వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం | Auction On Diplomatic Assets Of Rayapati Samba Shivarao In Next Month | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం

Feb 21 2020 12:16 PM | Updated on Feb 21 2020 12:51 PM

Auction On Diplomatic Assets Of Rayapati Samba Shivarao In Next Month - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ గురువారం పత్రికా ప్రకటన జారీచేసింది. ఈ నేపథ్యంలో రూ.837.37 కోట్ల విలువైన రుణం బకాయి పడటంతో గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు సంబంధించిన ఆస్తులను మార్చి 23న వేలం వేస్తున్నట్లు పేర్కొంది. గుంటూరు అరండల్‌పేటలోని 22,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న వాణిజ్య భవనంతో పాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేస్తున్నట్టు తెలిపింది. గుంటూరు భవనం ఆస్తి విలువను రూ.16.44 కోట్లుగాను, ఢిల్లీలోని ఫ్లాట్‌ విలువను రూ.1.09 కోట్లుగా నిర్ధారించింది. ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియాతో పాటు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరిట తీసుకున్నారు. ఈ రుణానికి గ్యారంటెర్లుగా రాయపాటి జగదీష్‌, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్‌ వాణి, జగన్‌మోహన్‌ యలమంచలి ఉన్నారు. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా టెండర్స్‌ డాట్‌ గవ్‌ డాట్‌ ఇన్‌ను సంప్రదించాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు. (రాయపాటిపై ఈడీ కేసు నమోదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement