నేటి నుంచి మరియ మాత ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మరియ మాత ఉత్సవాలు ప్రారంభం

Mar 1 2026 7:19 AM | Updated on Mar 1 2026 7:19 AM

నేటి

నేటి నుంచి మరియ మాత ఉత్సవాలు ప్రారంభం

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు కలిదిండి రాక

కలిదిండి(కై కలూరు): రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కలిదిండి మరియమాత మహోత్సవాలు పునీత జోజప్ప దేవాలయంలో ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా.. కలిదిండి – భీమవరం రహదారిలో చర్చి వద్ద మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కై కలూరు రూరల్‌ సర్కిల్‌ సీఐ వి.రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. మొదటి రోజు సమష్టి దివ్య పూజా బలి సమర్పణ, వాక్య పరిచర్య జరగనుంది. సాయంత్రం దివ్య పూజా బలి కార్యక్రమానికి విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు తెలగతోటి జోసఫ్‌ రాజారావు విచ్చేయనున్నారు. 2వ తేదీన బలిపూజను గన్నవరం విచారణ గురువులు రెవరెండ్‌ ఫాదర్‌ పసల తోమస్‌ నిర్వహిస్తారు. 3వ తేదీన దివ్య బలి పూజను విజయవాడ మేత్రాసన జనరల్‌ సెయింట్‌ ఫాల్స్‌ కతెడ్రల్‌కు చెందిన రెవరెండ్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ జరుపుతారు. మేత్రాసన పవిత్రాత్మ, నూతనీకరణ బృందాలతో స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి.

కలిదిండి విచారణ 1961 అక్టోబరు 1న భైరవపట్నం విచారణ నుంచి ఏర్పడింది. రెవరెండ్‌ ఫాదర్‌ సేల్సు సమయంలో కలిదిండిలో పునీత జోజప్ప దేవాలయం, ఆస్పత్రి, కన్య సీ్త్రల వసతి గృహం, రెవరెండ్‌ ఫాదర్‌ జాన్‌ మాథ్యూ నిర్వహణలో కల్వరి కొండను నిర్మించారు. ఫాదర్‌ కొలకాని మరియన్న బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. రెవరెండ్‌ ఫాదర్‌ ఫ్రాన్సిస్‌ విచారణ అభివృద్ధికి కృషి చేశారు. కలిదిండి విచారణ నుంచి కోరుకొల్లు, కై కలూరు, భాస్కరరావుపేట విచారణలు ఏర్పడ్డాయి. కలిదిండి విచారణ పరిధిలో మరియదళం, విన్సింట్‌ పౌల్‌ సొసైటీ, సెయింట్‌ జోసప్స్‌ యూత్‌, దోమినక్‌ సావియో వత్తాసు బాలల సంఘం, సెయింట్‌ మేరీస్‌ ఇంగ్లీషుం మీడియం స్కూల్‌, మిషనరీస్‌ ఆఫ్‌ మదర్‌ మేరీ కాన్పెంట్‌, మద్వానిగూడెంలో మేరీ కాన్వెంట్‌లు ఉన్నాయి.

ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు

మరియమాత ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 1న రాత్రి కలిదిండి విచారణ గ్రామస్తులతో నృత్య ప్రదర్శన, 2న కలిదిండి ఆరోగ్యమాత ఆర్కేస్ట్రా మధుర గీతాలాపన, 3న విజయవాడ ఆంధ్ర క్రైస్తవ నాట్యమండలికి చెందిన గుమ్మడి జీవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ధనవంతుడు – పేదలాజరు బైబిల్‌ నాటకం ప్రదర్శించనున్నారు.

మరియమాత చర్చి వద్ద కల్వది కొండ

నేటి నుంచి మరియ మాత ఉత్సవాలు ప్రారంభం1
1/1

నేటి నుంచి మరియ మాత ఉత్సవాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement