
36 ఏళ్ల తరువాత ఏ సర్టిఫికెట్
గ్రాండ్ ఫాదర్‌గా భాస్కర్
కూలీ చిత్రంలో
రజనీకాంత్
తమిళసినిమా: చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సర్టిఫికెట్‌ను ఇప్పుడు రజనీకాంత్ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. కాగా అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్‌తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు.
గ్రాండ్ ఫాదర్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్
తమిళసినిమా: ఎంఎస్ భాస్కర్, ఫ్రాంక్ స్టార్ రాహుల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రానికి గ్రాండ్ ఫాదర్ అనే టైటిల్ నిర్ణయించారు. కుట్టి స్టోరీస్ పిక్చర్స్ పతాకంపై భువనేష్ చిన్నస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెట్రో మురళి, మెట్రోగిరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఫ్రాంక్ స్టార్ రాహుల్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి స్మీక కథానాయకిగా నటిస్తున్న ఇందులో అరుణ్‌దాస్, మునీష్కాంత్, శ్రీనాథ్, శివ అరవింద్, ప్రియదర్శిని, అంజలిరావ్, అభినయ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ చాయాగ్రహణం, రంజిన్ రాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కామెడీ విత్ హర్రర్, ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా పార్కింగ్ చిత్రంలో నటనకుగాను నటుడు ఎంఎస్ భాస్కర్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డును ప్రకటించిన నేపథ్యంలో గ్రాండ్ ఫాదర్ చిత్ర యూనిట్ ఆయన్ను అభినందించడంతో పాటు ఆయన గౌరవించే విధంగా ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఎమ్మెస్ భాస్కర్ గ్రాండ్ ఫాదర్‌గా టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లలో ఆయన గెటప్ కొత్తగా ఉండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. రాగా గ్రాండ్ ఫాదర్ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

36 ఏళ్ల తరువాత ఏ సర్టిఫికెట్

36 ఏళ్ల తరువాత ఏ సర్టిఫికెట్