ఆంధ్రాబ్యాంకు విలీనం దుర్మార్గపు ఆలోచన

Andhra Bank Employees Will Strike On 22nd Against Andhra Bank Merging  - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రాబ్యాంక్‌ విలీనానికి వ్యతిరేకంగా ఆంధ్రాబ్యాంక్‌ అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఏఐబీఈఏ), బీఈఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 22న సమ్మె చేయనున్నట్లు ఏఐబీఈఏ డిప్యూటీ జోనల్‌ కార్యదర్శి బి.మోహనరావు తెలిపారు. బ్యాంక్‌ విలీనానికి వ్యతిరేకంగా ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది జీటీరోడ్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచి వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను అగౌరవపరచడమేనన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమించి బ్యాంకును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాభాల్లో నడుస్తున్న బ్యాంకును వేరే బ్యాంకులో విలీనం చేయడం దుర్మార్గపు ఆలోచనగా దుయ్యబట్టారు. నిరసన ప్రదర్శనలో ఏఐబీఈఏ మహిళా కార్యదర్శి జి.కరుణ, సహాయ కార్యదర్శి ఎన్‌.ఎం.కె రాజు, సంతోషి, జయరాం, రెడ్డి, దీపిక, బ్యాంక్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top