రెండు నెలలకోసారి కాయిన్‌మేళా | coin mela for every two months | Sakshi
Sakshi News home page

రెండు నెలలకోసారి కాయిన్‌మేళా

Aug 31 2016 11:23 PM | Updated on Sep 4 2017 11:44 AM

ఆంధ్రాబ్యాంక్‌ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఫైర్‌స్టేçÙన్‌ సెంటర్‌లో నిర్వహించిన కాయిన్‌ మేళాలో నగర ప్రజలకు రూ.12 లక్షల చిల్లర నాణేలు పంపిణీ చేశామని ఆంధ్రాబ్యాంక్‌ ఏజీఎం టీవీఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇటీవల కాలంలో చిల్లర నాణేల కొరత అధికం కావడంతో ప్రజలకు నాణేల కొరత తీర్చడానికి తమ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆంధ్రాబ్యాంక్‌ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఫైర్‌స్టేçÙన్‌ సెంటర్‌లో నిర్వహించిన కాయిన్‌ మేళాలో నగర ప్రజలకు రూ.12 లక్షల చిల్లర నాణేలు పంపిణీ చేశామని ఆంధ్రాబ్యాంక్‌ ఏజీఎం టీవీఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇటీవల కాలంలో చిల్లర నాణేల కొరత అధికం కావడంతో ప్రజలకు నాణేల కొరత తీర్చడానికి తమ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ జె.మేఘనాథ్‌ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒక సారి కాయిన్‌ మేళా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేళాలో రూ.2, రూ.5, రూ.10 నాణేలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ అధ్యక్షుడు బీహెచ్‌ రవివర్మ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement