కుత్భుల్లాపూర్ - పేట్ బషీరాబాద్ పరిధిలో సుచిత్రా సమీపంలోని ఆంధ్రాబ్యాంకు (జీడిమెట్ల బ్రాంచ్)లో శుక్రవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు.
హైదరాబాద్ : కుత్భుల్లాపూర్ - పేట్ బషీరాబాద్ పరిధిలో సుచిత్రా సమీపంలోని ఆంధ్రా బ్యాంకు (జీడిమెట్ల బ్రాంచ్)లో శుక్రవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. తాళాలు పగలగొట్టి బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి... హారన్ మోగకుండా చేశారు. అలాగు బ్యాంకులోని పలు కంప్యూటర్ల వైర్లను కూడా కత్తిరించారు.
దొంగలు బ్యాంకులో లాకర్ తెరిచేందుకు ప్రయత్నించారు. ఇంతలో బ్యాంకులో దొంగలు పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని పసిగట్టిన దొంగలు అక్కడి నుంచి పరారైయ్యారు. పోలీసులు వెంబడించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో దొంగ పరారయ్యాడు.నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.