చేయకుండా పక్కదారి పట్టించాడు. 2017 ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో జరిగిన నిధుల గల్లంతు విషయాన్ని ఆర్ఈసీఎస్ అధికారులు అత్యంత ఆలస్యంగా 2018 మార్చిలో గుర్తించారు. దీంతో ఆర్ఈసీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు ఆంద్రాబ్యాంక్ అధికారులు విచారణ చేపట్టి డబ్బులు గల్లంతైన విషయాన్ని రెండు నెలలు తరువాత గుర్తించి సీబీఐకి కేసు అప్పగించారు. ఆర్ఈసీఎస్ అధికారులను విచారించనున్న సీబీఐ.... వినియోగదారుల నుంచి వసూలు చేసే డబ్బు ప్రతిరోజూ బ్యాంకుకు జమ చేసిన వ్యవహారానికి సంబంధించి ఆర్ఈసీఎస్ ఉద్యోగులను సీబీఐ విచారించనున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు ఆర్ఈసీఎస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే సీబీఐ అధికారులు పట్టణానికి వచ్చి విచారణ చేపట్టడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అధికారులు వచ్చారు.... సీబీఐ అధికారులు ఆర్ఈసీఎస్కు వచ్చారు. తమ సిబ్బంది ఆంధ్రాబ్యాంకులో జమ చేసిన డబ్బుకు సంబంధించిన ఓచర్లు అడిగారు. ఆంధ్రాబ్యాంకు ఉద్యోగి నివాసానికి కూడా వెళ్లినట్లు తెలిసింది. తమకు తెలిసిన పూర్తి సమాచారం ఇచ్చాం. – పి.రమేష్, ఎండీ, ఆర్ఈసీఎస్ -
ఆంధ్రాబ్యాంకు నష్టం రూ.2,536 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో ఆంధ్రాబ్యాంకు రూ.2,536 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.35 కోట్ల నికరలాభం పొందింది. టర్నోవరు రూ.5,424 కోట్ల నుంచి రూ.5,092 కోట్లకు వచ్చి చేరింది. 2017–18లో రూ.3,412 కోట్ల నష్టం వాటిల్లింది. అంత క్రితం ఏడాది బ్యాంకు రూ.174 కోట్ల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.20,336 కోట్ల నుంచి రూ.20,346 కోట్లుగా ఉంది. కొండలా బకాయిలు.. బ్యాంకు బకాయిలు ఏటా గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. స్థూల నిరర్ధక ఆస్తులు రూ.17,670 కోట్ల నుంచి రూ.28,124 కోట్లకు చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు రూ.10,355 కోట్ల నుంచి రూ.12,637 కోట్లను తాకాయి. ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు 108 శాతం అధికమై రూ.8,774 కోట్లకు చేరుకున్నాయి. వ్యాపార వృద్ధి 9.7 శాతం.. ఆంధ్రాబ్యాంకు మొత్తం వ్యాపారం 9.7 శాతం వృద్ధి చెంది రూ.3,72,605 కోట్లకు చేరుకుంది. డిపాజిట్లు 6.46 శాతం అధికమై రూ.2,08,070 కోట్లు, అడ్వాన్సులు 14.08 శాతం పెరిగి రూ.1,64,535 కోట్లుగా ఉంది. రిటైల్ అడ్వాన్సులు 41.5 శాతం, వ్యవసాయ రుణాలు 11.86 శాతం, ఎంఎస్ఎంఈ అడ్వాన్సులు 23.61 శాతం పెరిగాయి. నికరవడ్డీ ఆదాయం 14.52 శాతం అధికమై రూ.6,335 కోట్లు నమోదైంది. -
మాయమాటలు చెప్పి..డబ్బులు కాజేసి..
భైంసా(ముథోల్): భైంసాలోని ఆంధ్రాబ్యాంకులో తన సేవింగ్ ఖాతాలో దాచుకున్న డబ్బును తీసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి రూ.20వేలు కాజేసిన ఉదంతమిది. సోమవారం కుభీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన భోజన్న ఆంధ్రాబ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకునేందుకు భైంసాకు వచ్చాడు. బ్యాంకులో డబ్బులు తీసుకొని బయటకు రాగానే రోడ్డుపైన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై భోజన్న వద్దకు వచ్చారు. డబ్బులు తక్కువ వచ్చాయని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే మిగతావి వస్తాయని మాయమాటలు చెప్పారు. దీంతో భోజన్న నమ్మి రూ.20వేలను వారి చేతిలో పెట్టాడు. వారు బైక్‌పై వెళ్లగా వెనకాలే భోజన్న వెళ్లాడు. కార్యాలయంలోనికి వెళ్లి వస్తామని ఇద్దరిలో ఒకరు లోపలికి డబ్బులతో వెళ్లారు. మరోవ్యక్తి భోజన్నతో మాట్లాడుతూ ఉండిపోయాడు. కాసేపటికి ఉన్న వ్యక్తి కూడా మాయమయ్యాడు. తనతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో భోజన్న కార్యాలయంలోనికి వెళ్లి చూశాడు. అప్పటికే కార్యాలయం పక్క నుంచి నగదుతో వారు పరారయ్యారు. అక్కడికి భోజన్నకు తెలిసిన వ్యక్తులు రావడంతో జరిగిన ఘటనను వారికి వివరించాడు. డబ్బులు తీసుకుని ఇద్దరు వ్యక్తులు ఉడాయించారని నిర్ధారించుకున్న వారు భైంసా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు. -
తుపాకీతో బెదిరించి ఆంధ్రాబ్యాంకులో దోపిడీ
భువనేశ్వర్: కొందరు దుండగులు తుపాకీ మొనతో బెదిరించి ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం దోపిడీకి పాల్పడ్డారు. అనుగుల్ బజార్ ఛక్ ఆంధ్రా బ్యాంకు శాఖలో ఈ దోపిడీ జరిగింది. పట్టపగలు బ్యాంక్ సిబ్బందిని బెదిరించి స్ట్రాంగ్ రూమ్ తెరిపించి భారీగా నగదు, నగలు, ఆభరణాల్ని దోచుకున్నారు. దాదాపు రూ.1 కోటి నగదు దోచుకున్నట్లు భావిస్తున్నారు. దోచుకున్న నగదు, సొత్తు విలువ స్పష్టం కావలసి ఉంది. సమాచారం తెలిసన వెంటనే అనుగుల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్మిత్రభాను మహాపాత్రో ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. సరిహద్దు మార్గాలకు సీల్ దుండగులు జిల్లా సరిహద్దు దాటిపోకుండా జిల్లా ప్రవేశ మార్గాల్ని సీల్ చేయించి తనిఖీలు ముమ్మరం చేయించినట్లు ఎస్పీ వివరించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా పోలీసుదళాలు దర్యాప్తు ప్రారంభించాయి. సైంటిఫిక్ దళం కూడా ఘటనాస్థలాన్ని సందర్శించింది. దుండగుల్ని అదుపులోకి తీసుకునేందుకు ఇరుగు పొరుగు జిల్లాలను కూడా అప్రమత్తం చేసినట్లు అనుగుల్ ఎస్పీ మిత్రభాను మహాపాత్రో తెలిపారు. స్థానికంగా విచారణ నిర్వహించి కొంతవరకు వివరాలు సేకరించారు. బ్యాంకు సముదాయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ వ్యవస్థ సరంజామాను పోలీసులు స్వాధీనం చేసుకుని తీసుకుని వెళ్లారు. ఇదే శాఖలో మూడోసారి దోపిడీ శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 6గురి నుంచి 7గురు ముసుగు దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. శాఖ ఆవరణలో ఉన్న 30 నుంచి 40 మంది ఖాతాదారులను తొలుత భయపెట్టి బీభత్సం సృష్టించారు. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని అందర్నీ ఒకగదిలో పెట్టి తాళం వేశారు. తర్వాత బ్యాంకు సిబ్బందిని బెదిరించి స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్లి సర్వం దోచుకున్నారు. బ్యాంకు సిబ్బందిని వేరే గదిలో పెట్టి తాళం వేశారు. దోచుకోవడం పూర్తయిన తర్వాత బ్యాంకు ప్రధాన ప్రవేశ ద్వారం తాళం వేసి బైక్‌లపై శరవేగంగా దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనంగా పోలీసులు పేర్కొన్నారు. ఖాతాదారులకు ఎటువంటి హాని తలపెట్టకున్నా ప్రాణాంతకంగా బెదిరించినట్లు వివరించారు. ఈ శాఖలో ఇటువంటి దోపిడీ సంఘటన వరుసగా ఇది మూడోసారిగా పేర్కొంటున్నారు. -
బ్యూటీషియన్ కోర్సు.. ఉపాధి మార్గాలు
నిడమర్రు:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను చైతన్యం చేసి వారికి తగిన శిక్షణ అందించి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకునే లక్ష్యంతో ఆంధ్రాబ్యాంక్ ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ తరగతులను జిల్లా కేంద్రం ఏలూరులో నిర్వహిస్తున్నట్టు జయప్రకాష్‌నారాయణ ఆంధ్రాబ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంచాలకులు జె. షణ్ముఖరావు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆ సంస్థలో బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్ కోర్సులపై 1,200 మంది శిక్షణ పొందగా, 1,100 మంది వరకూ స్థిరపరపడినట్టు తెలిపారు. ఇదే కోర్సుపై 2018–19 సంవత్సరానికి మరో కొత్త బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ కొత్త బ్యాచ్ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందన్నారు. ఈ కోర్సు శిక్షణకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అభ్యర్థుల అర్హతలివే.. ♦ దరఖాస్తు చేసుకునే అవకాశం పశ్చిమగోదారి జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు మాత్రమే ♦ వయోపరిమితి: 18 నుండి 35 ఏళ్లలోపు ఉండాలి. ♦ విద్యార్హత: 10వ తరగతి ఆపై శిక్షణ కాలంలో సదుపాయాలు ఇలా.. ♦ శిక్షణకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ దూరప్రాంతాల నుంచి శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేస్తారు. ♦ హాస్టల్ అభ్యర్థులకు వారి గ్రామాల నుంచి ఒకసారి సంస్థకు రానుపోను ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. ♦ స్థానిక అభ్యర్థులకు కూడా మ««ధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పిస్తారు. ♦ శిక్షణ కాలమందు అవసరమగు సేవలు, మెటీరియల్ సంస్థచే ఉచితంగా అందిస్తారు. ♦ బ్యూటీషియన్ కోర్సుపై సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పైనా శిక్షణ ఉంటుంది. ప్రత్యేకతలు ఇవి ♦ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ♦ 30 రోజుల్లోనే బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్ నైపుణ్యంపై మెరుగైన శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు ఇలా.. ♦ ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు ఫోన్ ద్వారా/ఎస్ఎంఎస్/పోస్ట్ కార్డుద్వారా పే ర్లు, చిరునామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ♦ గతంలో పేర్లు నమోదు చేసుకున్నవారు, కొత్తగా అడ్మిషన్‌కు అర్హత సాధించినవారు వారి ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 3 ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది. శిక్షణ సంస్థ చిరునామా:జయప్రకాష్ నారాయణ్ ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ,వెలుగు ఆఫీస్ ప్రాంగణం/ఐటీఐ కాలేజీ దగ్గర ,సత్రంపాడు, ఏలూరు– 534 007ఫోన్ నంబర్స్: 08812–253 97598660 94383/94909 98882 బ్యూటీషియన్ కోర్సుకు మంచి డిమాండ్ ఈ శిక్షణ సంస్థను 2005లో ఏర్పాటు చేశాం. బ్యూటీషియన్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులో ఎక్కువమంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా సంస్థలో శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత యూనిట్ స్థాపించేం దుకు బ్యాంకు రుణం పొందుటలో అవసరమగు సలహాలు, సహాయ సహకారం మా బ్యాంక్ సిబ్బంది అందిస్తారు. – జె. షణ్ముఖరావు, సంచాలకులు,ఏబీఆర్ఎస్ఈటీఐ -
ఉపాధికి మార్గం.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్
నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను చైతన్యం చేసి వారికి తగిన శిక్షణ అందించి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకునే లక్ష్యంతో ఆంధ్రాబ్యాంక్ ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ తరగతులను ఏలూరులో నిర్వహిస్తున్నట్టు జయప్రకాష్ నారాయణ ఆంధ్రాబ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంచాలకులు జె. షణ్ముఖరావు తెలి పారు. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ ఆ సంస్థలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపై 1,650 మంది శిక్షణ పొందగా, 1,520 మంది వరకూ స్థిరపడినట్టు తెలిపారు. ఇదే కోర్సుపై 2018–19 సంత్సరానికి మరో కొత్త బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ కొత్త బ్యాచ్ వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ కోర్సు శిక్షణకు సంబం ధించిన వివరాలు తెలుసుకుందాం. అభ్యర్థుల అర్హతలు ఇలా.. ♦ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు మాత్రమే ♦ వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ♦ విద్యార్హత : 5వ తరగతి ఆపై శిక్షణ కాలంలో సదుపాయాలు ♦ శిక్షణకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ దూరప్రాంతాల నుంచి శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేస్తారు. ♦ హాస్టల్ అభ్యర్థులకు వారి గ్రామాల నుంచి ఒకసారి సంస్థకు రానుపోను ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. ♦ స్థానిక అభ్యర్థులకు కూడా మ««ధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పిస్తారు. ♦ శిక్షణ కాలమందు అవసరమగు సేవలు, మెటీరియల్ సంస్థచే ఉచితంగా అందిస్తారు. ♦ ఫ్యాషన్ డిజైనింగ్‌పై సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పైనా శిక్షణ ఉంటుంది. ప్రత్యేకతలు ఇలా.. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ♦ 30 రోజుల్లోనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో నైపుణ్యంపై మెరుగైన శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు ఇలా.. ♦ ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు ఫోన్ ద్వారా/ఎస్ఎంఎస్/పోస్ట్ కార్డు ద్వారా పేర్లు, చిరునామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ♦ గతంలో పేర్లు నమోదు చేసుకున్నవారు, కొత్తగా అడ్మిషన్‌కు అర్హత సాధించినవారు వారి ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 3 ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది. శిక్షణ సంస్థ చిరునామా : జయప్రకాష్ నారాయణ్ ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, వెలుగు ఆఫీస్ ప్రాంగణం/ఐటీఐ కాలేజీ దగ్గర, సత్రంపాడు, ఏలూరు–534 007. ఫోన్ నంబర్స్: 08812–253 975. సెల్ నెంబర్: 98660 94383/94909 98882 ఫ్యాషన్ డిజైనింగ్‌కు మార్కెట్లో డిమాండ్ ఈ శిక్షణ సంస్థను 2005లో ఏర్పాటు చేశాం. నేటివరకూ 371 బ్యాచ్‌లు 20 రకాల కోర్సుల్లో 12,200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులో ఎక్కువమంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా సంస్థలో శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత యూనిట్ స్థాపించేందుకు బ్యాంకు రుణం పొందుటలో అవసరమగు సలహాలు, సహాయ సహకారం బ్యాంక్ సిబ్బంది అందిస్తారు. – జె. షణ్ముఖరావు, సంచాలకులు, ఏబీఆర్ఎస్ఈటీఐ -
ఎన్పీఏలుగా స్టెర్లింగ్ గ్రూప్ కంపెనీలు: ఆంధ్రాబ్యాంకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టెర్లింగ్ గ్రూప్ కంపెనీలపై ఆర్బీఐతోపాటు సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు ఆంధ్రాబ్యాంకు తెలిపింది. మోసపూరిత ఖాతాలుగా తెలుపుతూ, రూ.519.19 కోట్ల నిధులు దారి మళ్లించారని 2017 డిసెంబరులో ఇచ్చిన ఫిర్యాదులో తాము పేర్కొన్నట్టు వెల్లడించింది. ఈ గ్రూప్ కంపెనీలు 2015 మార్చి నుంచే ఎన్పీఏల ఖాతాలో చేరాయని బ్యాంకు తెలిపింది. డిసెంబరు 31 నాటికి రూ.515.19 కోట్ల ఫండ్ ఆధారిత రుణం ఎన్పీఏగా ఉందని వివరించింది. రూ.5,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్ అనుప్ ప్రకాశ్ గర్గ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే అనుప్ ప్రకాశ్ 2006–09 మధ్య చార్టర్డ్ అకౌంటెంట్ డైరెక్టర్‌గా ఉన్నారని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం అతను తమ ఉద్యోగి లేదా డైరెక్టర్ ఎంత మాత్రమూ కాదని ఆంధ్రాబ్యాంకు స్పష్టం చేసింది. స్టెర్లింగ్ గ్రూప్ కంపెనీలకు రుణం ఇచ్చిన కన్సార్షియంలో ఆంధ్రాబ్యాంకు లీడ్ బ్యాంకర్‌గా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలకు ఆంధ్రాబ్యాంకు ఇచ్చిన రుణంలో ఫండ్ ఆధారిత రుణం రూ.578.57 కోట్లు, నాన్ ఫండ్ ఆధారిత రుణం రూ.568.35 కోట్లు ఉందని, మీడియాలో వచ్చినట్టు రూ.5,000 కోట్లు కాదని వెల్లడించింది. తాజా వార్తల నేపథ్యంలో సోమవారం ఆంధ్రాబ్యాంకు షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 6.88 శాతం పడిపోయి రూ.35.85 వద్ద స్థిరపడింది. -
ఈడీ షాక్: ఆంద్రాబ్యాంక్ షేరు పతనం
సాక్షి ముంబై : స్టాక్మార్కెట్లో ప్రభుత్వ బ్యాంక్ షేర్ల పతనం కొనసాగుతోంది. పీఎన్బీ, కెనరా కుంభకోణాలకుతోడు ఇతర స్కాంల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం నాటి మ్యాజిక్ ర్యాలీలో ప్రయివేట్ బ్యాంకింగ్ సెక్టార్ తన సత్తా చాటగా, పీఎస్‌యూ సెక్టార్మాత్రం చతికిలపడింది. ముఖ్యంగా స్టెర్లింగ్ బయోటెక్, సందేశరాస్ గ్రూపు కుంభకోణం మరోసారి వెలుగులోకి రావడంతో ఆ కేసుతో సంబంధం ఉన్న ఆంధ్రాబ్యాంకు షేరు సోమవారం 52వారాల కనిష్టానికి పతనమైంది. సుమారు రూ.5వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనూప్ ప్రకాష్ గార్గ్‌పై తాజాగా మరో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసింది. దీంతో న్వెస్టర్లు ఆంధ్రా బ్యాంకు షేర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. చివరికి బీఎస్ఈలో 7శాతంతో నష్టంతో ముగిసింది. మొత్తం 2018 ఏడాదిలో ఇప్పటిదాకా 41శాతానికిపైగా పతనమైంది. అంతేకాదు ఎనలిస్టులు కూడా ఇన్వెస్టర్లకు అప్రమత్తతను సూచించారు. సందేశరాస్ గ్రూపు కుంభకోణం స్టెర్లింగ్ బయోటెక్కుచెందిన సందేశరా గ్రూపు ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియం నుంచి అక్రమ పద్ధతిలో సుమారు రూ. 5 వేల కోట్ల మేరకు బ్యాంక్ రుణం కోసం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి రుణ లబ్ది చేకూర్చేందుకు వీలుగా రూ. 2కోట్లను అనూప్ స్వీకరించినట్లు ఈడీ తాజాగా పేర్కొంది. తాజా ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 2011లో ఇన్ కంట్యాక్స్ అధికారులు సీజ్ చేసిన డైరక్టర్ డైరీ లో చేతన్ జయంతిలాల్ సందేశారా, నితిన జయంతిలాల్ సందేశారా అనే స్టెర్లింగ్ బయోటెక్ డైరక్టర్లు ఇతగాడికి 15.2 మిలియన్ల మేర డబ్బు చెల్లించినట్లు ఎంట్రీలు ఉన్నాయని తేలింది. ఈ చెల్లింపులు 2008-09 మధ్య జరిగిన లావాదేవీలుగా ఈడీ డైరక్టరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రాణా చార్జ్ షీట్లొ ఆరోపించారు. -
జిల్లాలోనూ ‘నీరవ్‌మోదీ’
నీరవ్ మోదీ – పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం.. రొటొమ్యాక్ కొఠారి– బ్యాంక్ ఆఫ్ ఇండియా కుంభకోణం.. ఇలా రోజుకొక బ్యాంకు మోసాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం విదితమే. జిల్లాలోనూ ఈ తరహా బ్యాంకుకు సంబంధించిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపార లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో రుణం పొందిన ఓ రైస్‌మిల్లరు ఇప్పుడు చేతులెత్తేశాడు. ఆరు నెలలుగా తీసుకున్న రుణానికి సంబంధించిన అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని బోధన్ ప్రాంతానికి చెందిన ఓ రైస్‌మిల్లరు ఆంధ్రాబ్యాంక్ బోధన్ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ.23 కోట్ల మేరకు రుణం తీసుకున్నారు. అయితే గత ఆరు నెలలుగా ఈ మొత్తాన్ని చెల్లించడం లేదు. దీంతో బ్యాంకు అధికారులు ఈ రుణానికి సంబంధించిన సెక్యూరిటీ అసెట్స్ (ఆస్తుల)పై దృష్టి సారించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తంలో బ్యాంకు రుణం తీసుకుని చేతులెత్తేసిన ఘటన ఇదే మొదటి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం జిల్లాలో కొత్తేమీ కాదు. రూ.ఆరు కోట్లు.., రూ.తొమ్మిది కోట్లు ఇలా పలువురు రైస్‌మిల్లర్లు, ఇతర కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు పొంది చేతులెత్తేశారు. కానీ ఇంత భారీ మొత్తంలో ఎగనామం పెట్టడం ఇదే తొలిసారి కావడంతో బ్యాంకు, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, రొటొమ్యాక్ కొఠారిలు వేల కోట్లలో బ్యాంకులకు ఎగనామం పెట్టగా.. జిల్లాకు చెందిన కొందరు రైస్‌మిల్లర్లు అప్పులిచ్చిన బ్యాంకులకు పంగనామాలు పెడుతున్నారు.బ్యాంకు నుంచి డబ్బుల ముఠా ఎత్తుకు పోతున్నట్లు సింబాలిక్ క్యారికేచర్‌ను వాడే విషయం పరిశీలించగలరు. సెక్యూరిటీ ఆస్తుల విలువ అంతంతే.. భారీ మొత్తంలో రుణం పొందిన ఈ రైస్‌మిల్లరు సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువ రుణంలో సగం కూడా ఉండే అవకాశాలు లేకపోవడంతో బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. సుమారు రూ.23 కోట్ల మేరకు బకాయి పడగా.. సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లకు మించి ఉండదని తెలిసింది. రైస్‌మిల్లు స్థలం, ప్లాంట్, మిషనరీ, ఇతర ఆస్తులన్నీ కలిపినా ఈ మేరకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం. దీంతో సుమారు రూ.పది కోట్ల రికవరీ పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అయితే సెక్యూరిటీగా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంకుకు సంక్రమించిన అధికారాలతో సెక్యూరిటీ ఆస్తులను ఆన్లైన్లో వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్తుల విలువ పెంచేసి.. రుణం పొందడానికి సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువను భారీగా పెంచినట్లు సమాచారం. మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం అధికంగా విలువ ఉన్నట్లు ఆస్తుల విలువను పెంచేసి.. భారీ మొత్తంలో రుణం పొందారు. ఈ వ్యవహారంలో వ్యాల్యువర్, బ్యాంకు ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ విలువైన ఆస్తులకు ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు ఇక్కడి నుంచి బదిలీ అయినట్లు సమాచారం. ఆస్తి విలువను ఎక్కువగా చూపిన వ్యాల్యువర్పై కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. వివరాలు చెప్పడానికి లేదు.. బ్యాంకుకు ఎగనామం పెట్టిన విషయమై వివరాల కోసం నిజామాబాద్‌లోని ఆంధ్రాబ్యాంక్ రీజినల్ కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.వి.వి.సత్యనారాయణను ‘సాక్షి’ సంప్రదించగా వివరాలు చెప్పేందుకు అంగీకరించలేదు. బ్యాంకు వివరాలు చెప్పడానికి లేదని దాటవేశారు. ఆస్తుల విలువను ఎక్కువగా చూపి ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసిన విషయం ప్రస్తావించగా.. రుణ మంజూరులో ప్రోసీజర్ ఫాలో అవుతామని చెప్పుకొచ్చారు. – పి.వి.వి.సత్యనారాయణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆంధ్రాబ్యాంక్ -
ఆంధ్రాబ్యాంకు నష్టం రూ.532 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రాబ్యాంకు ఈ డిసెంబర్ త్రైమాసికంలో రూ.532 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2016–17 ఏడాది డిసెంబర్ క్వార్టరులో బ్యాంకు రూ.56.7 కోట్ల నికరలాభాన్ని ఆర్జించటం గమనార్హం. టర్నోవరు రూ.5,013 కోట్ల నుంచి రూ.5,093 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– డిసెంబర్ కాలానికి రూ.15,254 కోట్ల టర్నోవరుపై మొత్తం రూ.876 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. స్థూల నిరర్ధక ఆస్తులు సెప్టెంబర్ క్వార్టరులో 13.27%గా (రూ.19,839 కోట్లు) ఉండ గా, ఇప్పుడు ఇవి 14.26 శాతానికి చేరి రూ.21,599 కోట్లకు ఎగిశాయి. రానిబాకీలకు కేటాయించిన నిధులు ఏకంగా 118% పెరిగి రూ.1,862 కోట్లకు చేరుకున్నాయి. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో నికరవడ్డీ ఆదాయం 37% పెరిగి రూ.1,672 కోట్లను తాకటం గమనార్హం. నిర్వహణ లాభం 46% అధికమై రూ.1,330 కోట్లుగా ఉంది. మొ త్తం వ్యాపారం 5.74% అధికమై రూ.3,51,735 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు 5.11% పెరిగి రూ.2,00,243 కోట్లకు, అడ్వాన్సులు 6.59% అధికమై రూ.1,51,492 కోట్లకు చేరాయి. -
భారీ కుంభకోణం: బ్యాంక్ మాజీ అధికారి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నగదు బదిలీ కేసు దర్యాప్తులో భాగంగా ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనుప్ ప్రకాశ్ గార్గ్‌ను అరెస్ట్ చేసింది. గుజరాత్‌కు చెందిన ఫార్మ కంపెనీ స్టెర్లింగ్ బయెటెక్ కుంభకోణం కేసులో ఈడీ ఈ చర్య తీసుకుంది. సుమారు రూ.5వేల కోట్ల మేర మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నగదు బదిలీ కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే ఈ కేసులో గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త గగన్ ధావన్‌ను అరెస్ట్ చేసింది. అలాగే గార్గ్ సహా, స్టెర్లింగ్ బయోటెక్,డైరెక్టర్స్ చేతన్ జయంతిలాల్ సందేశర, దిపిటీ చేతన్ సందేశర, రాజ్‌భూషణ్ ఓంప్రకాష్ దీక్షిత్, నితిన్ జయంతిలాల్ సందేశర, విలాస్ జోషి, చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాథి, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆంధ్రా బ్యాంక్ నాయకత్వంలోని కన్సార్టియం ద్వారా రూ.5 కోట్ల బ్యాంక్ అక్రమాలతోపాటు, సందేశర బ్రదర్స్ ద్వారా గార్గ్‌కు 2011లో రూ.1.52కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ గుర్తించింది. డిసెంబర్ 31, 2016 నాటికి గ్రూప్ కంపెనీల పెండింగ్‌లో ఉన్న మొత్తం రుణాలు రూ. 5,383 కోట్లుగా సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సిబిఐ విచారణ చతర్వాత ఈడీ నగదు బదిలీ కేసు నమోదు చేసింది. -
బ్యాంకులో సైకో వీరంగం
సాక్షి, నిడమనూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం ఆంధ్రాబ్యాంకులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బ్యాంకులోకి వచ్చిన అతను సిబ్బందిని తిట్టి.. దాడి చేశాడు. సైకో దాడిలో పలువురు గాయపడ్డారు. అంతటితో ఆగకుండా మేనేజర్ చాంబర్ అద్దాలు పగులగొట్టాడు. ఇతను మండలంలోని మెగ్యా తండాకు చెందిన కేతావత్ కృష్ణ అని తెలిసింది. -
హెచ్‌డీఐఎల్‌పై ఆంధ్రా బ్యాంక్ దివాలా పిటిషన్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: భారీగా బాకీపడిన రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) దాఖలు చేసిన దివాలా దరఖాస్తును ఆంధ్రా బ్యాంకు ఉపసంహరించుకుంది. రుణబాకీలను సెటిల్ చేసుకునేందుకు తాము సిధ్ధమైనందున ఆంధ్రా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌డీఐఎల్ పేర్కొంది. ఇప్పటికే కొంత మొత్తం చెల్లించినట్లు తెలిపింది. అయితే, ఎంత మొత్తం చెల్లించినదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సుమారు రూ.55 కోట్ల రుణాలు బాకీ పడిందంటూ అక్టోబర్ 30న హెచ్‌డీఐఎల్‌పై ఆంధ్రా బ్యాంకు.. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. -
కోఠి ఆంధ్రా బ్యాంకులో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కోఠి ఆంధ్రా బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకులోని 4 వ అంతస్తులో షార్టు సర్క్యూట్ ఏర్పడంతో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
ఆంధ్రాబ్యాంక్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
కొన్ని మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఆంధ్రాబ్యాంక్ షేరు 3.5 శాతం ఎగిసి రూ.62.05 వద్ద ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 16.40 లక్షల షేర్లు (6.98 శాతం) యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 2.51 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 25 పైసల నుంచి 35 పైసలకు పెరిగింది. ఈ యాక్టివిటీ లాంగ్ బిల్డప్‌ను సూచిస్తున్నది. రూ. 60 స్ట్రయిక్ వద్ద భారీ కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది. కాల్ ఆప్షన్ నుంచి 3.10 లక్షల షేర్లు కట్‌కాగా, మొత్తం బిల్డప్ 12.40 లక్షల షేర్లకు తగ్గింది. పుట్ ఆప్షన్లో 6.8 లక్షల షేర్లు యాడ్‌కాగా బిల్డప్ 10.90 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 65, రూ. 70 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ ఫలితంగా వరుసగా 50 వేలు, 7 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. ఈ స్ట్రయిక్స్ వద్ద 13.40 లక్షలు, 17.50 లక్షల షేర్ల చొప్పున బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో ఆంధ్రాబ్యాంక్ షేరు రూ. 60 సమీపంలో మద్దతు పొందుతూ క్రమేపీ రూ. 65 స్థాయిని అధిగమించవచ్చని, రూ. 60 మద్దతును కోల్పోతే మాత్రం క్షీణించవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. -
ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రుణం
తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు విజయనగరం ,జియ్యమ్మవలస : తహసీల్దార్, వీఆర్ఓ, డీటీల సంతకాలు ఫోర్జరీ చేసి రుణం పొందిన సంఘటన మండలంలోని పెదబుడ్డిడి గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సీమల రమాదేవికి మూడెకరాల జిరాయితీ పొలం ఉంది. దీనిపై ఆమె (సర్వే నంబర్లు 259/9, 258/10, 264/1, 3, 271/4) రావివలస ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిలో లక్ష రూపాయల రుణం కూడా తీసుకుంది. అయితే శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం విక్రమపురానికి చెందిన మాచర్ల అచ్యుతరావు నకిలీ కౌలుపత్రాలు సృష్టించి పల్లి కొండయ్య అనే వ్యక్తిని జామీనుగా చూపించి లక్ష రూపాయల రుణం తీసుకున్నారు. వీరిద్దరు కూడా ఆంధ్రాబ్యాంక్ రావివలస బ్రాంచిలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలు రమాదేవి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు సోమవారం వినతిపత్రం అందజేసింది. దీనిపై తహసీల్దార్ కేవీఎస్ భాస్కరరావు స్పందిస్తూ ఈ విషయమై విచారణ చేపడతామన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీటీసీ సభ్యుడు బాబూ భువనమోహనరావు, గ్రామపెద్దలు ఉన్నారు. -
29% పెరిగిన ఆంధ్రాబ్యాంకు లాభం
6.21 నుంచి 8.09 శాతానికి చేరిన ఎన్పీఏలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఆంధ్రాబ్యాంకు జూన్ త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో నికరలాభం 29 శాతం అధికమై రూ.40 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.4,855 కోట్ల నుంచి రూ.5,155 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం 13.55 శాతం పెరిగి రూ.1,441 కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు 5.61 శాతం వృద్ధితో రూ.1,88,272 కోట్లకు, మొత్తం అడ్వాన్సులు 6.25 శాతం పెరిగి రూ.1,45,801 కోట్లకు చేరుకున్నాయి. కార్పొరేట్, మిడ్ కార్పొరేట్ అడ్వాన్సులు 6.90 శాతం తగ్గి రూ.59,918 కోట్లు నమోదు చేసింది. ఎంఎస్ఎంఈకి ఇచ్చిన అడ్వాన్సులు ఏకంగా 23.2 శాతం హెచ్చి రూ.28,637 కోట్లుగా నమోదయ్యాయి. గృహ రుణాలు 25.5 శాతం అధికమయ్యాయి. సూక్ష్మ తరహా కంపెనీలకు పెద్ద పీట వేస్తూ రూ.10,527 కోట్ల రుణాలను మంజూరు చేసింది. క్రితం ఏడాది జూన్ క్వార్టరుతో పోలిస్తే ఇది 55.11 శాతం అధికం. నికర ఎన్పీఏలు 6.21 నుంచి 8.09 శాతానికి చేరాయి. రాని బాకీల కోసం చేసిన కేటాయింపులు గతేడాది జూన్ త్రైమాసికంలో రూ.942 కోట్లు ఉండగా, 2017–18 క్యూ1లో ఇవి రూ.1,209 కోట్లకు చేరడం గమనార్హం. లార్జ్, మిడ్ కార్పొరేట్ల ఎన్పీఏలు అధికమయ్యాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన అడ్వాన్సుల్లో 24.38 శాతం నిరర్ధక ఆస్తులుగా మారాయి. -
క్విప్ ద్వారా రూ.1,000 కోట్లు: ఆంధ్రాబ్యాంకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్ (క్విప్) ద్వారా డిసెంబరు నాటికి రూ.800–1,000 కోట్లు సమీకరించాలని ఆంధ్రాబ్యాంకు నిర్ణయించింది. తద్వారా బ్యాంకులో ప్రభుత్వ వాటా ప్రస్తుతమున్న 61.26 శాతం నుంచి 60 శాతం దిగువకు చేరుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి మూలధనం కింద రూ.1,100 కోట్ల నిధులు సమకూరాయి. ఈ నిధుల రాకతో బ్యాంకులో ప్రభుత్వ వాటా పెరిగింది. జీవిత బీమాలో సంయుక్త భాగస్వామ్య (జేవీ) కంపెనీ అయిన ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయ ప్రతిపాదన ఏదీ లేదని బ్యాంకు అధికారి ఒకరు స్పష్టం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో ఈ కంపెనీ విలువ మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జేవీ ద్వారా డివిడెండు పెద్దగా స్వీకరించనప్పటికీ లాభాలు వస్తున్నాయని గుర్తుచేశారు. జేవీలో ఆంధ్రాబ్యాంకుకు 30 శాతం వాటా, బ్యాంక్ ఆఫ్ బరోడా 44 శాతం, యూకేకు చెందిన లీగల్ అండ్ జెనరల్‌కు 26 శాతం వాటా ఉంది. -
కాళేశ్వరానికి మరో 10 వేల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు వీలుగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కి కొత్తగా మరో రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు ఉన్న ఐదు ప్యాకేజీల పనులకు ఎలాంటి ఆర్థిక లోటు ఉండకుండా చూసేందుకు ఈ నిర్ణయం చేసినట్లుగా తెలిసింది.ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ మొదలు ఎల్లంపల్లి వరకు చేసే పనులకు ఇప్పటికే రూ.7,400 కోట్ల టర్మ్ లోన్ ఇవ్వడానికి ఇప్పటికే ఆంధ్రాబ్యాంక్ ముందుకొచ్చి రుణాలిస్తోంది. ఇక ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ప్యాకేజీ 6 నుంచి ప్యాకేజీ 10 పనుల కోసం రూ.10 వేల కోట్ల రుణాలకు ప్రభుత్వం బ్యాంకులతో చర్చిస్తోంది. నాలుగు రోజుల కిందటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు చర్చలు జరిపారు. అనంతరం బ్యాంక్ అధికారులు పనులు జరుగుతున్న ప్యాకేజీల పరిధిలో పర్యటించి వచ్చారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన బ్యాంక్ అధికారులు రూ.10 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సానుకూలత తెలిపినట్లుగా తెలిసింది. ఈ రుణం తీసుకున్న పక్షంలో మొత్తంగా కార్పొరేషన్ తీసుకునే రుణం రూ.17,400 కోట్లకు చేరుతుంది. -
బ్యాంక్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
మరొకరికి జామీన్ ఉన్నందుకు డబ్బులివ్వని మేనేజర్ గొల్లపల్లి: డబ్బులివ్వకుండా బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఆంధ్రా బ్యాంకులో గురువారం ఓ రైతు ఆత్మహత్యకు యత్నిం చాడు. గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లికి చెందిన ఓర్పుల రాయమల్లు గొల్లపల్లి ఆంధ్రాబ్యాంక్‌లో 2013లో ట్రాక్టర్ కోసం రుణం తీసుకున్నాడు. దీనికి వడ్లకొండ చంద్రయ్యను జమానత్‌గా పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత రాయమల్లు బ్యాంకు అప్పు చెల్లించడం మానేశాడు. గత జనవరిలో జామీన్‌గా ఉన్న చంద్రయ్య ఖాతాలో పంట డబ్బులు రూ.1.80 లక్షలు జమయ్యాయి. ఈ డబ్బులు ఇచ్చేందుకు అధికారులు రాయమల్లు తీసుకున్న అప్పుకు లింక్ పెట్టారు. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. గురువారం బ్యాంకు వెళ్లినా అదే సమాధానం రావడంతో పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. గమనించిన ఖాతాదారులు అడ్డుకున్నారు. ఏఎస్సై మహిమూద్ అలీ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడారు. చివరకు రూ. 50 వేలు ఖాతాలో ఉంచి మిగిలిన డబ్బులు ఇస్తామని మేనేజర్ హామీ ఇచ్చాడు. -
ఆంధ్రా బ్యాంకు నుంచి మొబైల్ యాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ తాజాగా తమ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్ ఆవిష్కరించింది. ఏబీ తేజ్ (తొలి దశ) యాప్‌ను సెంటర్ ఫర్ టెలికమ్యూనికేషన్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వ్యవస్థాపకులు టి. హనుమాన్ చౌదరి ఆవిష్కరించినట్లు బ్యాంకు తెలిపింది. ఈ యాప్‌తో కస్టమర్లు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయానికి సత్వరం నమోదు చేసుకోవచ్చని, యాక్టివేట్ కూడా చేసుకోవచ్చని వివరించింది. అలాగే రోజంతా లావాదేవీలు జరిపేందుకు, మొబైల్.. డీటీహెచ్ మొదలైన వాటికి రీచార్జ్ చేసుకునేందుకు కూడా యాప్ ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఆంధ్రా బ్యాంక్ పథకాలు, సర్వీసుల గురించి దీని ద్వారా తెలుసుకోవచ్చని వివరించింది. మరిన్ని ఫీచర్స్‌తో రెండో దశ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది. -
ఆంధ్రాబ్యాంకు లాభం 32% డౌన్
మార్చి క్వార్టర్లో రూ.35 కోట్లు... పెరిగిన నిరర్ధక ఆస్తుల భారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు అధికమవడంతో మార్చి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంకు నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయింది. ఈ కాలంలో నికర లాభం 32 శాతం తగ్గడంతో రూ.35 కోట్లు నమోదు చేసింది. క్యూ4లో మొత్తం ఆదాయం రూ.5,124 కోట్ల నుంచి రూ.5,425 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 12.3 శాతం అధికమై రూ.1,685 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.1 నుంచి 3.59 శాతానికి పెరిగింది. నిర్వహణ లాభం 22.3 శాతం అధికమై 1,434 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరంలో.. 2016–17లో నికర లాభం అంత క్రితం కాలంతో పోలిస్తే 68 శాతం పడిపోయి రూ.174 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.19,199 కోట్ల నుంచి రూ.20,336 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 3.9 శాతం పెరిగి రూ.5,532 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్ 3.18 నుంచి 3.07 శాతంగా ఉంది. నిర్వహణ లాభం 10.8 శాతం పెరిగి రూ.4,388 కోట్లుంది. గుదిబండగా ఎన్పీఏలు.. బ్యాంకు నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) గణనీయంగా పెరిగాయి. స్థూల ఎన్పీఏలు 8.39 శాతం నుంచి 12.25 శాతానికి చేరి రూ.17,670 కోట్లకు ఎగిసాయి. నికర ఎన్పీఏలు 4.61 నుంచి 7.57 శాతంతో రూ.10,355 కోట్లకు చేరాయి. మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు మార్చి త్రైమాసికంలో 24.7 శాతం పెరిగి రూ.1,399 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరంలో ఇవి 23.2 శాతం ఎగసి రూ.4,214 కోట్లుగా ఉన్నాయి. కాగా, మొత్తం వ్యాపారం 9.3 శాతం పెరిగి రూ.3,39,673 కోట్లను తాకింది. మొత్తం డిపాజిట్లు 12.1 శాతం అధికమై రూ.1,95,441 కోట్లకు చేరుకున్నాయి. -
బామ్మకు టోకరా
ఖండవల్లి (పెరవలి) : మనవడు ఇచ్చిన సొమ్ము బ్యాంకులో వేద్దామని వచ్చిన ఓ బామ్మకు సినీఫక్కీలో మస్కా కొట్టి ఓ దొంగ సొమ్ముతో ఉడాయించిన ఘటన పెరవలి మండలం ఖండవల్లి ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఖండవల్లి గ్రామానికి చెందిన తుమ్మూరి లక్ష్మమ్మ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి ఈ బామ్మ వద్దకు వచ్చి ‘నేనూ బ్యాంకులోనే పనిచేస్తున్నాను.. ఫారం రాసి ఇస్తాను..’ అని చెప్పి ఒక ఫారం రాసి ఇచ్చాడు. ఆ వృద్ధురాలు అదే నిజమని నమ్మి నగదు తీసి లెక్కిస్తుండగా ‘నేను లెక్కపెడతాను.. ముందు బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకురా’ అని చెప్పి బామ్మ వద్ద నుంచి రూ.60 వేలు తీసుకుని ఆమెను బయటకు పంపించేశాడు. ఆమె అలా వెళ్లగానే ఇచ్చిన సొమ్ముతో ఉడాయించాడు. జిరాక్స్ కాపీతో బ్యాంకు లోపలికి వచ్చిన బామ్మ ఆ గుర్తు తెలియని వ్యక్తి కనిపించకపోయే సరికి జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంది. బ్యాంకులోని వారంతా విషయాన్ని గ్రహించి చుట్టుపక్కల గాలించినా దొంగ ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటానా స్థలానికి పెరవలి ఎస్సై పి.నాగరాజు చేరుకుని బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజీని పరిశీలించారు. దొంగను పట్టుకోవటానికి ప్రత్యేక టీమ్‌ను పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
అరకొర ప్రింటింగ్‌తో రూ. 2వేల నోటు
కోవెలకుంట్ల: పట్టణంలోని ఆంధ్రబ్యాంకు ఏటీఎంలో మంగళవారం ఓ ఖాతాదారునికి అరకొర ప్రింటింగ్ ఉన్న రూ. 2వేల నోటు వచ్చింది. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన ఇమాంఉసేన్ కోవెలకుంట్లలోని ఆంధ్రబ్యాంకు ఏటీఎం నుంచి రూ. 10వేలు డ్రా చేశాడు. ఐదు రెండు వేల నోట్లు బయటకు రాగా ఒక నోటుకు ఒక వైపు సరిగా ప్రింట్ కాని విషయాన్ని గుర్తించి అవాకయ్యాడు. ఆంధ్రబ్యాంకు మేనేజర్ గిరిధర్ దృష్టికి తీసుకెళ్లగా ఆ నోటును తిరిగి అక్కడే జమ చేయాలని ఆయన సూచించారు. -
ఫోన్ కు మెసేజ్.. కంగుతిన్న ఖాతాదారుడు
డోన్: తన ఖాతాలో ఉన్న సొమ్ములో కొంత తనకు తెలియకుండానే డెబిట్ కావడంతో ఓ ఖాతాదారుడు విస్తుపోయాడు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ లో డోన్ మండలం మల్లెంపల్లె గ్రామానికి చెందిన మనోహార్ ఖాతాదారుడు. ఈ క్రమంలో మనోహార్ ఖాతాలో ఉన్న రూ.50వేల మొత్తంలో నుంచి రూ.39 వేలు డెబిట్ అయినట్లు అతడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతున్న బాధితుడు మనోహర్ డోన్ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ గోపాలక్రిష్ణయ్యకు ఫిర్యాదు చేశాడు. బేల్దార్ పని చేస్తూ జీవిస్తున్న తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాంక్ ఖాతా వివరాలను ఇతరులకు తెలపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని మేనేజర్ అన్నారు. ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేయాలని ఆయన సూచించడంతో మనోహర్ ఆ మేరకు డోన్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ వ్యవహారం సైబర్‌నేరం కిందికి వస్తుందని, విచారణ చేపట్టిన్నట్లు ఎస్ఐ రామసుబ్బయ్య తెలిపారు. -
రూ.10 నాణేలపై దుష్ప్రచారం
► నాణేలపై నిషేధం ఏమీ లేదు- ఆంధ్రా బ్యాంక్ డీజీఎం కర్నూలు: రూ.10 నాణేలను కేంద్ర ప్రభుత్వం కానీ, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కానీ ఎలాంటి నిషేధం విధించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా ఆర్బీఐకి లేదు. రిజర్వుబ్యాంకు నుంచి యథావిదిగా నాణేలు సరఫరా అవుతున్నాయి. అయితే రూ. 10 నాణేలు చెల్లుబాటు కావన్న పుకార్లు షికార్లు చేస్తుండడంతో చిన్నచిన్న వ్యాపారులు, దుకాణదారులు వాటిని తీసుకునేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం గా డోన్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం నాణేల చెల్లుబాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రఘునాథ్‌ను వివరణ కోరగా పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావన్నది దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ఏ బ్యాంకుకు వెళ్లినా వాటిని తీసుకుంటారని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఎవ్వరో ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. -
ఆంధ్రాబ్యాంక్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్
విజయవాడ (వన్‌టౌన్) : భారత రిజర్వు బ్యాంక్ 2016–2017 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన నాలుగో సావరిన్ గోల్డ్ బాండ్లను ఆంధ్రాబ్యాంక్ తన అన్ని శాఖల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని బ్యాంక్ విజయవాడ జోనల్ మేనేజర్ డి.చంద్రమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి మార్చి మూడో తేదీ వరకూ ఆంధ్రాబ్యాంకుకు చెందిన 2872 శాఖల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ బాండ్లను దేశీయులైన వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు మాత్రమే కొనుగోలు చేయుటకు అర్హులని తెలిపారు. ఒకటి నుంచి 500 గ్రాముల వరకూ ఈ పథకంలో బాండ్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. గ్రాము ఖరీదును రూ.2,893గా , బాండ్ కాలపరిమితిని ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. ఐదు సంవత్సరాలు దాటిన తరువాత ముందస్తుగా రద్దు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకంలో బంగారాన్ని కొనకుండానే బంగారం మీద పెట్టుబడి పెట్టే సదుపాయాన్ని ప్రజలు పొందుతారని తెలిపారు. బాండ్ నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఎవరైతే బాండ్లో పెట్టుబడి పెట్టారో వారు అంతే బంగారపు విలువను రిజర్వుబ్యాంక్ నిర్దేశించిన మార్కెట్ రేటుకు అనుగుణంగా రూపాయల్లో పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఆరు మాసాలకొకసారి పెట్టుబడి మీద 2.5శాతం వడ్డీని పొందగలిగే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించినట్లు పేర్కొన్నారు. పెట్టుబడి కాలవ్యవధిలో బంగారపు ధరల హెచ్చు తగ్గుల నుంచి ఈ పథకం సరైన రక్షణ కల్పిస్తుందని తెలిపారు. -
సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు
ఆంధ్రా బ్యాంకు సామాజిక సేవలు అభినందనీయం: రాజేశ్వర్ తివారీ సాక్షి, హైదరాబాద్: ఖాతాదారులకు సేవలందిస్తూనే సామాజిక బాధ్యతగా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఆంధ్రాబ్యాంక్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ అన్నారు. గురువారం సచివాలయంలో ఆంధ్రాబ్యాంక్ సెక్రటేరియట్ శాఖ, యశోదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో 10 మంది వైద్య నిపుణుల బృందం సుమారు 800 మంది సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ జీఎం శ్రీధర్ మాట్లాడుతూ.. త్వరలో నిమ్స్‌కు అంబులెన్స్‌ను ఉచి తంగా అందజేయనున్నామని తెలిపారు. -
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆంధ్రా బ్యాంకు రుణం
హైదరాబాద్‌లో 4 ఆస్పత్రులకు రూ.800 కోట్లు ఇచ్చే అవకాశం ఆంధ్రా బ్యాంకు ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ చర్చలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించబోయే నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రుణం ఇవ్వడానికి ఆంధ్రా బ్యాంకు ముందుకు వచ్చింది. ఒక్కో ఆస్పత్రికి రూ.200 కోట్ల చొప్పున రూ.800 కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. బుధవారం ఈ మేరకు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆంధ్రా బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరిపారు. రుణ షరతులు తదితర అంశాలపై ఓ అంచనాకు వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితోనూ చర్చలు జరుపుతారు. ఎల్బీ నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోం వద్ద, రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పక్కన, మియాపూర్ బస్ టర్మినల్ పక్కన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఆస్పత్రుల్లో మహిళలు, పిల్లల సంరక్షణతో పాటు ఇతర అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు. ఒక్కో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో 500 పడకలకు అదనంగా మరో 250 పడకలు తల్లులు, పిల్లల సంరక్షణ కోసం నిర్మిస్తారు. ఆయా ఆస్పత్రులను నిర్మించడానికి అవసరమైన అంచనాలు, ప్రణాళిక తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. గతంలో ఒక విదేశీ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచించింది. అయితే ఆ దేశ కరెన్సీ ద్వారా వాయిదాలు చెల్లించే సందర్భంలో రూపాయి విలువ పడిపోతే మరింత భారం కావచ్చొని భావించింది. దీంతో ఆ రుణాన్ని వద్దనుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. -
ఆంధ్రా బ్యాంక్ లాభం 65% అప్
• క్యూ3లో రూ. 57 కోట్లు • 6.98 శాతానికి నికర ఎన్పీఏలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు గణనీయంగా పెరిగినప్పటికీ.. అధిక ట్రెజరీ ఆదాయాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ నికర లాభం 65% వృద్ధితో రూ. 56.70 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ 34.46 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. తాజాగా ఆదాయం రూ. 4,801 కోట్ల నుంచి రూ. 5,012 కోట్లకు పెరిగినట్లు ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. సమీక్షాకాలంలో ట్రెజరీ విభాగ ఆదాయం రూ. 1,013 కోట్ల నుంచి రూ. 1,312 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 7% నుంచి 11.88%కి పెరగ్గా.. నికర ఎన్పీఏలు 3.89% నుంచి 6.98%కి ఎగిశాయి. విలువపరంగా చూస్తే డిసెంబర్ ఆఖరుకి జీఎన్‌పీఏలు రూ. 9,520.92 కోట్ల నుంచి రూ. 16,888.34 కోట్లకు పెరిగాయి. అటు నికర ఎన్పీఏలు రూ. 5,102.81 కోట్ల నుంచి రూ. 9,382.38 కోట్లకు ఎగిశాయి. అయితే, మొండి బకాయిల కోసం కేటాయింపులు రూ. 905.56 కోట్ల నుంచి రూ. 828.71 కోట్లకు తగ్గాయి. గురువారం బీఎస్ఈలో ఆంధ్రా బ్యాంక్ షేరు 1.23 శాతం పెరిగి రూ. 57.80 వద్ద ముగిసింది. -
కాళేశ్వరానికి 1,300 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కి ఆంధ్రాబ్యాంకు రూ.1,300 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ కన్సార్షియంలో లీడ్ బ్యాంకుగా వ్యవహరించేందుకు గతంలోనే ఆంధ్రాబ్యాంకు ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.17,500కోట్లలో రూ.7,400 కోట్ల టర్ము లోను ఇవ్వడానికి అంగీకరించింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం (లింక్–1)కు అవసరమైన రూ.9,250 కోట్ల నిధులపై కేఐపీసీ ప్రతిపాదనలను బ్యాంకుకు అందజేసింది. దీంతో రూ.1300 కోట్ల టర్ము లోనును మం జూరు చేస్తూ నిబంధనలను ప్రభుత్వానికి తెలిపింది. ప్రాజెక్టు వ్యయంలో 20% మార్జిన్ మనీగా రూ.325కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
విశాఖ ఆంధ్రాబ్యాంక్‌లో గందరగోళం
విశాఖ: విశాఖ జిల్లా ఆనందపురం ఆంధ్రాబ్యాంక్‌లో గందరగోళం నెలకొంది. ఒకరి ఖాతాలో వేయాల్సిన డబ్బును మరొకరి ఖాతాలో జమా చేశారని ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఆనందపురం ఆంధ్రాబ్యాంక్‌లో సోమవారం పలువురు ఖాతాదారులు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే డబ్బులు తారమారయ్యాయని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇల్లు ఖాళీ చేయించడంలో ఉద్రిక్తత
బ్యాంకు వేలంలో ఇల్లు కొన్న ఎంపీ గల్లా జయదేవ్ పట్నంబజారు (గుంటూరు): గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆంధ్రాబ్యాంకు వేలంలో కొనుగోలు చేసిన ఇంటిని అధికారులు ఖాళీ చేయించే విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరులో గుంటుపల్లి శ్రీనివాస్ వ్యాపారం నిమిత్తం ఆంధ్రాబ్యాంకులో రూ.2.50 కోట్ల అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చకపోవడంతో గత జూన్‌లో బ్యాంకు అధికారులు ఆయన ఇంటిని వేలం వేశారు. అప్పటికే ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఎంపీ జయదేవ్ రూ.3.09 కోట్లకు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కుటుంబాన్ని ఆ ఇంట్లోంచి ఖాళీ చేయించాలని అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా వారు ఖాళీ చేయకపోవడంతో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో బ్యాంకు అధికారులు.. పోలీసు, రెవెన్యూ అధికారుల సాయంతో ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాస్ భార్య పద్మ తనకుమారుడు సమంత్‌తో పాటు రెండు లీటర్ల పెట్రోల్ తీసుకుని గదిలోకెళ్లి తలుపులు వేసుకు న్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడబోమని చెప్పారు.దీంతో అధికారులు ఆందోళన చెందారు. చివరకు శ్రీనివాస్ తండ్రి పూర్ణచంద్రరావు సర్దిచెప్పడంతో పద్మ బయటకు వచ్చారు. అధికారులు ఇంటిని సీజ్ చేశారు. -
ఆంధ్రాబ్యాంకు డీజీఎం బదిలీ
- పదోన్నతిపై బెంగళూరు సర్కిల్ జీఎంగా నియామకం కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రబ్యాంకు కర్నూలు జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ పదోన్నతిపై బెంగళూరు సర్కిల్ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. రెండున్నర ఏళ్ల పాటు ఇక్కడ డీజీఎంగా పనిచేసిన ఆయన శుక్రవారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈయన స్థానంలో డీజీఎంగా రఘునాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై బదిలీ అయిన గోపాలకృష్ణకు ఈ నెల 17 సన్మాన సభ ఏర్పాటు చేయనున్నారు. -
మొరాయించిన ఇంటర్నెట్
సంగెం : స్థానిక ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం ఇంటర్నెట్ సమస్య ఏర్పడడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం ఇం టర్నెట్ నిలిచిపోగా ఉద్యోగులు హన్మకొండ వెళ్లి తమ లావాదేవీలు ముగించుకున్నారు. అయితే, శుక్రవారం బ్యాంకు తెరిచాక కూడా ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ఉద్యోగులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నెట్ పనిచేయడంతో వినియోదారులకు డబ్బు అందజేశారు. -
ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ అరెస్ట్
-
ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ అరెస్ట్
నగదు మార్పిడికి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడిన వైనం హుజూర్నగర్: కమీషన్‌కు కక్కుర్తి పడి నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ఓ బ్యాంక్ క్యాషియర్ పోలీసులకు చిక్కాడు. వివరాలు .. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి నాలుగేళ్లుగా మఠంపల్లి ఆంధ్రా బ్యాంక్‌లో క్యాషియర్. మఠంపల్లిలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న స్వర్ణ డానియేల్ తరచూ ఆంధ్రా బ్యాంక్‌లో ఎలక్ట్రీషియన్ పనులు చేసేందుకు వెళుతుండేవాడు. ఈ క్రమంలో క్యాషియర్ రవీందర్‌రెడ్డి ఎలక్ట్రీషియన్ డానియేల్ ద్వారా కమీషన్ పద్ధతిలో నోట్ల మార్పిడి చేసేందుకు పథకం రచించాడు. సదరు ఆంధ్రాబ్యాంక్‌లో రవీందర్ రెడ్డి బంధువులకు చెందిన 5 ఖాతాలు, అదే బ్యాంక్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న మాథ్యూ స్ బంధువులకు చెందిన 4 ఖాతాలను నోట్ల మార్పిడికి ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. డానియేల్ నూతన నోట్లు కావలసిన వారిని గుర్తించి రవీందర్‌రెడ్డికి అప్పగించేవాడు. రూ.100కు 19 శాతం కమీషన్ ఒప్పందంతో నవంబర్ 8వ తేదీ నుంచి 9 బ్యాంక్ ఖాతాల ద్వారా నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ రంజిత్‌రెడ్డి ఈ నెల 27న మఠంపల్లి రోడ్డులో హుజూర్నగర్ వైపుగా వస్తున్న రవీందర్‌రెడ్డి కారును నిలిపి తనిఖీలు చేశారు. సదరు కారులో రూ. 2 లక్షలు నూతన కరెన్సీ నోట్లు దొరికాయి. సదరు నోట్లు కూడా ఆంధ్రాబ్యాంక్‌లోని ఖాతాల ద్వారా మార్పిడి చేసి ఇంటికి తీసుకువస్తున్న నగదుగా గుర్తిం చారు. హుజూర్నగర్ గోవిందాపురంలో గల రవీందర్‌రెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టగా రూ.2 వేల నూతన నోట్లు రూ. 3 లక్షల 22 వేలు దొరికాయి. -
ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ అరెస్ట్
మటంపల్లి : సూర్యాపేట జిల్లా మటంపల్లి ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ రవీందర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం పెద్దమొత్తంలో నోట్లు మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన హుజూర్నగర్ పోలీసులు క్యాషియర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ. 5.22 లక్షల విలువైన పాత వెయ్యి రూపాయల నోట్లను మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దీనిపై పోలీసులు రవీందర్ రెడ్డిని విచారిస్తున్నారు. -
ఆంధ్రా బ్యాంక్ లాకర్లో 39 లక్షలు సీజ్
విశాఖ: విశాఖపట్నం ఆర్అండ్బీ డీఈఈ సురేష్ చంద్ర పాత్రో ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా సోమవారం నగరంలోని విశాలాక్షి నగర్ ఆంధ్రాబ్యాంక్ లాకర్ తెరిచి చూడగా అందులో రూ. 39 లక్షల నగదు లభ్యమైంది. దీంతో ఏసీబీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆదాయనికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై డీఈఈ ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన స్థలాలు, ఫ్లాట్లు, బంగారం, వెండి వస్తువులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.4.08 కోట్లకు పైగా ఉంటాయని సమాచారం. మరోవైపు పాత్రోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరచగా, ఆయనకు న్యాయస్థానం జనవరి 5వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. కాగా ఏసీ రైలులో ప్రయాణించినప్పుడు బోగిలో అందించే దుప్పట్లను సైతం డీఈఈ విడిచిపెట్టలేదు. దొంగతనంగా తీసుకొచ్చిన ఆ దుప్పట్లను చూసి సోదాల సందర్భంగా ఏసీబీ అధికారులు కూడా విస్తుపోయారు. 2015, 2016 సంవత్సరానికి సంబంధించి సుమారు 65 దుప్పట్లు పాత్రో ఇంట్లో బయటపడ్డాయి. -
అప్పిచ్చు వైద్యుడు...
మన దిగ్గజాలు బ్యాంకులు, బీమా అంటేనే తెలియని రోజులవి. బ్యాంకులంటే డబ్బున్నోళ్లకు మాత్రమే చెందిన సంస్థలని జనం అనుకునే రోజులవి. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వృత్తికి వైద్యుడే అయినా... ఆ రోజుల్లోనే ఆయన తన ఇంటి అరుగు మీద ఆంధ్రాబ్యాంకుకు పురుడు పోశాడు. లక్ష రూపాయల మూల ధనంతో ప్రారంభమైన ఆంధ్రాబ్యాంకు అంచెలంచెలుగా విస్తరించి, జాతీయ బ్యాంకుగా మారింది. ఇప్పుడా బ్యాంకు ఆస్తుల విలువ లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. తెలుగు నేల మీద పుట్టిన ఒక బ్యాంకు దేశమంతటా వేళ్లూనుకుని, ఇంతగా విస్తరించిందంటే... అదంతా ఆయన చేతి చలవే! భోగరాజు పట్టాభి సీతారామయ్య బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన 1880 నవంబర్ 24న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటి కృష్ణాజిల్లాలోని గుండుగొలను గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పాలుగారే పసివయసులో ఒంటిమీద కనీసం చొక్కా కూడా లేకుండా చలికి వణుకుతూ బడికి వెళుతున్న పట్టాభిని చూసి గ్రామస్తులు జాలి పడేవారు. తల్లిదండ్రులకు పుస్తకాలు కొనే స్థోమత లేకపోవడంతో తోటి విద్యార్థుల పుస్తకాలను చదివి, వాటినే రోజంతా మననం చేసుకునేవారు. ఇంటి ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లుగా మెసలుకోవడం ఆయనకు బాల్యం నుంచే అలవాటైంది. ఇంటికి కావలసిన కట్టెలు కూడా నెత్తిన పెట్టుకుని మోసుకొచ్చేవారు. అది చూసి నవ్విన తోటి విద్యార్థితో ‘నేను నా ఇంటి పనులు చేసుకోవడానికి సిగ్గు పడను. అనవసర భేషజాలకు పోయి డబ్బు వృథా చేయను. మీరు నవ్వినందున నాకొచ్చే నష్టం లేదు’ అని సమాధానమిచ్చిన ధీశాలి ఆయన. ప్రతిభా పాటవాలతో సంపాదించుకున్న ఉపకార వేతనంతో చదువు సాగించారు. తర్వాత పిల్లనిచ్చిన మామ సహాయంతో మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేసి, బందరులో ప్రాక్టీసు పెట్టారు. హస్తవాసి గల వైద్యుడిగా పేరుపొంది ఆ రోజుల్లోనే లక్షల ఆదాయాన్ని గడించారు. లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభం ఒకరోజు సీతారామయ్య గారు వారింటి అరుగుపై కూర్చొని ఉండగా ఎదురుగా ఉన్న వైశ్యుల ఇంట్లో సోదరుల మధ్య గలాటా ప్రారంభమైంది. డబ్బు దాచడంలో వచ్చిన తగాదా అని తెలుసుకుని, తన దగ్గిర దాచడానికి అంగీకరించారు. అప్పటికప్పుడే వారి పేరు మీద ఖాతాలు ప్రారంభించి జమా ఖర్చులు రాశారు. అలా వీధి అరుగు మీద ప్రారంభమైన ఆర్థిక సంస్థ తర్వాత ఆం«ధ్రాబ్యాంకుగా అవతరించింది.. బందరు ప్రముఖులు సమకూర్చిన లక్ష రూపాయల మూలధనంతో 1923 నవంబర్ 23న అధికారికంగా ఆంధ్రాబ్యాంకు ప్రారంభమైంది. ప్రజల నుంచి చిన్నమొత్తాలు సేకరించి రైతులకు రుణాలు ఇచ్చేవారు.1980లో ఆంధ్రాబ్యాంకును జాతీయం చేశారు. తెలుగు గడ్డపై జన్మించిన ఏకైక జాతీయ బ్యాంకు ఇదొక్కటే. దేశంలోనే తొలిసారిగా 1981లోనే క్రెడిట్‌కార్డులను జారీ చేసిన ఘనత ఆంధ్రాబ్యాంకుదే. బయోమెట్రిక్ ఎటీ ఎంలు, విద్యా రుణాలను కూడా ఆంద్రాబ్యాంకే ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 3 వేల శాఖలు, 30 వేల సిబ్బంది ఉన్నారు. లక్ష రూపాయలతో మొదలైన వ్యాపార ప్రస్థానం ఇప్పుడు లక్ష కోట్లను అధిగమించింది. డిపాజిట్ల సేకరణలో ఆసియాలోనే తొలి స్థానంలో ఉంది. సగం రుణాలను వ్యవసాయ రంగానికి కేటాయించి నేటికీ పట్టాభి స్ఫూర్తిని కొనసాగిస్తోంది. బీమా రంగంలోనూ హస్తవాసి ఆం్ర«ధాబ్యాంకుతో పాటు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1915లో కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు, 1927లో ఒడ్డమన్నాడ భూమి తనఖా బ్యాంకు, 1923లో భారత లక్ష్మీ బ్యాంకులను స్థాపించారు. బీమా రంగంలోనూ అడుగుపెట్టి 1925లో ఆంధ్రా ఇన్సూరెన్స్, 1935లో హిందుస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీలను స్థాపించారు. తర్వాతి కాలంలో అవి ఎల్ఐసీలో విలీనమయ్యాయి. విద్యారంగానికి ఊతమిచ్చేందుకు ఆంధ్ర జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. ‘కృష్ణాపత్రిక’ను గాడిలో పెట్టారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌లో చేరి, జాతీయోద్యమ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. స్వతంత్ర దేశంలో తొలి ఏఐసీసీ అధ్యక్షులు... తెలుగు వాళ్ల గొప్పేంటట అన్న ప్రత్యేక రాష్ట్ర కమిటీ ముందు జేబులో నుంచి అణా నాణాన్ని తీసి గిరాటేసి ‘దీనిపైన ఆంగ్లేయులు వన్ అణా అని ఇంగ్లీషులో, ఒక అణా అని తెలుగులో తప్ప మరే భారతీయ భాషలోను ముద్రించలేదు.. అదే మా గొప్ప’ అని బదులిచ్చిన ధీశాలి. బ్రిటిష్ ప్రభుత్వం క్విట్ ఇండియా ఉద్యమంలో పట్టాభిని మూడేళ్లు అహ్మద్‌నగర్ కోటలో ఉంచి చిత్రహింసలు పెట్టింది. స్వతంత్ర భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ తొలి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఘనత భోగరాజుకే దక్కుతుంది. రాజ్యసభ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచే సి 1959 డిసెంబర్ 17న కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. -
నగదు రహిత లావాదేవీలకు ఎం పాస్ మిషన్లు
– ఆంధ్రాబ్యాంకు డీజీఎం వెల్లడి కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రాబ్యాంకులో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఎం పాస్ మిషన్లు వినియోగిస్తున్నట్లు ఆ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలోని వ్యాపారులకు ఎం పాస్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కర్నూలు రీజియన్‌కు ఎం.పాస్ మిషన్లు 80 వచ్చాయన్నారు. ఒక మిషన్‌కు ఒక కరంట్ ఖాతాతోనే లావాదేవీలు నిర్వహించవచ్చని, అయితే మొబైల్ ఫోన్లను మాత్రం ఒకటి కంటే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. డీఆర్డీఏ పీడీ రామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో 4.70 లక్షల మంది పొదుపు మహిళలు ఉన్నారని, వీరందరినీ నగదు రహిత లావాదేవీల వైపు మళ్లిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏజీఎం, మేనేజర్లు బిజిలీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జనం పాట్లు పట్టని ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి బ్యాంక్ అధికారుల దృష్టికి పింఛన్‌దారుల పాట్లు కోరుకొండ : పెద్దనోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలతో పాటు పింఛన్‌దారులైన దివ్యాంగులు, వితంతువులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బ్యాంకుల వద్ద నిత్యం నరకయాతన పడుతున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పింఛన్‌దారులు పడుతున్న సమస్యలను సోమవారం ఆమె తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ స్టేట్ బ్యాంకు మేనేజరు ద్వారంపూడి వెంకటకృష్ణారెడ్డి, పశ్చిమ గానుగూడెం ఆంధ్రా బ్యాంకు మేనేజరు పీఎస్ రాజాలకు వివరించారు. నడవలేని స్థితిలో ఉన్న కోటికేశవరానికి చెందిన గుడేలి కాంతమ్మ (బధిర వృద్ధురాలు), బొల్లెద్దుపాలెంకు చెందిన వికలాంగురాలు గోలి గన్నెమ్మలను వారి వద్దకు తీసుకెళ్లి వారి వెతలను వినిపించారు. పింఛన్‌దారులతో పాటు రైతులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు నగదు కోసం చాలా అవస్థలు పడుతున్నారన్నారు. ఏటీఎంలలో కూడ నగదు ఉండడం లేదని ఆరోపించారు. పింఛన్దారులలో కొందరు ఏటీఎం కార్డులు, బ్యాంకు అకౌంట్ల కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. పింఛన్‌దారులందరికీ నేరుగా పంచాయతీల ద్వారా నగదు బట్వాడా చేయాలని డిమాండ్ చేశారు. పోస్టాఫీసులలో చాలా రోజులుగా నగదు ఇవ్వడం లేదని ఆరోపించారు. పింఛన్‌దారులు, బ్యాంకు వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, జిల్లా కార్యదర్శులు చింతపల్లి చంద్రం, అయిల శ్రీను, మండల బీసీ సెల్ కన్వీనర్ సూరిశెట్టి భద్రం, రాష్ట్ర యూత్ కార్యదర్శి బొరుసు బద్రి, మండల యూత్ అధ్యక్షుడు అడపా శ్రీను, మండల అధికార ప్రతినిధులు గరగ మధు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, కోరుకొండ యూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి సత్తిరెడ్డి, పసుపులేటి బుల్లియ్యనాయుడు, విద్యార్థి విభాగం నాయకుడు వుల్లి గణనాథ్, ఎంపీటీసీ వుల్లి చెల్లారావు, రైతు నాయకులు గింజాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ కష్టాలు తీర్చాలి. కరెన్సీ కష్టాలను తక్షణం తీర్చాలని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద తగినంత నగదు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం కోరుకొండలో ప్రదర్శన నిర్వహించారు. పింఛనుదార్లకు ఆయా పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్లు అందించాలని; రైతులు, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగదు ఇవ్వాలని; వృద్ధులు, వికలాంగులకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
ఆంధ్రా బ్యాంక్ వన్
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోన్న యుగమిది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం స్మార్ట్‌ఫోన్ చుట్టే తిరుగుతోంది. అందుకు ఆర్థిక లావాదేవీలకు మీ ఫోన్‌నే బ్యాంకుగా మార్చేసుకోండి. సులభంగా డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ఎలా అంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే యూపీఐ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే పలు బ్యాంకులు వాటి యూపీఐ యాప్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చాయి. వాటిల్లో మనమిప్పుడు ‘ఆంధ్రా బ్యాంక్ వన్’ అనే యూపీఐ యాప్ గురించి తెలుసుకుందాం. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ⇔ ఒకే మొబైల్ యాప్ ద్వారా పలు బ్యాంక్ ఖాతాలనుఆపరేట్ చేయవచ్చు. ⇔ వర్చ్యువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా ఏ బ్యాంక్ ఖాతాకైనా సులభంగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్క డ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎ‹స్సీ కోడ్లతో పనిలేదు. ⇔ బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎ‹స్సీ కోడ్ సాయంతో కూడా డబ్బుల్ని ఇతరులకు పంపే ఆప్షన్అందుబాటులో ఉంది. ⇔ అలాగే వర్చ్యువల్ పేమెంట్ అడ్రస్ కలిగిన ఎవరి నుంచైనా డబ్బుల్ని తీసుకోవచ్చు. ⇔ లావాదేవీలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే.. వాటి గురించి యాప్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. -
కరెన్సీ కష్టాలకు చెక్
స్వశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో మినీ బ్యాంక్ ఏర్పాటు హుస్నాబాద్: నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న వారి ఇబ్బందులను ఓ మహిళా సంఘం తీర్చి ఆదుకుంటోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లోని స్వశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రాబ్యాంకు సహకారంతో మినీబ్యాంకు ఏర్పాటు చేశారు. శనివారం బ్యాంకులు బంధ్ కావడంతో గ్రామస్తులు నగదు కోసం ఇక్కడ బారులుదీరారు. స్వశక్తి మహిళలు పొదుపు, రుణాల చెల్లింపులను ఈ బ్యాంకు (స్వైపింగ్ మిషన్) ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏటీఎం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ మినీబ్యాంకు ద్వారా రూ.2 వేలు నగదు చెల్లిస్తున్నారు. ఈ విధానం పెద్దనోట్ల రద్దుకు ముందే ఉందని.. అయితే, ఇప్పుడు అది గ్రామస్తులకు బాగా ఉపయోగపడుతోందని సంఘం సీఏ కనకతార తెలిపారు. -
పింఛన్ కోసం వెళ్తే కర్రతో కొట్టాడు
బ్యాంక్ మేనేజర్‌పై ఫిర్యాదు ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ తమపై దురుసుగా ప్రవర్తిస్తూ కర్రతో కొట్టాడని పింఛన్‌దారులు అల్లె లక్ష్మి, ఎండీ. నస్రీం, శాగ దేవవ్వ, ఒడ్డె మల్లవ్వ తెలిపారు. సోమవారం పింఛన్ దారులు, ఖాతాదా రులు పెద్ద సంఖ్యలో బ్యాంక్ వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో క్యూలైన్లో ఉన్న తమను మేనేజర్ కర్రతో కొట్టాడని విలపిం చారు. అక్కడే ఉన్న ఖాతాదారులు, మహి ళలు మేనేజర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నాయకులకు సమాచారం అందించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తిరుపతి, రాములు, రాజేశం, మహేష్‌రెడ్డి, రాం గోపాల్ బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారులతో కలసి బైఠా రుుంచారు. గంటకు పైగా బ్యాంకు ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పోలీసులు వారిని సముదారుుంచారు. తాను ఎవరిపై దాడి చేయలేదని, దురుసుగా ప్రవర్తించలేదని బ్యాంక్ మేనేజర్ రాజేంద్రకుమార్ అన్నారు. బ్యాంకు మేనేజర్‌పై ఎస్సై ప్రవీణ్‌కు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై తహసీల్దార్ రేణుక బ్యాంక్ వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. ధాన్యం డబ్బుల కోసం బ్యాంక్‌కు వచ్చిన తనను మేనేజర్ కర్రతో నడుముపై కొట్టాడని, నొప్పితో నడవ రావడం లేదని దేవవ్వ తెలిపింది. -
ఎనీటైం మూతే..!
కర్నూలు (అగ్రికల్చర్): ఏటీఎం సేవలు పూర్తిగా స్తంభించాయి. జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా..పట్టుమని 10 కూడా పని చేయడం లేదు. ఆంధ్రాబ్యాంకుతో సహా వివిధ బ్యాంకుల ఏటీఎంలు పది రోజులుగా మూతపడ్డాయి. కొన్నిచోట్ల మాత్రం ఎస్బీఐ ఏటీఎంలు పని చేస్తున్నాయి. వీటి దగ్గర నగదు కోసం వందలాది క్యూ కడుతున్నారు. రూ.2వేలు, కొత్తగా వచ్చిన రూ.500 నోట్లు ఏటీఎంలలో పెట్టేందుకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉండటం, నగదు లేకపోవడం వల్ల అవి మూతపడిపోయాయి. ఎస్బీఐ ఏటీఎంల్లో సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 10 ఏటీఎంల్లో పెడుతున్న నగదు గంట, రెండు గంటల్లోనే ఖాళీ అవుతుండటంతో వందలాది మందికి నిరాశనే మిగులుతోంది. జిల్లాలో 34 బ్యాంకులకు సంబంధించి 445 బ్రాంచ్‌లు ఉండగా, వీటిల్లో రూ.2000 నోట్లు తప్ప ఇతరత్రా కరెన్సీ లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన రూ.160 కోట్లు అన్ని బ్యాంకులకు పంపిణీ చేశారు. ఈ నగదు వివిధ బ్యాంకుల్లో ఉండటంతో సోమవారం ప్రజలు పోటెత్తారు. ప్రతి బ్యాంకులో కనీసం 400 నుంచి 600 మంది వరకు రావడంతో బ్యాంకులు కిటకిట లాడాయి. నగదు నిల్వలు పడిపోవడంతో బ్యాంకు కౌంటర్లలో కేవలం రూ.4000 నుంచి రూ.6000 వరకు పంపిణీ చేశారు. ఉద్యోగుల్లో ఇప్పటికి 20 శాతం మంది జీతాలకు నోచుకోలేదు. -
మహిళలపై బ్యాంక్ మేనేజర్ దాడి
సిరిసిల్ల: నగదు కోసం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులపై బ్యాంక్ మేనేజర్ దాడి చేశాడు. ఈ సంఘటన సిరిసిల్లా రాజన్న జిల్లా ముస్తాబాద్‌లో సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఆంధ్రబ్యాంక్‌కు నగదు కోసం వచ్చిన ఖాతాదారులపై బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర చేయి చేసుకున్నాడు. నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు సోమవారం ఉదయాన్నే బ్యాంకు ఎదుట బారులు తీరారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అసహనానికి గురైన బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర వీరంగం సృష్టించాడు. లైన్లో నిల్చొని ఉన్న మహిళలపై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. మేనేజర్ తీరుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. -
‘పట్టాభి’ మనుమరాలికీ తప్పని నోట్ల తిప్పలు
-
‘పట్టాభి’ మనుమరాలికీ తప్పని నోట్ల తిప్పలు
సాక్షి, విశాఖపట్నం: పెద్దనోట్ల కష్టాలు చివరకు బ్యాంకు వ్యవస్థాపకుడు వారసురాలికి కూడా తప్పలేదు. దేశంలోనే ప్రముఖ జాతీయ బ్యాంకుల్లో ఒకటైన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు బీ.పట్టాభిసీతారామయ్య మనుమరాలైన బీవీ మహాలక్ష్మి(75) తన భర్త పింఛన్ తీసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఫిషరీస్ శాఖలో పనిచేసిన భర్తకు పింఛన్ రూ.24 వేలు వస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలలో పరిమితి విధించడంతో మనుమడిని అక్కయ్యపాలెంలోని ఆంధ్రా బ్యాంకుకు పంపింది. మహాలక్ష్మిని చూడకుండా డబ్బు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెప్పడంతో కుమార్తె, మనుమడి సాయంతో బ్యాంకుకొచ్చి మెట్లు ఎక్కలేక బయటే కూర్చుండిపోరుుంది. ఆమె మనుమడు లోపలకు వెళ్లి బ్యాంకు సిబ్బందిని బయటకు పిలుచుకుని వచ్చాడు. వారు ఆమెను చూసి.. పింఛన్ రికార్డులను పరిశీలించి చేతిలో రూ.11 వేలు ఇచ్చారు. ఈ సొమ్ము తనకు సరిపోదని, మందులకే రూ.8 వేలు ఖర్చవుతుందని ఆమె వాపోయారు. -
బ్యాంకులు తెరవకపోవడంతో జనం పాట్లు
-
పెళ్లిళ్లకు బ్యాంకుల మోకాలడ్డు
గజపతినగరం రూరల్: మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన వధూవరుల తల్లిదండ్రులు ఆంధ్రాబ్యాంకులో దాచుకున్న డబ్బు పెళ్లికోసం అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు వారు బ్యాంకు ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతున్నా చిల్లి గవ్వకూడా బ్యాంకు అధికారులు ఇవ్వక పోవడంతో పెళ్లి రద్దవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లి దగ్గర పడుతోందని ఉన్న భూములను అమ్ముకొని బయట కొంత అప్పు చేసి బ్యాంకులో దాచుకున్న నగదును పెళ్లి సమయానికి తీసుకుందామనుకుంటే ఇప్పుడు అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని ముచ్చర్ల గ్రామానికి చెందిన వధువు ఉత్తర వివాహం డిసెంబర్ ఒకటో తేదీన జరగాల్సి ఉన్నా డబ్బు ఇవ్వలేదని ఆమె తల్లి దండ్రులు గేదెల రమణ, గేదెల కృష్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన మరో పెళ్లి ఈ నెల 9వ తేదీన జరుగుతున్నందున బ్యాంకులో నగదును తీసుకోవడానికి వారం రోజులుగా క్యూలో నిలుస్తున్నా డబ్బు అందడం లేదని మరో వధువు సుజాత తల్లి దండ్రులు మీసాల సూరప్పడు, అన్నాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బ్యాంకు మేనేజర్ సీతారామును ప్రశ్నించగా రోజుకు నాలుగునుంచి ఐదు లక్షలు వస్తోందనీ ఆ మేరకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పెళ్లిళ్లు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. -
ఆంధ్రాబ్యాంకును ముట్టడించిన ఖాతాదారులు
బండార్లంకలో ప్రజలు నిరసన ∙బ్యాంకు అధికారులతో వాగ్వివాదం అమలాపురం రూరల్ : గత వారం రోజులుగా తమ గ్రామంలోని ఆంధ్రాబ్యాంకులో ‘నో క్యాష్’ అనే బోర్డు కు మోక్షం కలగకపోవడంతో బండార్లంక వినియోగదారులు ఆ బ్యాంకును ముట్టడించటమే కాకుండా బ్యాంకు ముందు మంగళవారం నిరసన తెలిపి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు ఎవరూ పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. బ్యాంకు మేనేజర్ కేవీఎ¯ŒS ప్రసాద్‌తో ఖాతాదారులు వాగ్వివాదానికి దిగారు. బ్యాంకులో నగదు లేకపోవటం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని వివరణ ఇచ్చుకున్నారు. రూ.15 లక్షలు నగదు వస్తేనే ఖాతాదారులకు చెల్లింపులు చేస్తామన్నారు. బ్యాంకులో వ్యాపారులు కూడా కొత్త నోట్లు, చిల్లర నోట్లు డిపాజిట్ చేయకపోవటం వల్ల కూడా ఈ పరిస్థితి అనివార్యమైందన్నారు. -
జిల్లాకు రూ.100 కోట్ల కరెన్సీ
– కొత్త రూ. 500 నోట్లు - అన్ని బ్యాంకులకు పంపిణీ చేసే విధంగా కలెక్టర్ చర్యలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాకు కరెన్సీ దాదాపు రూ. 100 కోట్లు వచ్చింది. ఈ మొత్తం ఆంధ్రబ్యాంకు కరెన్సీ చస్ట్కు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ మొత్తం ఇంకా బ్యాంకులకు చేరలేదు. జిల్లాకు వచ్చిన కరెన్సీలో రూ.500 నోట్లు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏఏ నోట్లు ఎంత విలువ వచ్చిందనే వివరాలు బయటికి రాలేదు. అన్ని బ్యాంకులకు కరెన్సీ ఇవ్వాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొత్త రూ. 500 నోట్లు మార్కెట్లోకి రానున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకులకు కరెన్సీని పంపిణీ చేయనున్నారు. అంతటా నో క్యాష్ సోమవారం అన్ని వర్గాల ప్రజలను నగదు కొరత వేధించింది. జిల్లాలో 403 ఏటీఎంలు ఉండగా నగదు కొరత వల్ల దాదాపు అన్ని ఏటీఎంలు మూత పడ్డాయి. ఎస్బీఐ బ్రాంచిల్లో నో క్యాష్, నో విత్‌డ్రాయల్ అనే బోర్డులు పెట్టారు. కలెక్టరేట్లోని ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచికి ఉద్యోగులు విత్ డ్రా కోసం భారీగా వెళ్లారు. అయితే టు డే నో క్యాష్, నో విత్ డ్రా అనే బోర్డును కనిపించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. -
రూపే కార్డుతో రూ.2లక్షల ప్రమాదబీమా
నిడదవోలు : రూపే కార్డులతో 40 రోజుల్లో కనీసం ఒక్కసారైనా సొమ్ము లావాదేవీలు జరిపితే ఖాతాదారులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని ఆంధ్రాబ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కారే భాస్కరరావు చెప్పారు. పట్టణంలో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్ నవశక్తి శాఖ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 118 ఆంధ్రాబ్యాంక్ శాఖల ద్వారా కోటి రూపే కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం జిల్లాలో తమ బ్యాంక్ ద్వారా రూ. 7,620 కోట్ల టర్నోవర్ జరుగుతోందని చెప్పారు. త్వరలో గణపరం మండలం పిప్పరలో ఆంధ్రాబ్యాంక్ నవశక్తి శాఖను ప్రారంభించనున్నామన్నారు. రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు 2 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో త్వరలో బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ సీనియర్ మేనేజర్ పి.దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల మార్పిడి కోరుతూ బ్యాంకు ముందు ధర్నా
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా మెహదీపట్నం ఆంధ్రాబ్యాంకు ఎదుట గురువారం ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకు సిబ్బంది తాళాలు తెరవకపోవడంతో క్యూలో నిల్చున్న వారికి కోపం కట్టలు తెంచుకుంది. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. గత 15 రోజులుగా డబ్బుల్లేక నానా అవస్థలు పడుతుంటే బ్యాంకు ఇంకా తెరవకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఖాతాదారులతో చర్చిస్తున్నారు. -
భవిష్యత్ నగదు రహితమే
కలెక్టర్ లక్ష్మీనరసింహం శ్రీకాకుళం అర్బన్: భవిష్యత్ నగదు రహిత కార్యకలాపాలదేనని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నా రు. ఆంధ్రా బ్యాంకు జోనల్ కార్యాలయంలో మం గళవారం ఆంధ్రా బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడుతూ బిజినెస్ కరస్పాం డెంట్ల పాత్ర ప్రస్తుతం క్రియాశీలకమన్నారు. ప్రజ ల్లో నగదు రహిత కార్యకలాపాలపై అవగాహన కలిగించేందుకు, వారి కార్యకలాపాల్లో తోడ్పాటు ను అందించేందుకు ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు. బ్యాంకులు కొత్తగా నియామకాలు చేపట్టనవసరం లేదనే విధంగా సేవలు అందించాలని ఆయన కోరారు. అధికంగా వ్యాపారం చేసే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర బ్యాంకర్ల స మావేశంలో ప్రతిపాదిస్తామని అన్నారు. నగదు ర హిత సమాజం దిశగా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సామాజిక పింఛన్లు, ఉపాధి హామీ వేతనాలు ఆధార్, బయోమెట్రిక్ అ నుసంధానించిన జన్‌ధన్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. జిల్లాలో రూ. 33 కోట్లను పింఛన్లుగా ప్రతి నెలా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలోని దాదాపు 400 మీసేవ కేంద్రాలను, 2099 చౌకధరల దుకాణాల డీలర్లను బిజి నెస్ కరస్పాండెంట్లుగా చేసేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత స్థితికి శ్రీరారం చుట్టామని చెప్పారు. రైతు బజార్లలో స్వైప్ మెషీన్లను, మినీ ఏటీఎంలను ఏర్పాటు చేశామని తెలిపారు. మినీ ఏటీఎంల నుంచి రూ. 500 వరకు 50, 100 రూపాయల నోట్లను పొందవచ్చని చెప్పారు. సీతంపేటలో సోమవారం ప్రారంభించామని, ప్రతి సోమవారం నిర్వహిం చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్యుత్ బిల్లులను బ్యాంక్ ఆఫ్ బరోడాతో అనుసంధానం చేసి చెల్లింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్ స్టాండ్లలోను మైక్రో ఏటీఎంలను ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పారు. మద్యం విక్రయాల వద్ద స్వైప్ మెషీన్ ఏర్పాటు చేయాలనే యోచన ఉందని చెప్పారు. తద్వారా ఎంఆర్పీ ధరలకు విక్రరుుస్తారని, బెల్టు షాపుల నివారణకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లో ప్రతి వ్యవహారం బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుందని అన్నారు నగదు రహిత గ్రామాలు జిల్లాలోని 38 మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నగదు రహిత గ్రామంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. బ్యాంకు శాఖలు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించి నగదు రహిత కార్యాకలాపాల దిశగా తీసుకువెళ్లడం దీని ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. జనవరి 1 నుంచి సంపూర్ణ నగదు రహిత గ్రామాలుగా ఇవి ఆవిర్భవించాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ బీఆర్కే రావు, సహాయ జనరల్ మేనేజర్ కె.రాజేంద్రకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ పి. వెంకటేశ్వరశాస్త్రి, ఆర్థిక సలహాదారులు ఆర్ఆర్ఎం పట్నాయక్, కె. గిరిజా శంకర్, బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రాబ్యాంకులో కస్టమర్లకు టోకెన్లు
-
కాళేశ్వరానికి బ్యాంకు రుణం
సుమారు రూ.7వేల కోట్లు ఇచ్చేందుకు ఆంధ్రాబ్యాంక్ సుముఖత సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఏర్పాటైన కార్పొరేషన్‌కు సుమారు రూ.6వేల నుంచి రూ.7వేల కోట్ల రుణాలిచ్చేందుకు ఆంధ్రాబ్యాంకు సుముఖత తెలిపింది. పూర్తి నిధులను ఒక్కసారిగా ఇస్తుం దా, లేక వారుుదాల పధ్దతినా అనేది స్పష్టత రాలేదు. మరో భేటీలో దీనిపై తేల్చాలని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణరుుంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌తో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80వేల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం 2022 లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఏటా రూ.8వేల నుంచి రూ.10వేల కోట్ల నిధులు అవసరం. ఇలా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుకు రూ.6వేల కోట్లు కేటారుుంచారు. ఇందుకుగాను ప్రపంచబ్యాంకు, జపాన్‌బ్యాంకు, నాబార్డు, ఎల్ఐసీ సహా ఇతరత్రా మార్గాల ద్వారా నిధులను సమకూర్చుకోవాల్సిన దృష్ట్యా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు ప్రణాళిక రూపకల్పన, పనుల మదింపు, నిధుల విడుదల,అమలు, నిర్వహణ,పర్యవేక్షణ, మొత్తం బాధ్యతలను ఈ కార్పొరేషన్‌కే ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ప్రాజెక్టు సమగ్ర రూపం కొలిక్కి రావడంతో నిధుల సమీకరణకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగానే శుక్రవారం నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, ప్రాజెక్టు సీఈ హరిరామ్‌లు ఆంధ్రాబ్యాంకు ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు అధికారులు రూ.8 వేల కోట్ల రుణాన్ని కోరగా.. రూ.7వేల కోట్ల వరకు వారుుదా పద్ధతుల్లో ఇస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. తమకు తక్కువ వడ్డీరేట్లతో ఒకే విడతలో ఇస్తే ప్రయోజనం ఉంటుందని శాఖ అధికారులు చెప్పడంతో, దీనిపై త్వర లో స్పష్టత ఇస్తామని బ్యాంకు ప్రతినిధులు చెప్పినట్లు తెలిసింది. కాగా పాలమూరు నిధులపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. -
ఆంధ్రాబ్యాంకు అద్దాలు ధ్వంసం..
మేడికొండూరు: నోట్ల మార్పిడి కోసం దేశవ్యాప్తంగా జనాలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. కొన్నిచోట్ల భారీగా ఉన్న క్యూలైన్లలో నానాపాట్లు పడుతూ కౌంటర్ వద్దకు చేరేలోపు కౌంటర్లలో నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు ఆంధ్రాబ్యాంకులో నోట్ల మార్పిడి కోసం క్యూలో నిల్చున్న ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చాలా సమయం లైన్లో నుల్చున్న ఖాతాదారుడు తీరా కౌంటర్ వద్దకు చేరేసరికి బ్యాంకు క్యాషియర్ డబ్బులు అయిపోయాయని సమాధానం చెప్పాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఆ ఖాతాదారుడు బ్యాంకు అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటనతో బ్యాంకు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఖాతాదారుడికి సర్దిచెప్పారు. -
రూ.2,500..120 కి.మీ.
జమ్మికుంట: ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకునేందుకు ఈ వ్యక్తి 120 కి.మీ. తిరగాల్సి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల గ్రామానికి చెందిన జక్కుల కుమార్ తన గొలుసు మణప్పురం ఫైనాన్సలో తాకట్టు పెట్టి రూ.40 వేలు తీసుకున్నాడు. గురువారం రూ.1,975 వడ్డీ చెల్లించాలని, లేకుంటే గొలుసు వేలం వేస్తామంటూ బుధవారం ఆయనకు ఫోన్ వచ్చింది. చేతిలో రద్దైన నోట్లు ఉండడంతో వాటిని టేకుమట్ల ఆంధ్రాబ్యాంక్‌లో జమ చేశాడు. తిరిగి కొత్త నోట్లు తీసుకుందామంటే బ్యాంకులో లేవు. ఏటీఎంకు తాళం వేశారు. అక్కడ్నుంచి భూపాలపల్లికి వెళ్తే అక్కడా నిరాశే ఎదురైంది. దీంతో అక్కడ్నుంచి జమ్మికుంట చేరుకుని ఎస్బీఐ ఏటీఎం నుంచి రూ.2,500 డ్రా చేసుకున్నాడు. మొత్తమ్మీద 120 కి.మీ. తిరిగితేగానీ 2,500 చేతికి రాలేకపో యాయంటూ కుమార్ ఆవేదన చెందాడు. -
అవినీతిని నిర్మూలనకు నడుం కట్టాలి
గూడూరు : సమాజంలో అవినీతి నిర్మూలనకు యువత నడుం కట్టాలని ఆంధ్రా బ్యాంక్ డిప్యూటీ జీఎం కేఎస్పీవీ రమణమూర్తి అన్నారు. స్థానిక ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి సహకరంతో యాంటీ కరప్షన్ అవైర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అవినీతితోనే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు యాంటీ కరప్షన్‌పై వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆంధ్రాబ్యాంక్ చీఫ్ మేనేజర్ కేవీఎస్ఎన్ మూర్తి, కళాశాల డైరెక్టర్ కృష్ణకుమార్, ప్రిన్సిపల్ ఎస్వీ రమణ, శిక్షణ విభాగాధిపతి ప్రభుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. కృషి చేయాలి కోట : సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని అంతమొందిచడానికి ప్రతిఒక్కరు కృషిచేయాల్సిన అవసరముందని ఆంధ్రాబ్యాంక్ డీజీఎం రమణమూర్తి అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలను విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. కళాశాల మరియు ఆంధ్రాబ్యాంక్శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అవినీతికి అరికట్టడానికి విద్యార్థులు తమవంతుగా కృషి చేయాలన్నారు. దేశ ఔన్నత్యాన్ని కాపాడాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటును, బీఎంపీఎల్‌ఆర్ (బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు)ను అయిదు బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది. దీంతో బేస్ రేటు 9.70 శాతానికి, బీఎంపీఎల్‌ఆర్ 13.95 శాతానికి తగ్గినట్లు వివరించింది. ఏడాది వ్యవధి రుణాలపై ఎంసీఎల్ఆర్ను పది బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 9.55% నుంచి 9.4%కి తగ్గింది. కొత్త రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది. -
ఆర్థిక స్వావలంబనే ఆంధ్రాబ్యాంక్ లక్ష్యం
విజయవాడ (వన్‌టౌన్): భారతీయుల ఆర్థిక స్వావలంబన కోసమే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాలకు అనుగణంగా తమ బ్యాంకు పనిచేస్తోందని ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సురేష్ ఎన్.పటేల్ అన్నారు. నగరానికి వచ్చిన పటేల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని బ్యాంక్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జోనల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రప్రథమంగా కృష్ణాజిల్లాలో నగదు రహిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 400 రేషన్ దుకాణాలు ఆంధ్రా బ్యాంక్ సహకారంతో అమలవుతున్నాయన్నారు. వాటిని తాను పరిశీలించానని చెప్పారు. బ్యాంక్ మిత్రా ల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించి జోనల్ కార్యాలయంలో వారితో ముచ్చటించారు. ఫైనాన్షియల్ విభాగం జీఎం వినయ్‌వర్మ, విజయవాడ సర్కిల్ జీఎం రంగనా«ద్, జోనల్ మేనేజర్ కృష్ణారావు, సలహాదారు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.1.5 లక్షలు పక్కకి పెట్టి మరిచాడు
రాంగోపాల్‌పేట: బ్యాంక్‌లో ఓ వినియోగదారుడికి చెందిన రూ.1.5 లక్షలు మాయమయ్యాయి. గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం... బోయిగూడకు చెందిన భాస్కర్ ఫ్యాబ్రిక్ పనులు చేస్తుంటాడు. సోమవారం ఉదయం 11.30కి సెయింట్ మేరీస్‌రోడ్‌లోని ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చిన భాస్కర్ తన వ్యాపారాల కోసం రూ.8.5 లక్షలు నగదు డ్రా చేశాడు. ఇతరులకు ఇచ్చేందుకు రూ.7 లక్షలు ఒక పేపర్లో చుట్టుకుని రూ. 1.5 లక్షలు పక్కన పెట్టాడు. పేపర్లో చుట్టుకున్న రూ.7 లక్షలు తీసుకుని వెళ్లిపోయిన ఆయన మిగతా లక్షన్నర అక్కడే పెట్టి మరచిపోయాడు. కొద్దిదూరం వెళ్లాక బ్యాంక్‌లో మర్చిపోయిన డబ్బు గుర్తుకు వచ్చి..వెంటనే బ్యాంక్‌కు తిరిగి వచ్చి చూడగా అక్కడ కనిపించ లేదు. బ్యాంక్‌లో వాకబు చేసినా డబ్బు దొరకలేదు. దీంతో ఆయన గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
అర్హులకు బ్యాంకుల చేయూత
ఏలూరు (ఆర్ఆర్ పేట) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అర్హులకు బ్యాంకులు చేయూతనిస్తాయని ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం జేఎన్ఆర్ ప్రసాద్ చెప్పారు. శుక్రవారం స్థానిక వైఎంహెచ్ఏ హాలులో నిర్వహించిన జిల్లాలోని ప్రధాన బ్యాంకుల ఆర్థిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి రుణాలు అందచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆధార్ లేనివారికి ఆధార్ కార్డు జారీ చేస్తామని, బ్యాంక్ ఖాతా లేనివారికి ఎకౌంట్ తెరిచి లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా బ్యాంకుల అవగాహన మేళాను ఈ నెల 14న భీమవరంలో, 18న తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తామని, లబ్ధిదారులు ఈ మేళాలకు హాజరుకావచ్చన్నారు. కాగా ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి ఈ నెల 31 వరకూ అన్ని బ్యాంకుల్లో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు మునిసిపల్ కమిషనర్ ఎస్.హనుమంతరావు పాల్గొన్నారు. -
ఆంధ్రాబ్యాంకు రుణ మేళా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రాబ్యాంకు రానున్న పండగలను దృష్టిలో పెట్టుకుని గృహ, వాహన రుణాలను పోటీ వడ్డీ రేట్లకు ఇస్తోంది. విజయ్ దిశ పేరుతో గృహ రుణం, తనఖాపై రుణాలను పోటీ వడ్డీ రేట్లకు ఆఫర్ చేస్తోంది. అలాగే మెగా వెహికిల్ లోన్ కార్నివాల్లో భాగంగా వాహన రుణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. గృహ రుణం తీసుకున్న కస్టమర్ కారు రుణం సైతం తీసుకుంటే వడ్డీలో 0.25 శాతం తగ్గింపు ఇస్తారు. గృహ, వాహన రుణంపై ప్రాసెసింగ్ చార్జీలు రద్దు చేసినట్టు తెలిపింది. అక్టోబరు 31 దాకా ఈ రుణ మేళా కొనసాగుతుంది. -
ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
రాజమహేంద్రవరం క్రైం : ఆంధ్రాబ్యాంక్ విద్యుత్‌నగర్ బ్రాంచీలో చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దుండగుడు బ్యాంక్ వెనుక భాగంలోని గేటు నుంచి చొరబడి, షట్టర్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఏటీఎంను, మెయిన్ లాకర్ ను కూడా పగులగొట్టి చోరీకి యత్నించాడు. అవి ఫలించకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బుధవారం ఉదయం 8.30 కు బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఎంవీఎన్ మధుసూదనరావు బ్యాంక్ షట్టర్లు తెరిచి ఉండడాన్ని గమనించి, డీజీఎం భాస్కరరావుకు సమాచారమిచ్చారు. డీజీఎం ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి, క్రైం డీఎస్పీ త్రినాథరావు, తూర్పు మండలం డీఎస్పీ రమేష్‌బాబు, ప్రకాష్ నగర్ సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. బ్యాంక్‌లోని సీసీ ఫుటేజ్‌ను ఎస్పీ పరిశీలించారు. చీకటిగా ఉండడం వల్ల దుండగుడు స్పష్టంగా కనిపించలేదు. ప్రకాష్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుద్యోగ యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ
కామవరపుకోట : ఏలూరులోని ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిరుద్యోగ యువతీ,యువకులకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ జె.షణ్ముఖరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీలకు బ్యూటీషియన్, మెహందీ కోర్సుల్లో 30 రోజులు, మగ్గం వర్స్క్, గ్లిట్టరింగ్ వర్క్స్‌లో 21 రోజుల శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వయసు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలన్నారు. బ్యూటీషియన్, మెహందీలో శిక్షణ పొందేవారి విద్యార్హత పదోతరగతి ఉండాలని, ఇందులో ప్రవేశం వచ్చే నెల 3 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఉంటుందన్నారు. మగ్గం వర్క్‌లో శిక్షణ పొందే వారి విద్యార్హత 5వ తరగతి ఉండాలని ప్రవేÔ¶ గడువు వచ్చే నెల 3 నుంచి 26వ తేదీ వరకు ఉంటుందన్నారు. పురుషులకు బేసిక్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 21 రోజుల శిక్షణ, మొబైల్ ఫోన్ రిపేర్స్‌లో 30 రోజుల శిక్షణ ఇస్తారని విద్యార్హత పదో తరగతి ఉండాలన్నారు. బేసిక్ ఫొటోగ్రఫీకి నవంబర్ 7 నుంచి 29 వరకు, మొబైల్ ఫోన్ రిపేర్‌కు వచ్చే నెల 7 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఉంటుందన్నారు. వయసు 18 నుంచి 35 సంవత్సరాలుండాలన్నారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయాలు, ఒకసారి రానుపోను ఛార్జీలు పూర్తిగా ఉచితమని డైరెక్టర్ షణ్ముఖరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్కుల జాబితా రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోలతో ప్రవేశ సమయంలో ఏలూరులోని డోర్ నెం. 24ఎ–7–1, అమలోద్భవి ఇంగ్లిష్ మీడియం స్కూల్ దగ్గర, బమ్మెర పోతనవీధి, అశోక్‌నగర్‌లోని తమ సంస్థ చిరునామాలో లగేజీతో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 08812–253975 ఫోన్ నంబర్‌కు గానీ, 98660 94383 లేదా 94909 98882 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. -
గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా సేవలు
• ఏపీవైలో దేశంలోనే మొదటిస్థానం • ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజిత్‌కుమార్ మహబూబ్‌నగర్, సాక్షి: గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా దేశంలో ఆంధ్రాబ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజిత్‌కుమార్ రత్ చెప్పారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని రాజేంద్రనగర్ బ్రాంచిలో ‘ఈ-లాబీ’ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకు శాఖల్లో ఖాతాదారుల కోసం మరిన్ని టెక్నాలజీ ఆధారిత సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ-లాబీ కేంద్రంలో ఏటీఎం, క్యాష్ రీసైక్లర్ మిషన్, పాస్‌బుక్ ప్రింటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. క్యాష్ రీసైక్లర్ మిషన్ ద్వారా ఖాతాదారులు ఎప్పుడైనా డిపాజిట్ చేయొచ్చునన్నారు. ఆంధ్రాబ్యాంక్ రూ.3.12 లక్షల కోట్ల వ్యాపారం చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అటల్ పింఛన్ యోజన నమోదులో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచినట్లు చెప్పారాయన. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో మహబూబ్‌నగర్‌లో 5, నల్లగొండలో 4 నూతన బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జోనల్ మేనేజర్ లీలాధర్, ఏజీఎం ఎన్ఎస్ఎన్ రెడ్డి, చీఫ్ మేనేజర్లు పరంధాములు, శామ్యుల్,మాణిక్యరావు పాల్గొన్నారు. -
అమోల్ షిండే ఆల్‌రౌండ్ షో
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఆంధ్రాబ్యాంక్ ఆటగాడు అమోల్ షిండే (7/77, 81) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో ఎన్సకాన్స జట్టు పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజు 148/5 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన ఎన్సకాన్స తొలి ఇన్నింగ్సలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. మెహదీ హసన్ (65) రాణించాడు. అమోల్ షిండే ఏడు వికెట్లు తీశాడు. దీంతో ఆంధ్రాబ్యాంక్‌కు 9 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స ఆడిన ఆంధ్రాబ్యాంక్ 191 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒక దశలో ప్రత్యర్థి బౌలర్ ముదాసిర్ హుస్సేన్ (7/63) ధాటికి తడబడిన ఆంధ్రాబ్యాంక్‌ను షిండే (81) బ్యాటింగ్‌లోనూ రాణించి ఆదుకున్నాడు. దీంతో ఎన్సకాన్స ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎన్సకాన్స రెండో ఇన్నింగ్సలో ఆట నిలిచే సమాయానికి 5 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. కనిష్క్ నాయుడికి 3 వికెట్లు దక్కాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స: 110 (సారుు కీర్త్ 47; విశాల్ శర్మ 6/42, ఆకాశ్ భండారి 3/42), ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స: 220/2 (డాని డెరిక్ ప్రిన్స 84, కేఎస్కే చైతన్య 77). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స: 276/7 (మిలింద్ 97 బ్యాటింగ్, షాదాబ్ 57; శ్రీచరణ్ 4/107), ఆర్.దయానంద్‌తో మ్యాచ్. స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స: 143/9 డిక్లేర్డ్ (మాన్సింగ్ రమేశ్ 40, యతిన్ 30; సిరాజ్ 4/27), చార్మినార్ తొలి ఇన్నింగ్స: 117/4 (సారుు ప్రజ్ఞయ్ రెడ్డి 48). ఇన్కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స: 331/7 (వంశీవర్ధన్ రెడ్డి 91 బ్యాటింగ్, అక్షత్ రెడ్డి 64, హబీబ్ అహ్మద్ 45, హర్షవర్ధన్ నాయుడు 47; తేజ 3/22), జైహనుమాన్‌తో మ్యాచ్. -
రెండు నెలలకోసారి కాయిన్‌మేళా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఫైర్‌స్టేçÙన్ సెంటర్లో నిర్వహించిన కాయిన్ మేళాలో నగర ప్రజలకు రూ.12 లక్షల చిల్లర నాణేలు పంపిణీ చేశామని ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం టీవీఆర్ ప్రసాద్ తెలిపారు. ఇటీవల కాలంలో చిల్లర నాణేల కొరత అధికం కావడంతో ప్రజలకు నాణేల కొరత తీర్చడానికి తమ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ జె.మేఘనాథ్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒక సారి కాయిన్ మేళా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేళాలో రూ.2, రూ.5, రూ.10 నాణేలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ అధ్యక్షుడు బీహెచ్ రవివర్మ పాల్గొన్నారు. -
ఆంధ్రాబ్యాంకు నూతన డీజీఎంగా రాధాకిషన్‌రావు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రాబ్యాంక్ నూతన డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా రాధాకిషన్‌రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీజీఎంగా పనిచేసిన కె.ఉమామహేశ్వరరావుకు హైదరాబాద్‌లోని ఏపెక్స్ కళాశాలకు బదిలీ అయ్యింది. హైదరాబాద్‌లోని డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసిన రాధాకిషన్‌రావుకు శ్రీకాకుళం జోనల్ కార్యాలయం డీజీఎంగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని జీటీరోడ్‌లోని మెయిన్ బ్రాంచిలో మంగళవారం ఆ బ్రాంచి సిబ్బంది బదిలీపై వెళ్లిపోతున్న ఉమామహేశ్వరరావును ఘనంగా సన్మానించారు. తనకు అందించిన సహాయ సహాకారాలను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీజీఎంకు అందించాలని ఆయన కోరారు. నూతన డీజీఎం రాధాకిషన్‌రావు మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచి చీఫ్ మేనేజర్ ఐ.చంద్రశేఖర్, సిబ్బంది ఉమాకుమార్, కృష్ణబాబు, ప్రత్యూష, శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. -
లాభాల్లో ఆంధ్రాబ్యాంక్ ఢమాల్
ముంబై: నిరుత్సాహకర ఫలితాలతో ఆంధ్రాబ్యాంక్ ఢమాల్ అంది. ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రా బ్యాంక్ ఈ ఏడాది( 2016-17) తొలి త్రైమాసికంలో నికర లాభాలు దాదాపు 85 శాతం (84.64) క్షీణించాయి. గతేడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 203 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది కేవలం రూ. 31 కోట్లను మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం దాదాపు 10 శాతం జంప్‌చేసి రూ. 1269 కోట్లను తాకగా, మొత్తం ఆదాయం కూడా 7 శాతం పెరిగి రూ. 4855 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 56 శాతం ఎగసి రూ. 969 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.87 శాతం నుంచి 2.90 శాతానికి పెంచుకోగలిగింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 5.75 శాతం నుంచి 10.30 శాతానికి జంప్‌చేయగా, నికర ఎన్పీఏలు కూడా 2.99 శాతం నుంచి 6.21 శాతానికి పెరిగాయి. నిర్వహణ వ్యయాలు 16.6 శాతం అధికమై రూ. 753 కోట్లను తాకగా, మొత్తం డిపాజిట్లు 16 శాతంపైగా ఎగసి రూ.1,78,268 కోట్లకు చేరాయి. ఇక రుణ విడుదల (అడ్వాన్సెస్) కూడా 9 శాతం పెరిగి రూ. 1,37,228 కోట్లుగా నమోదయ్యాయి. బిజినెస్ గ్రోత్ 13-14 ఉంటుందని ఆశిస్తున్నామని ఆంధ్రబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సురేష్ ఎన్ పటేల్ చెప్పారు. ఈ త్రైమాసికంలో రిటైల్ క్రెడిట్ పోర్ట్‌ఫోలియో విస్తరణ ద్వారా బ్యాంకు రెవెన్యూ, మార్జిన్స్ 26.5 శాతం పెరిగిందన్నారు. బ్యాంక్ పై స్లిప్ పేజేస్ భారం గత క్వార్టర్లోని రూ. 2500కోట్లతో పోలిస్తే రూ.3500కోట్లకు చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల ప్రవేశ పెట్టబడిన సస్టైనబుల్ స్ట్రక్టరింగ్ ఆఫ్ స్ట్రెస్స్డ్ ఎస్సెట్స్ పథకం నుంచి తమకు ఎలాంటి నిర్దేశాలు అందలేదని ఒక ప్రశ్నకు సమాధానం పటేల్ చెప్పారు. -
ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నం
ముసుగులతో వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు మూడు గంటల పాటు బ్యాంకులోనే.. భద్రంగానే నగదు, రూ.4కోట్ల విలువైన బంగారం కురవిలో సంచలనం సృష్టించిన ఘటన కురవి : మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో ఆదివా రం అర్ధరాత్రి కొందరు దుండుగులు దోపిడీకి యత్నిం చిన ఘటన సంచలనం సృష్టించింది. కురవి ఎస్సై జె.రామకృష్ణ, బ్యాంకు మేనేజర్ అజిజ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కురవిలో ది ఆంధ్రాబ్యాంకు కర్షక సహకార సేవా సంఘం భవన సముదాయంలో ఆంధ్రాబ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలి యని వ్యక్తులు ముసుగులు ధరించి చేతిలో రాడ్లు, టార్చి లైట్లతో వచ్చిఆంధ్రాబ్యాంకు వెనుక భాగంలో కర్షక సేవాసహకార సంఘం తలుపులను పగులగొట్టారు. అందులో నుంచి లోపలకు వెళ్లిన వారు గదిలోని బీరువాలను పగులగొట్టేందుకు యత్నించారు. అయితే, అది బ్యాంకు కాదని గుర్తించిన వారు ఆంధ్రాబ్యాంకు వెనుక భాగంలో ఉన్న తలుపు వద్దకు చేరుకుని గునపంతో పగులగొట్టారు. తలుపు వెనుక సిమెంట్ ఇటుకల గోడకు రంధ్రం చేసి ఆగంతకుల్లో ఒకరు బ్యాంకులోకి వెళ్లాడు. ఆ తర్వాత గదిలోని సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకుండా ఐదింటిని ధ్వంసం చేయడంతో పాటు మరో కెమెరాను పైకి లేపాడు. అదేగదిలోని హారన్ మోగకుండా తీగలు తెంచేశారు. అక్కడి నుంచి లాకర్లు ఉన్న గదిలోకి వెళ్లిన ఆగంతకుడు టార్చ్‌లైట్ వేసుకుని మరీ లాకర్లు తెరిచేందుకు యత్నించాడు. అలా లోపలకు ప్రవేశించినప్పటి నుంచి మూడు గంటల పాటు లోపలే ఉండగా దోపిడీ సాధ్యం కాకపోవడంతో సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. కాపలాగా నైట్ వాచ్మెన్లు సహకార సంఘంలో గంగరబోయిన సత్యం, ఆంధ్రాబ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎంలో దయాకర్ అనే వ్యక్తులు రాత్రి పూట నైట్ వాచ్మన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సొసైటీలోకి ప్రవేశించి తలుపు పగులకొట్టిన విషయాన్ని పక్క గదిలో నిద్రించిన నైట్ వాచ్మెన్ గ్రహించలేదు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి బయటకు వస్తుండగా దోపిడీ యత్నం జరిగిన విషయాన్ని గుర్తించి సొసైటీ అధికారులు, బ్యాంకు మేనేజర్, క్యాషియర్ రంజిత్‌కు తెలిపారు. దీంతో వారు పోలీసులు తెలపగా కురవి సీఐ శ్రీనివాస్‌నాయక్, ఎస్సై రామకృష్ణ చేరుకున్నారు. అలాగే, మానుకోట సీఐ నందిరాంనాయక్, క్లూస్‌టీం ఎస్సై రఘు ఆధ్వర్యంలోని బృందం వచ్చి ఫింగర్ప్రింట్లు సేకరించారు. ఆంధ్రాబ్యాంకు డీజీఎం శివప్రసాద్, ఏజీఎం సూర్యనారాయణ, సెక్యూరిటీ అధికారి గిరిష్ప్రసాద్కుమార్ వచ్చి వివరాలను తెలుసుకున్నారు. బ్యాంకులో సుమారు రూ.4కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని, అందులో ఏదీ దొంగతనం జరగలేదని ఆంధ్రాబ్యాంకు మేనేజర్ అబ్దుల్అజీజ్, పోలీసులు తెలిపారు. ఒక కన్ను మాత్రమే కనిపించేలా.. ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నించిన సంఘటన కురవిలో సంచలనం సృష్టించింది. సీసీ కెమెరాల ఫుటేజీలో ముసుగు ధరించిన వ్యక్తి కని పించాడు. తల నుంచి కాళ్ల వరకు తెల్లని దుస్తువులు ధరించి ఉండగా, గోడ పగులగొట్టేందుకు పెద్ద రాడ్ ఆయన చేతిలో ఉంది. అయితే, ఒకరిని బయట ఉంచి మరో ఇద్దరు లేదా ముగ్గురు లోనకు వెళ్లి దోపిడీకి యత్నించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక కన్ను మాత్రమే కనిపించేలా ముసుగు ధరించడం, సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకుండా ధ్వంసం చేయడాన్ని గమనిస్తే ఆరితేరిన దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కురవి పోలీసులు తెలిపారు. -
బ్యాంకు అధికారులమంటూ టోకరా
ఏటీఎం కార్డు నంబర్ తెలుసుకొని రూ.5 వేలు డ్రా సంగెం : ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని గుర్తుతెలియని వ్యక్తి కోరగా అతడిని నమ్మి చెప్పడంతో రూ.5 వేలు అతడి ఖాతా నుంచి డ్రా అయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లి శివారు సోమ్లాతండాకు చెందిన బానోత్ రాజేందర్‌కు ఈ నెల 15న సంగెం ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ 7808602755 నంబర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని కోరారు. అడిగినట్లుగా ఆ నంబర్లు చెప్పిన రాజేం దర్ సెల్‌ఫోన్‌కు తన ఖాతా నుంచి రూ.5 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు వచ్చి తనఖాతా నుంచి రూ.5 వేలు డ్రా అయిన విషయం బ్యాంకు అధికారులకు చెప్పడంతో తాము చేసేది ఏమి లేదని చేతులెత్తేశారు. దీంతో నెత్తినోరు బాదుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
హడలెత్తించిన మోహిత్ సోని
హైదరాబాద్: ఎంపీ కోల్ట్స్ బౌలర్ మోహిత్ సోని (7/15) ధాటికి ఆంధ్రాబ్యాంక్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో సోమవారం మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రాబ్యాంక్ 139 పరుగులకే కుప్పకూలింది. కిరణ్ కుమార్ (44 నాటౌట్) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఎంపీ కోల్ట్స్ ఆట నిలిచే సమయానికి 29 ఓవర్లలో 2 వికెట్లకు 83 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (41 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎన్స్‌కాన్స్: 216 (కొల్లా సుమంత్ 101, తాహా షేక్ 37; సాకేత్ సాయిరామ్ 4/71, కార్తీకేయ 3/44). జైహనుమాన్: 71/3 (వినీత్ 34). స్పోర్టింగ్ ఎలెవన్: 412/7 (మాన్సింగ్ రమేశ్ 154, యతిన్ రెడ్డి 87, చైతన్యకృష్ణ 57;తనయ్ త్యాగరాజన్ 3/155), కేంబ్రిడ్జ్‌తో మ్యాచ్. ఎస్బీహెచ్: 324/3 (కేఎస్కే చైతన్య 141 బ్యాటింగ్, అనూప్ పాయ్ 102 బ్యాటింగ్), ఎవర్గ్రీన్తో మ్యాచ్. ఎస్సీ రైల్వే: 195 (ఎలాజెర్ 59; రాజమని ప్రసాద్ 3/38), ఈఎంసీసీ: 8/0. జెమినీ ఫ్రెండ్స్: 184/6 (సయ్యద్ అలీ హైదర్ 57, రాధాకృష్ణ 31), గుజరాతీ సీసీతో మ్యాచ్. గౌడ్స్ ఎలెవన్: 201/7 (రేవంత్ సాయి 72, సంకీర్త్ 33; కోటేశ్వర్ రావు 3/28), ఏఓసీతో మ్యాచ్. ఆర్.దయానంద్: 256/7 (లోహిత్ 97, వంశీరెడ్డి 49 బ్యాటింగ్; శుభం శర్మ 5/77), చార్మినార్ సీసీతో మ్యాచ్. -
ముగిసిన ఆంధ్రా బ్యాంక్ బాండ్స్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 1,000 కోట్ల సమీకరణ కోసం చేపట్టిన బాండ్స్ ఇష్యూ ముగిసినట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది. జూన్ 22న ప్రారంభమైన ఇష్యూ 27న ముగిసిందని, పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయ్యిందని వెల్లడించింది. పదేళ్ల కాల వ్యవధితో అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డెట్ బాండ్లు జారీ చేసింది. వీటికి 8.65 శాతం వడ్డీ రేటు ఉంటుంది. -
రూ. 1,000 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు సుమారు రూ. 1,000 కోట్ల నిధుల సమీకరణ కోసం పదేళ్ల కాల వ్యవధితో అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డెట్ బాండ్లు జారీ చేయనుంది. వీటికి 8.65 శాతం వడ్డీ రేటు ఉంటుంది. జూన్ 22న ప్రారంభమయ్యే ఇష్యూ 27న ముగుస్తుంది. -
దొంగలు దొరికారు
♦ ఆంధ్రా బ్యాంక్ లూటీ కి విఫలయత్నం ♦ ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలింపు కుత్బుల్లాపూర్: ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నిం చిన ఇద్దరు పాత నేరస్థులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాం డ్కు తరలించారు. శనివారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ సాయి శేఖర్, ఏసీపీ అశోక్ కుమార్, సీఐ డీవీ రంగారెడ్డిలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తుడుం స్వామి (25) అదే జిల్లాకు చెందిన దోమకొండ మం డలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన సడుగు నవీన్ (21)లు కుత్బుల్లాపూర్ సర్కిల్ వెన్నెలగడ్డ సమీపంతో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరు కూలీ పనిచేస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్నారు. గతంలో ఓ హత్య, చెయిన్ స్నాచింగ్ చేశారు. శుక్రవారం తెల్లవారుజాము 4.30 సమయం లో వెన్నెలగడ్డ సమీపంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. తరువాత ఐదు కంప్యూటర్లను మూట కట్టుకుని వెళ్తూ స్థానికుల కంట పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ థామస్, కానిస్టేబుల్ విఘ్నేశ్వరుడు, హోంగార్డు కృపానందరెడ్డిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటాడి తుడుం స్వామిని పట్టుకున్నారు. అతని సమాచారం మేరకు నవీన్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన థామస్, విఘ్నేశ్వరుడు, కృపానందరెడ్డిలను డీసీపీ సాయిశేఖర్ అభినందించి రివార్డు ప్రకటించారు. -
ఆంధ్రాబ్యాంకు దొంగల అరెస్ట్
హైదరాబాద్: జీడిమెట్ల ఆంధ్రాబ్యాంకులో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఆంధ్రాబ్యాంకులో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. బ్యాంకుకు సమీపంలోనే నివాసముంటున్న తమసయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ బ్యాంకులో లైటు వెలుగుతుండటం గమనించాడు. బ్యాంకు దగ్గరికి వెళ్లి చూడగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. బయటి వ్యక్తులు తమను గమనించారని తెలుసుకున్న దొంగలు పరారయ్యారు. ఇందులో ఓ వ్యక్తిని పోలీసుల సహాయంతో ఆర్టీసీ డ్రైవర్ తమసయ్య పట్టుకున్నారు. తర్వాత పరారైన వ్యక్తిని పట్టుబడిన వ్యక్తి సహాయంతో అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను నిజామాబాద్ జిల్లాకు చెందిన తుడుం స్వామి(25), సడుగు నవీన్(21)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రా బ్యాంకులో చోరీకి విఫలయత్నం
హైదరాబాద్ : కుత్భుల్లాపూర్ - పేట్ బషీరాబాద్ పరిధిలో సుచిత్రా సమీపంలోని ఆంధ్రా బ్యాంకు (జీడిమెట్ల బ్రాంచ్)లో శుక్రవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. తాళాలు పగలగొట్టి బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి... హారన్ మోగకుండా చేశారు. అలాగు బ్యాంకులోని పలు కంప్యూటర్ల వైర్లను కూడా కత్తిరించారు. దొంగలు బ్యాంకులో లాకర్ తెరిచేందుకు ప్రయత్నించారు. ఇంతలో బ్యాంకులో దొంగలు పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని పసిగట్టిన దొంగలు అక్కడి నుంచి పరారైయ్యారు. పోలీసులు వెంబడించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో దొంగ పరారయ్యాడు.నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘గుండె’ను పిండిన దగా!
