ఆంధ్రాబ్యాంకు నూతన డీజీఎంగా రాధాకిషన్‌రావు | andhrabank new dgm took charge | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకు నూతన డీజీఎంగా రాధాకిషన్‌రావు

Aug 30 2016 11:26 PM | Updated on Jun 2 2018 5:51 PM

ఆంధ్రాబ్యాంక్‌ నూతన డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా రాధాకిషన్‌రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీజీఎంగా పనిచేసిన కె.ఉమామహేశ్వరరావుకు హైదరాబాద్‌లోని ఏపెక్స్‌ కళాశాలకు బదిలీ అయ్యింది. హైదరాబాద్‌లోని డేటా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పనిచేసిన రాధాకిషన్‌రావుకు శ్రీకాకుళం జోనల్‌ కార్యాలయం డీజీఎంగా బదిలీపై వచ్చారు.

శ్రీకాకుళం అర్బన్‌: ఆంధ్రాబ్యాంక్‌  నూతన డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా రాధాకిషన్‌రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీజీఎంగా పనిచేసిన కె.ఉమామహేశ్వరరావుకు హైదరాబాద్‌లోని ఏపెక్స్‌ కళాశాలకు బదిలీ అయ్యింది. హైదరాబాద్‌లోని డేటా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పనిచేసిన రాధాకిషన్‌రావుకు శ్రీకాకుళం జోనల్‌ కార్యాలయం డీజీఎంగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని జీటీరోడ్‌లోని మెయిన్‌ బ్రాంచిలో మంగళవారం ఆ బ్రాంచి సిబ్బంది బదిలీపై వెళ్లిపోతున్న ఉమామహేశ్వరరావును ఘనంగా సన్మానించారు. తనకు అందించిన సహాయ సహాకారాలను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీజీఎంకు అందించాలని ఆయన కోరారు. నూతన డీజీఎం రాధాకిషన్‌రావు మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంక్‌ జోనల్‌ కార్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. కార్యక్రమంలో  ఆంధ్రాబ్యాంకు మెయిన్‌ బ్రాంచి చీఫ్‌ మేనేజర్‌ ఐ.చంద్రశేఖర్, సిబ్బంది ఉమాకుమార్, కృష్ణబాబు, ప్రత్యూష, శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement