వేలూరు: విద్యార్థులు కళాశాల విద్య నుంచే పరిశోధనలపై ఆశక్తి చూపాలని తిరిచ్చ బిషఫ్ హాబీర్ కళాశాల మాజీ వైస్ ప్రిన్సిపల్ అలగప్ప మోసస్ అన్నారు. వేలూరులోని ఊరీస్ కళాశాలలో జంతుశాస్త్ర పరిశోధన విభాగం ఆధ్వర్యంలో సుస్తిర్ అభివృద్ధి కోసం వాతావరణ స్థితి స్థాపకత అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు జరిగింది. సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. విద్యార్థులు ప్రస్తుత పర్యావరణ అద్యయనాలపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో అనేక విషయాలపై అవగాహణ కలిగి చిన్న చిన్న కరపత్రాలతో పరిశోధనలు ప్రారంభించాలన్నారు. వేలూరు డయాసిస్ సీఎస్‌ఐ బిషఫ్, ఊరీస్ కళాశాల చైర్మన్ శర్మ నిత్యానందం, ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ ఆనీ కమల ఫ్లోరెన్స్, చైన్నె కార్యచరణ ప్రణాళిక కమిటీ సభ్యులు సురేష్, మరియా సెల్వం, డాక్టర్ సుజాత, డాక్టర్ రాజా మీనాక్షి, హెచ్‌ఓడీ కన్వీనర్ అనసూయ, ప్రొఫెసర్ తిరుమారన్, విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


