వడ్డి రఘురాం, వైఎస్సార్‌సీపీ గూడెం కన్వీనర్
తాడేపల్లిగూడెం: అంగన్‌వాడీల పట్ల చంద్రబాబు తీరు మారలేదని మరోమారు స్పష్టం అయ్యిందని, అంగన్‌వాడీల అరెస్టులతో వారి ఉద్యమాన్ని ఆపలేరని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీసర్ వడ్డి రఘురాం అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ, కనీసం వేతనం పెంపు అమలు ఏమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఆందోళన చేస్తున్న వారిని గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు చేయిస్తున్నారన్నారు. చర్చలంటూ కబురపెట్టి అక్రమ అరెస్టులు చేయడం నయవంచనే అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అంగన్‌వాడీల జీతం 2019లో రూ.11,500కు పెంచారన్నారు. అంగన్‌వాడీ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు.