- కొడుకు గుండె పరీక్షకు దాచుకున్న డబ్బు - ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మాయం గట్టు : ఏటీఎం కార్డు రెన్యువల్ అంటూ ఓ ఫోన్ కాల్‌కు స్పందించిన పాపానికి కొడుకు గుండె ఆపరేషన్ కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. గట్టు మండలం చింతలకుంటకు చెందిన వీరన్నకు మాచర్ల ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉంది. వీరన్న పెద్ద కుమారుడు సంతోష్(9) గుండెలో రంధ్రం పడింది. వైద్యానికి రూ.30 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అతను డబ్బు పోగు చేసి రూ.15,200 ఖాతాలో వేశాడు. హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఎవరైనా దోచుకునే అవకాశం ఉంటుందని భావించి ముందు జాగ్రత్తగా ఖాతాలో వేసి ఏటీఏం కార్డును తీసుకున్నాడు. ఇదే క్రమం లో శుక్రవారం ఉదయం 99340 41804 నంబర్ నుంచి వీరన్న సెల్‌కు కాల్ వచ్చింది. ఆంధ్రాబ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్లు చెప్పాలని కోరడంతో వాటిని సదరు వ్యక్తికి తెలియజేశాడు. కొంతసేపటి తర్వాత అతని సెల్‌కు డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో బిక్కమొహం వేయాల్సి వచ్చింది. వెంటనే మాచర్లలోని ఆంధ్రాబ్యాంక్ అధికారులకు విషయం చెప్పినా ఏమి చేయలేమని చేతులేత్తేసినట్లు బాధితుడు తెలిపాడు. జరిగిన మోసంపై గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
రూ. 2,700 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,700 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. అంతర్గత క్యాపిటల్ అడెక్వసీ మదింపు ప్రక్రియ (ఐక్యాప్) ఆధారంగా వేసిన అంచనాలను బోర్డు సమీక్షించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదనపు మూలధన అవసరాల కోసం మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ, టైర్ 1, టైర్ టూ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించనున్నట్లు ఆంధ్రాబ్యాంకు వివరించింది. -
ఆంధ్రా బ్యాంకు నుంచి త్వరలో భారత్ బిల్ పేమెంట్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రకాల సేవలకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఉపయోగపడేలా త్వరలో భారత్ బిల్ పేమెంట్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ఆంధ్రా బ్యాంక్ ఎండీ సురేశ్ ఎన్ పటేల్ వెల్లడించారు. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే అనుమతులు ఇచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ కల్లా ఈ సర్వీస్ అందుబాటులోకి రాగలదని ఆయన వివరించారు. అలాగే ఖాతాదారులు తమ మొబైల్స్ ద్వారా నగదు బదిలీ లావాదేవీలు జరిపేలా యూజర్ పేమెంట్ ఇంటర్ఫేస్ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు పటేల్ తెలిపారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును కూడా కలిసిన పటేల్.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. అమరావతిలో వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు రుణాలిచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. -
ఆ శాసనాలు వెనక్కి రప్పిస్తాం
సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి పుస్తకావిష్కరణ సభలో సీఎం సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి దేశ విదేశాలకు తరలిపోయిన శిలాశాసనాలను వెనక్కి రప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి చెందిన శిలాశాసనాలు, కళాఖండాలు లండన్, చెన్నై, హైదరాబాద్ మ్యూజియాల్లో ఉన్నాయని, వాటిని తెప్పించి అమరావతిలో మ్యూజియం నిర్మించి అక్కడ వాటిని ఉంచుతామని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని శేషసాయి కల్యాణమండపంలో సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘అమరావతి ప్రభువు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు’ పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జపాన్‌లో తాను పర్యటించినపుడు అమరావతి నుంచే బౌద్ధం తమ దేశానికి వచ్చిందని జపనీయులు చెప్పారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత కొత్త రాజధానికి పలు పేర్లు పరిశీలించామని, అమరావతి అనే పేరు పెట్టాలని ఈనాడు అధినేత రామోజీరావు సూచించారని వెల్లడించారు. అమరావతిపై పొత్తూరి వెంకటేశ్వరరావు సహా అనేకమంది సూచనలు చేశారన్నారు. పుస్తక రచయిత పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వెంకట్రాదినాయుడిపై దుష్ర్పచారం జరిగిందని, తాను పుస్తకం రాసేటప్పుడు అనేక చారిత్రక ఆధారాలను పరిశీలించి, ఎన్నో అధ్యయనాలు చేశానని తెలిపారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా డ్వాక్రా మహిళలు స్వయం సహాయక సంఘాలకు చెందిన 27 వేల మందిని బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా నియమించుకునేందుకు ఆంధ్రాబ్యాంకు ముందుకొచ్చినట్లు సీఎంవో మీడియా విభాగం తెలిపింది. శుక్రవారం సీఎంతో జరిగిన సమావేశంలో ఆంధ్రాబ్యాంకు ప్రతినిధులు ఈ మేరకు వారు అంగీకరించినట్లు పేర్కొంది. -
ఆంధ్రా బ్యాంక్‌కు మొండిబకాయిల సెగ
ప్రొవిజనింగ్‌తో 72% క్షీణించిన లాభాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు మొండిబకాయిలు భారీగా పెరిగాయి. స్థూల మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) 5.31 శాతం నుంచి 8.39 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 2.93 % నుంచి 4.61 శాతానికి పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 3.89%. మొండిబకాయిలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్ భారీగా పెరగడంతో మార్చి త్రైమాసికంలో నికర లాభం 72 శాతం క్షీణించింది. బ్యాంకు శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 185 కోట్లుగా ఉన్న లాభం ఈసారి రూ. 52 కోట్లకు తగ్గింది. ఆదాయం 9 % వృద్ధితో రూ. 4,699 కోట్ల నుంచి రూ. 5,124 కోట్లకు పెరిగింది. ప్రొవిజనింగ్ రూ. 633 కోట్ల నుంచి రూ. 1,023 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ మార్జిన్(నిమ్) 3.48%నుంచి తగ్గి 3.41%కి పరిమితమైంది. బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000కోట్ల లాభాలు సాధించాలని భావించినప్పటికీ.. అందులో సగానికే పరిమితమైంది. పూర్తి సంవత్సరానికి గాను.. కంపెనీ లాభాలు రూ. 638 కోట్ల నుంచి రూ. 540 కోట్లకు తగ్గాయి. ఆదాయం రూ. 17,868 కోట్ల నుంచి రూ. 19,199 కోట్లకు పెరిగింది. నిమ్ 3.18 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో బాండ్ల ద్వారా రూ. 800 కోట్లు బ్యాంకు సమీకరించింది. రూ. 136 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ షేర్లను ఎల్ఐసీకి కేటాయించింది. రూ. 378 కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చినందుకు ప్రభుత్వానికి 49.46 కోట్ల షేర్లను కేటాయించింది. దీంతో బ్యాంకులో ప్రభుత్వ వాటా 61.02%నుంచి 61.26 %కి పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి షేరు ఒక్కింటిపై రూ. 0.50 డివిడెండు ప్రకటించింది. -
హోర్డింగ్ కూలిపడి వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో శుక్రవారం ఉదయం భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. తాడేపల్లి బైపాస్‌లో ఆంధ్రాబ్యాంకు సమీపంలో హైవేపై హోర్డింగ్ కూలి ఓ వ్యక్తిపై పడిపోయింది. దీంతో అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఉత్తమ సంస్థగా ‘ఆబర్డ్’
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ 2014-15వ సంవత్సరంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి ఉత్తమ సంస్థగా గుర్తింపు పొందిందని సంస్థ డెరైక్టర్ బగాన శ్రీనివాసరావు చెప్పారు. శ్రీకాకుళంలోని ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ గుర్తింపు అయిన ‘ఏఏ’ గ్రేడ్ రేటింగ్ పొందినట్టు చెప్పారు. ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ(ఆబర్డ్)ను శ్రీకాకుళంలో 2002లో ప్రారంభించినట్టు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 333 నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి జిల్లాలోని 8,325 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. వీరిలో 5,390 మంది యువతీ, యువకులు వారు పొందిన శిక్షణ ద్వారా జీవితంలో స్థిరపడి, అధిక ఆదాయం పొందుతున్నట్టు తెలిపారు. 2015-16 సంవత్సరంలో 32 శిక్షణ కార్యక్రమాలలో 816 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. గ్రామీణ యువకులకు సెల్‌ఫోన్ సర్వీసింగ్, కారు డ్రైవింగ్, కంప్యూటర్ కోర్సులు, మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్, జ్యూట్ బ్యాగుల తయారీ, సాఫ్ట్‌టాయ్స్ తదితర వాటిలో శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. రైతులకు పశుపోషణ, గొర్రెల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీకంపోస్ట్ తయారీ తదితర వాటిలో శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో ఇస్తున్నామన్నారు. 2016-17 సంవత్సరంలో 30 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 750 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు, రైతులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. సంస్థ ద్వారా జనచేతన ఆర్థిక అక్షరాస్యత, రుణ అవగాహన కేంద్రాన్ని నెలకొల్పి సమన్వయకర్తగా ఆర్ఆర్ఎం పట్నాయక్‌ను నియమించామన్నారు. ఈ కేంద్రం ద్వారా బ్యాంకులు అందిస్తున్న పలు రకాల రుణ సదుపాయాలు, పొదుపు పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు రకాల సంక్షేమ పథకాలు, రిజర్వ్‌బ్యాంకు నిబంధనలను గ్రామీణ ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. సంస్థలో ఏదైనా శిక్షణ పొందాలనుకున్నవారు 08942-211216, 222369 నంబర్లకు ఫోన్ చేసి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు. సమావేశంలో సిబ్బంది బి.ప్రసాదరావు, కె.హేమకుమార్, ఎం.జ్యోతి పాల్గొన్నారు. -
ఆంధ్రాబ్యాంక్‌లో మరో కుంభకోణం
► చేపలు చెరువుల చూపించి రూ.3.3 కోట్లు రుణం ► చిరునామాలు దొరకని రుణగ్రహీతలు ► పోలీస్ స్టేషన్లో కేసు నమోదు గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంక్‌లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తప్పుడు చిరునామాలు సమర్పించి అప్పు తీసుకున్నవారి చిరునామా దొరకకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల సమీపంలోని నల్లమోతువారిపాలేనికి చెందిన ఏడుగురు వ్యక్తులు గుడివాడ పరిసరాల్లోని చేపల చెరువులు లీజుకు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి రూ.3.33 కోట్లు రుణం పొందారు. ఆ అప్పు వడ్డీతో కలిపి రూ.4.79 కోట్లు అయ్యింది. అయితే అప్పు తీసుకున్నవారి చిరునామాలు దొరకకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. వీరంతా బందరులోని పొలాలను, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఆస్తులను, నల్లమోతువారిపాలెంలోని ఆస్తులను హామీగా పెట్టారు. రుణం తీసుకున్నవారిలో మడ సుబ్రమణ్యం, పిన్నబోయిన వెంకటేశ్వరరావు, నాగరాజు, పోలారయ్య, తాండ్ర జ్యోతి, అంజనీదేవి ఉన్నారని అధికారులు తెలిపారు. బ్యాంకు ఏజీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రాబ్యాంకులో చోరీకి యత్నం
హైదరాబాద్: చిక్కడపల్లిలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో గురువారం రాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. అర్థరాత్రి బ్యాంకు భవనం వెనుక గోడకు కన్నం వేసేందుకు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. అయితే, ఫలించక పోవటంతో వెంట తెచ్చుకున్న పరికరాలు అక్కడే వదిలి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించింది. -
బైక్ డిక్కీ నుంచి రూ.1.80లక్షలు మాయం
బైక్ డిక్కీలో ఉంచిన రూ.1.80లక్షలను గుర్తు తెలియని దుండగులు పట్టపగలే అపహరించుకుపోయారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లి గ్రామ ఉపసర్పంచి మోతె కృష్ణ భువనగిరిలోని ఆంధ్రాబ్యాంకులో రూ.1.80లక్షలను గురువారం సాయంత్రం డ్రా చేశారు. ఆ డబ్బును తన బైక్ డిక్కీలో ఉంచుకుని ఆయన తిరుగు పయనమయ్యారు. అయితే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను అనుసరిస్తూ వచ్చారు. ఇదేమీ పట్టించుకోని కృష్ణ.. హెయిర్ కటింగ్ సెలూన్ వద్ద బైక్‌ను ఉంచి లోపలికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూడగా నగదు కనిపించలేదు. తనను బ్యాంకు దగ్గర్నుంచి అనుసరిస్తూ వచ్చిన గుర్తు తెలియని దుండగులు నగదును అపహరించుకుపోయారంటూ ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Urgent News Article Page Title Test
Apr 9 2024 6:24 PM | Updated on Apr 12 2024 2:37 PM