సాంకేతిక విస్తరణ బలోపేతం కావాలి
తాడేపల్లిగూడెం: గ్రామ స్ధాయిలో సాంకేతికత విస్తరణ బలోపేతం కావాలని వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన శాసీ్త్రయ సలహా మండలిలో పలువురు శాస్త్రవేత్తలు మార్గదర్శనం చేశారు. ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వర్సిటీ విస్తరణ సంచాలకురాలు డాక్టర్ రూత్ మాట్లాడుతూ సమయానుకూలంగా రైతులకు శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


