కలుషిత నీటి వల్లే దద్దుర్లు | - | Sakshi
Sakshi News home page

కలుషిత నీటి వల్లే దద్దుర్లు

Feb 28 2026 1:26 PM | Updated on Feb 28 2026 1:26 PM

కలుషి

కలుషిత నీటి వల్లే దద్దుర్లు

కలుషిత నీటి వల్లే దద్దుర్లు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు పోగొట్టుకున్న బ్యాగ్‌ అప్పగింత

పాలకొల్లు సెంట్రల్‌: వాటర్‌ వల్ల వచ్చిన దద్దుర్లే తప్ప ఆటలమ్మ, పొంగు వంటి వ్యాధులేమీ కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యశాఖాధికారి డా.గీతాబాయి అన్నారు. పాలకొల్లు మండలం రూరల్‌ పంచాయతీకి సంబంధించిన అచ్చుగట్లపాలెం చిత్రావిచెరువుగట్టు ప్రాంతానికి చెందిన ప్రజలకు అక్కడ పంచాయతీ వాటర్‌ వల్ల దద్దురు రావడంతో ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి మెడికల్‌ క్యాంపు ఏర్పాటుచేశారు. మెడికల్‌ క్యాంపులో పలువురికి పరీక్షలు చేసిన డా.గీతాబాయి మాట్లాడుతూ వాటర్‌ కలుషితం వల్ల దద్దురు వచ్చాయని నీళ్లలను పరీక్షలకు పంపామన్నారు. ఆయింట్‌మెంట్‌, ట్యాబ్లెట్లు అందించామన్నారు. ప్రతి నెలా ఈ ప్రాంతంలో సంచార వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని వైద్యాధికారులకు సూచించారు. వాటర్‌ ట్యాంకు ప్రతి 15 రోజులకోసారి క్లోరినేషన్‌ టెస్టింగ్‌ చేయాలని తెలిపారు.

కొయ్యలగూడెం: మట్టి అక్రమ తవ్వకాలకు అదుపు లేకుండా పోతోంది. శుక్రవారం మండలంలోని యర్రంపేట పులపాకుల చెరువు నుంచి జేసీబీలను ఏర్పాటుచేసి ట్రక్కులలో మట్టిని తరలించారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా.. వాళ్ళు వచ్చేసరికి మట్టి ట్రక్కులు ఎక్కడికక్కడ సర్దుకున్నాయి. గత కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో కొనసాగిన మట్టి తోలకాలు ఇప్పుడు పట్టపగలే కొనసాగుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. అధికారులకు సమాచారం వెళ్లిన అనంతరం వాళ్లు రావడంతో వాహనాలతో అక్రమార్కులు పలాయనం చిత్తగించారు. యర్రంపేట, రాజవరం, పొంగుటూరు, దిప్పకాయలపాడు, కన్నాపురం, సరిపల్లి గ్రామాలలోని సాగునీటి చెరువుల వెంట మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని సాగునీటి చెరువుల ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): బస్‌లో బ్యాగ్‌ పోగొట్టుకున్న మహిళకు తిరిగి బ్యాగ్‌ భద్రంగా అప్పగించామని జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్‌.గిరిధర్‌ కుమార్‌ తెలిపారు. ఈ నెల 25న ఆత్రేయపురానికి చెందిన ఎం.సూర్యకుమారి భీమవరం డిపోకు చెందిన విశాఖపట్నం బస్‌ సర్వీస్‌లో ప్రయాణించారన్నారు. ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ మర్చిపోవడంతో బ్యాగ్‌ను గుర్తించిన సర్వీసు డ్రైవర్‌ తీసుకువచ్చి డిపో ఎర్నింగ్‌ సెక్షన్‌కు అప్పగించారని తెలిపారు. ప్రయాణికురాలు ఆధార్‌ కార్డు ఆధారంగా సమాచారం అందించామన్నారు.

కలుషిత నీటి వల్లే దద్దుర్లు 
1
1/2

కలుషిత నీటి వల్లే దద్దుర్లు

కలుషిత నీటి వల్లే దద్దుర్లు 
2
2/2

కలుషిత నీటి వల్లే దద్దుర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement