డార్క్ జెయింట్ టైటిల్ ఆవిష్కరణ
కొంత కాలంగా టెన్షన్‌గా ఉన్నా!
తమిళసినిమా: నటి శ్రుతిహాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. అంతే కాకుండా సినిమా విక్కీపీడియాగా పేర్కొనే నటుడు కమలహాసన్, సారికల వారసురాలు అనే చిరునామా కలిగిన నటి ఈ బ్యూటీ. ఇక ప్రేమ వ్యవహారంలో పలుమార్లు వార్తల్లోకెక్కిన ఈ భామ ఇటీవలే 40వ పుట్టిన రోజును జరుపుకున్నారు. శ్రుతిహసన్ నాయకిగా తమిళంలో నటించిన ట్రెయిన్ చిత్రం విడుదల కావలసి ఉంది. ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన, గాయని, సంగీతం, రచన అంటూ పలు రంగాల్లో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తాను చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన తల్లిదండ్రులతో పెరిగడమే ఇందుకు కారణం అన్నారు. 2018 నుంచి కొన్ని కారణాల వల్ల కొంత విరామం తీసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తానెవరు అన్నది పునః పరిశీలంచుకోవడానికి ఉపయోగించుకున్నానని చెప్పారు. తాను పలు ఏళ్లుగా చాలా టెన్సన్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ టెన్షన్ కారణంగా ఆయా పరిస్థితుల కనుగుణంగా పయనించలేకపోయానని చెప్పారు. తన విరామ కాలాన్ని లండన్‌లో గడిపానని, ఆ సమయంలో తన వంట తనే చేసుకున్నానని, తన బట్టలు తానే ఉతుక్కున్నానని, మెట్రో రైలులో పయనించానని, సంగీతం సాధన చేశానని చెప్పారు. ప్రస్తుతం ఒక కళాకారిణిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు.అది ఆనందాన్ని కలిగిస్తోందని, ఇకపై చాలెంజ్‌తో కూడిన కథా పాత్రల్లో నటించడానికి ప్రాముఖ్యతనిస్తానని శ్రుతిహాసన్ అన్నారు.
తమిళసినిమా: హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలు నిర్మాతలకు, బయ్యర్లకు మినిమం గ్యారెంటీగా మారుతున్నాయి. అలా తాజాగా రూపొందుతున్న చిత్రం డార్క్ జెయింట్. సోనియా అగర్వాల్, దర్శకుడు కే.భాగ్యరాజ్, లీవింగ్‌స్టన్, లివింగ్‌స్టన్ వారసురాలు జోవిడా, అయిలి మదన్, విజయ్ టీవీ ఫేమ్ అముదవన్, ఆకాశ్, హాలీవుడ్ నటుడు రవిక్ బాషా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కేఎస్.కిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విశ్రాంతి సైనికాధికారి లోకేశ్వరన్ పయోవన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి అయ్యిందని, తర్వాత షెడ్యూల్‌ను ఈ నెల రెండవ వారం నుంచి నిర్వహించనున్నట్లు దర్శకుడు చెప్పారు. చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్, ఆడియోలను త్వరలోనే విడుదల చేసి చిత్రాన్ని ఏప్రిల్‌లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. డార్క్ జెయింట్ చిత్రం ప్రేక్షకులకు సరి కొత్త అనుభవాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా సంగీతాన్ని, సంగీత్ మణిగోపాల్ చాయాగ్రహణం అందిస్తున్నారు.


