హెచ్‌డీఐఎల్‌పై ఆంధ్రా బ్యాంక్‌ దివాలా పిటిషన్‌ ఉపసంహరణ | Andhra Bank bankruptcy petition on HDIL | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఐఎల్‌పై ఆంధ్రా బ్యాంక్‌ దివాలా పిటిషన్‌ ఉపసంహరణ

Nov 17 2017 12:33 AM | Updated on Nov 17 2017 12:33 AM

Andhra Bank bankruptcy petition on HDIL - Sakshi

న్యూఢిల్లీ: భారీగా బాకీపడిన రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్లో (ఎన్‌సీఎల్‌టీ) దాఖలు చేసిన దివాలా దరఖాస్తును ఆంధ్రా బ్యాంకు ఉపసంహరించుకుంది. రుణబాకీలను సెటిల్‌ చేసుకునేందుకు తాము సిధ్ధమైనందున ఆంధ్రా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌డీఐఎల్‌ పేర్కొంది.

ఇప్పటికే కొంత మొత్తం చెల్లించినట్లు తెలిపింది. అయితే, ఎంత మొత్తం చెల్లించినదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సుమారు రూ.55 కోట్ల రుణాలు బాకీ పడిందంటూ అక్టోబర్‌ 30న హెచ్‌డీఐఎల్‌పై ఆంధ్రా బ్యాంకు.. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది.   

Advertisement
 
Advertisement
Advertisement