దేవుని ఆశీస్సుల కోసం.. | - | Sakshi
Sakshi News home page

దేవుని ఆశీస్సుల కోసం..

Mar 19 2026 7:51 AM | Updated on Mar 19 2026 7:51 AM

● ఆలయాలకు క్యూ కడుతున్న రాజకీయ నేతలు

తిరువళ్లూరు: ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన క్రమంలో జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడిక్కెంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమ సీటుకు పదిలం చేసుకునే పనిలో పడగా, తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆశతో వున్న ఆశావహులు తమకు వున్న బలాలను మొత్తం ప్రయోగిస్తున్నారు. అయితే తమ వద్ద వున్న అర్థ, రాజకీయ బలానికి మరింత దైవబలం కావాలన్న ఉద్దేశంతో పట్టణంలోని వీరరాఘవుడి ఆలయానికి రాజకీయ నేతలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు క్యూకట్టారు. విషయానికి వస్తే.. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ది చెందిన శ్రీ వీరరాఘవుడి ఆలయం వుంది. ఆలయానికి ప్రతి అమావాస్యకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పలువురు నేతలు ఈ ఆలయానిక క్యూ కడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement