ఆంధ్రాబ్యాంకులో చోరీకి యత్నం | theft attempt in andhra bank | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకులో చోరీకి యత్నం

Mar 25 2016 10:34 AM | Updated on Sep 3 2017 8:34 PM

చిక్కడపల్లిలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో గురువారం రాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది.

హైదరాబాద్: చిక్కడపల్లిలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో గురువారం రాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. అర్థరాత్రి బ్యాంకు భవనం వెనుక గోడకు కన్నం వేసేందుకు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. అయితే, ఫలించక పోవటంతో వెంట తెచ్చుకున్న పరికరాలు అక్కడే వదిలి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement