ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం | andhrabank | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం

Sep 14 2016 11:41 PM | Updated on Jun 2 2018 5:51 PM

ఆంధ్రాబ్యాంక్‌ విద్యుత్‌నగర్‌ బ్రాంచీలో చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దుండగుడు బ్యాంక్‌ వెనుక భాగంలోని గేటు నుంచి చొరబడి, షట్టర్‌ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఏటీఎంను, మెయిన్‌ లాకర్‌ ను కూడా పగులగొట్టి చోరీకి యత్నించాడు. అవి ఫలించకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు

రాజమహేంద్రవరం క్రైం :
ఆంధ్రాబ్యాంక్‌ విద్యుత్‌నగర్‌ బ్రాంచీలో చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దుండగుడు బ్యాంక్‌ వెనుక భాగంలోని గేటు నుంచి చొరబడి, షట్టర్‌ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఏటీఎంను, మెయిన్‌ లాకర్‌ ను కూడా పగులగొట్టి చోరీకి యత్నించాడు. అవి ఫలించకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బుధవారం ఉదయం 8.30 కు బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఎంవీఎన్‌ మధుసూదనరావు బ్యాంక్‌ షట్టర్లు తెరిచి ఉండడాన్ని గమనించి, డీజీఎం భాస్కరరావుకు సమాచారమిచ్చారు. డీజీఎం ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి, క్రైం డీఎస్పీ త్రినాథరావు, తూర్పు మండలం డీఎస్పీ రమేష్‌బాబు, ప్రకాష్‌ నగర్‌ సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించాయి. బ్యాంక్‌లోని సీసీ ఫుటేజ్‌ను ఎస్పీ పరిశీలించారు. చీకటిగా ఉండడం వల్ల దుండగుడు స్పష్టంగా కనిపించలేదు. ప్రకాష్‌ నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement