సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్‌ పాత్రలను

తమిళసినిమా: సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్‌ పాత్రలను కోరుకుంటారు. అలాంటి పాత్రలతోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడవచ్చునని, ప్రేక్షకుల ఆదరణను పొందవచ్చు అనేది వారి అలోచనగా ఉంలుటుంది. అలాంటిది నటి అనుకీర్తీవాస్‌ మాత్రం ఛాలెంజింగ్‌ పాత్రలను కోరుకుంటున్నారు. ఈమె గురించి చెప్పాలంటే కళాశాల రోజుల్లోనే మోడలింగ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్నీ గెలుచుకున్నారు. తర్వాత సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. ఇంకేముందు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించిన డీఎస్‌పీ చిత్రం ద్వారా కథానాయకిగా తెరంగేట్రం చేశారు. అలా తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ బ్యూటీకి ఆ వెనువెంటనే టాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. రవితేజ సరసన టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వరించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. దీని గురించి నటి అనుకీర్తీవాస్‌ మాట్లాడుతూ తన తొలి చిత్రం డీఎస్‌పీలో కంటే మంచి పాత్రను తెలుగు చిత్రం టైగర్‌ నాగేశ్వరరావులో నటించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఇంకా ఛాలెంజింగ్‌తో కూడిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు ఈ బ్యూటీ పేర్కొన్నారు. ఆదిలోనే తమిళం, తెలుగు భాషల్లో నటించే అవకాశాలను అందుకుంటున్న ఈ భామ అందంతో పాటు అభినయంతోనూ సత్తా చాటుకోవడం విశేషం.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top