హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లపై మరో సీబీఐ కేసు

Cbi Fir Against Hdil Promoters In New Bank Fraud Case - Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లు రాకేష్‌ వాధ్వాన్, సారంగ్‌ వాధ్వాన్‌లపై మరో బ్యాంక్‌ మోసం కేసును సీబీఐ నమోదుచేసింది. వారి అనుబంధ సంస్థ గురుఆశిష్‌ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన రూ.140 కోట్ల మోసం విషయంలో కొత్త కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.  

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకుకు సంబంధించి రూ.4,300 కోట్ల  కుంభకోణం కేసులో ఇప్పటికే ఇరుక్కున్న ఈ  వ్యాపారవేత్తలపై తాజాగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై తాజా చర్య ప్రా రంభించినట్లు వారు తెలిపారు. 

యస్‌ బ్యాంక్‌కు సంబంధించి రూ.200 కోట్ల కుంభకోణంలో కూడా వాధ్వాన్‌లపై కేసు దాఖలైంది.  

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top