ఆంధ్రాబ్యాంకు నష్టం రూ.532 కోట్లు

Andhra Bank suffered losses of Rs 532 crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రాబ్యాంకు ఈ డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.532 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2016–17 ఏడాది డిసెంబర్‌ క్వార్టరులో బ్యాంకు రూ.56.7 కోట్ల నికరలాభాన్ని ఆర్జించటం గమనార్హం. టర్నోవరు రూ.5,013 కోట్ల నుంచి రూ.5,093 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– డిసెంబర్‌ కాలానికి రూ.15,254 కోట్ల టర్నోవరుపై మొత్తం రూ.876 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.

స్థూల నిరర్ధక ఆస్తులు సెప్టెంబర్‌ క్వార్టరులో 13.27%గా (రూ.19,839 కోట్లు) ఉండ గా, ఇప్పుడు ఇవి 14.26 శాతానికి చేరి రూ.21,599 కోట్లకు ఎగిశాయి. రానిబాకీలకు కేటాయించిన నిధులు ఏకంగా 118% పెరిగి రూ.1,862 కోట్లకు చేరుకున్నాయి. కాగా, డిసెంబర్‌ త్రైమాసికంలో నికరవడ్డీ ఆదాయం 37% పెరిగి రూ.1,672 కోట్లను తాకటం గమనార్హం. నిర్వహణ లాభం 46% అధికమై రూ.1,330 కోట్లుగా ఉంది. మొ త్తం వ్యాపారం 5.74% అధికమై రూ.3,51,735 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు 5.11% పెరిగి రూ.2,00,243 కోట్లకు, అడ్వాన్సులు 6.59% అధికమై రూ.1,51,492 కోట్లకు చేరాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top