బైక్ డిక్కీ నుంచి రూ.1.80లక్షలు మాయం | theft of Rs 1.80 lakh from the bike Dickie | Sakshi
Sakshi News home page

బైక్ డిక్కీ నుంచి రూ.1.80లక్షలు మాయం

Mar 17 2016 3:57 PM | Updated on Aug 29 2018 4:18 PM

బైక్ డిక్కీలో ఉంచిన రూ.1.80లక్షలను గుర్తు తెలియని దుండగులు పట్టపగలే అపహరించుకుపోయారు.

 బైక్ డిక్కీలో ఉంచిన రూ.1.80లక్షలను గుర్తు తెలియని దుండగులు పట్టపగలే అపహరించుకుపోయారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లి గ్రామ ఉపసర్పంచి మోతె కృష్ణ భువనగిరిలోని ఆంధ్రాబ్యాంకులో రూ.1.80లక్షలను గురువారం సాయంత్రం డ్రా చేశారు. ఆ డబ్బును తన బైక్ డిక్కీలో ఉంచుకుని ఆయన తిరుగు పయనమయ్యారు.

అయితే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను అనుసరిస్తూ వచ్చారు. ఇదేమీ పట్టించుకోని కృష్ణ.. హెయిర్ కటింగ్ సెలూన్ వద్ద బైక్‌ను ఉంచి లోపలికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూడగా నగదు కనిపించలేదు. తనను బ్యాంకు దగ్గర్నుంచి అనుసరిస్తూ వచ్చిన గుర్తు తెలియని దుండగులు నగదును అపహరించుకుపోయారంటూ ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement