హైదరాబాద్‌లో బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య | Andhra Bank Assistant Manager Lost Breath at uppal | Sakshi
Sakshi News home page

ఆంధ్రా బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆత్మహత్య

May 4 2020 7:06 PM | Updated on May 4 2020 7:11 PM

Andhra Bank Assistant Manager Lost Breath at uppal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అనుమానాస్పద స్థితలో ఆంధ్రా బ్యాంక్‌ మేనేజర్‌ ఆత‍్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఉప్పల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్వరూప్‌ నగర్‌కు చెందిన బాల సుదర్శన్‌ (38) కింగ్‌ కోఠి ఆంధ్రా బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య, ఇద్దరు కూతుళ్లు నిద్రిస్తుండగా బాల్కానీలోని హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే సుదర్శన్‌ కుటుంబసభ్యులు మాత్రం పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement