వామ్మో..! క్షుద్ర పూజల కోసం 'కస్తూరి పిల్లి' అవయవాలు.. అంతలోనే.. | - | Sakshi
Sakshi News home page

వామ్మో..! క్షుద్ర పూజల కోసం 'కస్తూరి పిల్లి' అవయవాలు.. అంతలోనే..

Oct 9 2023 5:04 AM | Updated on Oct 9 2023 7:30 AM

- - Sakshi

హైదరాబాద్‌: క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయువాలను తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తెల్లవారు జామున సయ్యద్‌ అక్బర్‌ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.

లగేజీ స్క్రీనింగ్‌లో అనుమానిత వస్తువులు కనిపించడంతో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వాటిని విప్పి చూడగా, కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్ర పూజల కోసం వాటిని తీసుకెళుతున్నట్లు తెలిపారు. కస్టమ్స్‌ అధికారులు అతడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో వారు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే అతడు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కస్తూరి పిల్లి శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, టిబెట్‌ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కస్తూరి పిల్లి అవయవాలను సుగంధ పరిమళాల ఉత్పత్తుల తయారీలో.. కొన్ని రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement