
సాక్షి,విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డికి జైలులో వసతులు కల్పించాలనే ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారనే ఫిర్యాదుపై రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు(మంగళవారం, జూలై 22) కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిటెండెంట్‌పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి, విష్ణు వర్ధన్‌లు ఫిర్యాదు చేశారు.
మిథున్ రెడ్డికి వసతులు కల్పించాలన్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించారని న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో మాట్లాడారు. అనంతరం, రాజమండ్రి జైలు అధికారులు రేపు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలు అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టు ఎదుట విచారణకు హాజరు కానున్నారు.