నిరుద్యోగ యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ | special training for unemployment youth | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ

Sep 13 2016 1:16 AM | Updated on Sep 4 2017 1:13 PM

ఏలూరులోని ఆంధ్రాబ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిరుద్యోగ యువతీ,యువకులకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ జె.షణ్ముఖరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీలకు బ్యూటీషియన్, మెహందీ కోర్సుల్లో 30 రోజులు, మగ్గం వర్స్క్, గ్లిట్టరింగ్‌ వర్క్స్‌లో 21 రోజుల శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వయసు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలన్నారు. బ్యూటీషియన్, మెహందీలో శిక్షణ పొందేవారి

కామవరపుకోట : ఏలూరులోని ఆంధ్రాబ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిరుద్యోగ యువతీ,యువకులకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ జె.షణ్ముఖరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీలకు బ్యూటీషియన్, మెహందీ కోర్సుల్లో 30 రోజులు, మగ్గం వర్స్క్, గ్లిట్టరింగ్‌ వర్క్స్‌లో 21 రోజుల శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వయసు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలన్నారు. బ్యూటీషియన్, మెహందీలో శిక్షణ పొందేవారి విద్యార్హత పదోతరగతి ఉండాలని, ఇందులో ప్రవేశం వచ్చే నెల 3 నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు ఉంటుందన్నారు. మగ్గం వర్క్‌లో శిక్షణ పొందే వారి విద్యార్హత 5వ తరగతి ఉండాలని ప్రవేÔ¶  గడువు వచ్చే నెల 3 నుంచి 26వ తేదీ వరకు ఉంటుందన్నారు. పురుషులకు బేసిక్‌ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 21 రోజుల శిక్షణ, మొబైల్‌ ఫోన్‌ రిపేర్స్‌లో 30 రోజుల శిక్షణ ఇస్తారని విద్యార్హత పదో తరగతి ఉండాలన్నారు. బేసిక్‌ ఫొటోగ్రఫీకి నవంబర్‌ 7 నుంచి 29 వరకు, మొబైల్‌ ఫోన్‌ రిపేర్‌కు వచ్చే నెల 7 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ఉంటుందన్నారు. వయసు 18 నుంచి 35 సంవత్సరాలుండాలన్నారు. శిక్షణ  కాలంలో భోజన, వసతి సదుపాయాలు, ఒకసారి రానుపోను ఛార్జీలు పూర్తిగా ఉచితమని డైరెక్టర్‌ షణ్ముఖరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్కుల జాబితా రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజు కలర్‌ ఫొటోలతో ప్రవేశ సమయంలో ఏలూరులోని డోర్‌ నెం. 24ఎ–7–1, అమలోద్భవి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ దగ్గర, బమ్మెర పోతనవీధి, అశోక్‌నగర్‌లోని తమ సంస్థ చిరునామాలో లగేజీతో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 08812–253975 ఫోన్‌ నంబర్‌కు గానీ, 98660 94383 లేదా 94909 98882 మొబైల్‌ నంబర్లకు ఫోన్‌ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement