పెద్దనోట్ల కష్టాలు చివరకు బ్యాంకు వ్యవస్థాపకుడు వారసురాలికి కూడా తప్పలేదు. దేశంలోనే ప్రముఖ జాతీయ బ్యాంకుల్లో ఒకటైన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు బీ.పట్టాభిసీతారామయ్య మనుమరాలైన బీవీ మహాలక్ష్మి(75) తన భర్త పింఛన్ తీసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఫిషరీస్ శాఖలో పనిచేసిన భర్తకు పింఛన్ రూ.24 వేలు వస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలలో పరిమితి విధించడంతో మనుమడిని అక్కయ్యపాలెంలోని ఆంధ్రా బ్యాంకుకు పంపింది