ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ అరెస్ట్ | andhra bank cashier arrested in suryapet | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ అరెస్ట్

Dec 28 2016 11:14 PM | Updated on Sep 22 2018 7:51 PM

సూర్యాపేట జిల్లా మటంపల్లి ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ రవీందర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

మటంపల్లి : సూర్యాపేట జిల్లా మటంపల్లి ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ రవీందర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం పెద్దమొత్తంలో నోట్లు మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన హుజూర్‌నగర్ పోలీసులు క్యాషియర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ. 5.22 లక్షల విలువైన పాత వెయ్యి రూపాయల నోట్లను మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దీనిపై పోలీసులు రవీందర్ రెడ్డిని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement