మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.51.52 లక్షలు | - | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.51.52 లక్షలు

Feb 27 2026 7:50 AM | Updated on Feb 27 2026 1:36 PM

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 28 రోజులకు రూ. 51,52,032 నగదు, బంగారం 33.240 గ్రా ములు, వెండి 189 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించినట్టు దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ద మహాలక్ష్మి నగేష్‌ తెలిపారు. కృష్ణా జిల్లా సింగరాయపాలెం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ జి.గంగా శ్రీదేవి పర్యవేక్షించారు. ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, భీమవరం ఎండోమెంట్‌ తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని, దీనిలో భాగంగా వీఆర్వో, వీఆర్‌ఏలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసినట్టు జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పరీక్షా శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్యం బా గుంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. సాధారణ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ, షుగర్‌ తదితర పరీక్షలు నిర్వహించారు. వైద్య సేవలను జేసీ పరిశీలించారు. డీ ఆర్వో ఎం.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీఓ కె. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ రావి రాంబాబు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

‘ఆధార్‌’ సవరణకు అవకాశం

భీమవరం (ప్రకాశంచౌక్‌): టెన్త్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఆధార్‌ వివరాలను సవరించుకోవడానికి ఈనెల 28 వరకు అవకాశం కల్పించినట్టు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్‌ నంబర్లను సవరించుకోవచ్చని సూచించారు.

ఉద్యాన వర్సిటీలో ఏఎంఎస్‌ వ్యవస్థ

తాడేపల్లిగూడెం (టీఓసీ): వెంకట్రామన్నగూ డెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో అకడమిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏఎంఎస్‌)ని ప్రవేశపెడుతున్నట్టు, ఈ మేరకు వీసీ డాక్టర్‌ కె.ధనుంజయరావు నిర్ణయించారని వర్సిటీ డీన్‌ ప్రసన్నకుమార్‌ గురువారం తెలి పారు. ఏఎంఎస్‌లో కళాశాల విద్యార్థులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల నమోదు, గ్రేడ్‌ నిర్వహణ, అధ్యాపక షెడ్యూల్‌, సహా విద్యా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, కేంద్రీకృత, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ తదితర విషయాలు ఉంటాయన్నా రు. ఈ వ్యవస్థతో అధ్యాపకులపై పాలన భా రాలు తగ్గి, బోధనపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. వర్సిటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఐఐఎస్‌ఆర్‌ (న్యూఢిల్లీ) ఏఎంఎస్‌ నిపుణులు డాక్టర్‌ మనీష్‌ చౌహాన్‌ బృందం, యూనియన్‌ బ్యాంక్‌ ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఎం. మాధవి, విస్తర సంచాలకులు సీహెచ్‌ రూత్‌, పరిశోధన సంచాలకుడు జి.రామానందం పాల్గొన్నారు.

ఫ్యామిలీ సర్వే వేగిరపర్చాలి

పాలకోడేరు: యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే, ఈకేవైసీ నెలాఖరులోపు నూరుశాతం పూర్తిచేయా లని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉండి, పాలకోడేరు మండలాల్లో సర్వే మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాల జిల్లా అధికారి వై.దోసిరెడ్డి, ఎంపీడీఓ వీరమల్లు రెడ్డియ్య, తహసీల్దార్‌ ఎంవీఎస్‌ లక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement