అరకొర ప్రింటింగ్‌తో రూ. 2వేల నోటు | half printed rs.2000 note | Sakshi
Sakshi News home page

అరకొర ప్రింటింగ్‌తో రూ. 2వేల నోటు

Mar 28 2017 9:40 PM | Updated on Sep 5 2017 7:20 AM

అరకొర ప్రింటింగ్‌తో రూ. 2వేల నోటు

అరకొర ప్రింటింగ్‌తో రూ. 2వేల నోటు

పట్టణంలోని ఆంధ్రబ్యాంకు ఏటీఎంలో మంగళవారం ఓ ఖాతాదారునికి అరకొర ప్రింటింగ్‌ ఉన్న రూ. 2వేల నోటు వచ్చింది.

కోవెలకుంట్ల: పట్టణంలోని ఆంధ్రబ్యాంకు ఏటీఎంలో మంగళవారం ఓ ఖాతాదారునికి అరకొర ప్రింటింగ్‌ ఉన్న రూ. 2వేల నోటు వచ్చింది. దొర్నిపాడు మండలం  డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన ఇమాంఉసేన్‌ కోవెలకుంట్లలోని ఆంధ్రబ్యాంకు ఏటీఎం నుంచి రూ. 10వేలు డ్రా చేశాడు. ఐదు రెండు వేల నోట్లు బయటకు రాగా ఒక నోటుకు ఒక వైపు సరిగా ప్రింట్‌ కాని విషయాన్ని గుర్తించి అవాకయ్యాడు. ఆంధ్రబ్యాంకు మేనేజర్‌ గిరిధర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆ నోటును తిరిగి అక్కడే జమ చేయాలని ఆయన సూచించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement