హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలి

Mar 9 2026 7:21 AM | Updated on Mar 9 2026 7:21 AM

భక్తురాలి ఉంగరం చోరీ

భీమవరం (ప్రకాశంచౌక్‌): వసతి గృహాల్లో చ దువుకుంటున్న విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలని నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యురాలు విజయ భారతి షైనీ ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని పలు హాస్టళ్లను ఆమె తనిఖీ చేశారు. రైతు బజార్‌ స మీపంలోని హాస్టల్‌ పరిసరాలను పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. విద్యార్థినుల తో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులు సౌకర్యవంతంగా చ దువుకునేలా వాతావరణం కల్పించాల్సింది గా అధికారులకు సూచించారు. విద్యార్థినుల చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్‌వీ అరుణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, వసతి గృహాల సంక్షేమ అధికారులు, భీమవరం డిప్యూటీ తహసిల్దార్‌ నాగార్జున ఉన్నారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ ఆవరణలో ఆదివారం రాత్రి ఓ భక్తురాలి బంగారపు ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్ర బంజర్‌కు చెందిన అనంతోజ్‌ సౌమ్య కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి క్షేత్రానికి వచ్చారు. సాయంకాలార్చన అనంతరం రాత్రి 7 గంటల సమయంలో క్యూలైన్‌లోకి వెళ్లేటప్పుడు ఆమె చేతికున్న ఉంగం చోరీకి గురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement