ఇంగ్లిష్ : గ్రామర్.. గేమ్ చేంజర్
హిందీ: ప్యాసేజీ ప్రశ్నలే కీలకం
భౌతికశాస్త్రం.. ప్రశ్నల సరళి కీలకం
తెలుగు: భాషా పరిజ్ఞానం ముఖ్యం
● జీవక్రియల యూనిట్ నుంచి అధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
● అనువంశికత యూనిట్ నుంచి సులభంగా 10 మార్కులు సాధించవచ్చు.
● ఓజోన్ పొర క్షీణత, బయో డీగ్రేడబుల్, నాన్–బయో డీగ్రేడబుల్ అంశాలు కీలకం.
● మంచి మార్కుల కోసం చిత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఎం.కృష్ణమూర్తి, సోషల్ టీచర్, కేతవరం హైస్కూల్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థి జీవితంలో కీలకమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకూ టెన్షనే.. ఈ గట్టు ఎక్కితే విద్యార్థి ఉన్నత విద్యకు చక్కని సోపానం ఏర్పడుతుంది. కనీసం ఉత్తీర్ణత సాధిస్తే చాలని కొందరు భావిస్తే, పదికి పది సాధించాలని మరికొందరు పట్టుదలతో ఉంటారు. అయితే పరీక్షలంటే ఎక్కడో చిన్న ఒత్తిడితో సాధించలేమేమోననే అనుమానం సహజం. అయితే ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా టెన్త్‌లో పదికి పది సాధించాలంటే ఇలా చేస్తే సులభమని నిపుణులైన సబ్జెక్టు టీచర్లు చెబుతున్నారు. ఇప్పటికే జరిగే ఎఫ్‌ఏ–1, 2, 3, స్లిప్ టెస్ట్‌లు, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ద్వారా పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. ఈనెల 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 132 కేంద్రాల్లో 24,166 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
జె.శ్రీను, బీఎస్ టీచర్, రాఘవాపురం హైస్కూల్
డి.వెంకటేశ్వరమ్మ, ఇంగ్లిష్ టీచర్, మాదేపల్లి హైస్కూల్
కాంప్రహెన్షన్ ప్యాసేజ్‌లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ పదాలను అర్థం చేసుకోవడం ద్వారా సమాధానాలు రాయవచ్చు.
ప్రశ్నల క్రమం మిస్ కాకుండా జవాబులు రాయడం ద్వారా వాల్యూయేషన్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది.
గ్రామర్ అంశాలను క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయాలి.
స్పెల్లింగ్ తప్పులు లేకుండా చూసుకోవాలి. క్రియేటివ్ రైటింగ్‌లో మంచి మార్కుల కోసం సమాధానం కనీసం రెండు పేజీలు రాయాలి.
సెక్షన్–1, 2లో ప్రశ్నలపై పట్టు సాధించాలి. పలుమార్లు పునశ్చరణ చేయాలి
గ్రాఫ్ ఆధారిత, పట నైపుణ్యాల ప్రశ్నలు తప్పులు లేకుండా రాసేలా సాధన చేయాలి
సెక్షన్–4లో ఉండే 8 మార్కుల ప్రశ్నలకు ప్రణాళికాబద్ధంగా సమాధానాలు రాయాలి.
పాఠ్యాంశాల వారీగా విశ్లేషణాత్మకంగా చదవాలి. వర్తమాన వ్యవహారాలపై అవగాహన కలిగి ఉండాలి.
‘టెన్’షన్ వద్దు
ఒత్తిడిని అధిగమించాలి
అన్ని సబ్జెక్టులపై పట్టు ముఖ్యం
నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలు
16 నుంచి పదో తరగతి పరీక్షలు
‘పశ్చిమ’లో 24,166 మంది విద్యార్థులు
హెచ్.జానకి, హిందీ టీచర్, ఏలూరు కస్తూరిబా హైస్కూల్
గణితం.. సృజనాత్మక వ్యూహం
బీఆర్‌వీ కుమార్, గణితం టీచర్, ఎం.నాగులపల్లి హైస్కూల్
గణితం ప్రశ్నాపత్రంలో సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తూ కొన్ని మార్పులు జరిగాయి.
వెనుకబడిన విద్యార్థులు వాస్తవ సంఖ్యలు, బహుపదులు, రేఖీయ సమీకరణాల జత, నిరూపక రేఖాగణితం, సంఖ్యాక శాస్త్రం, సంభావ్యతపై దృష్టి సాధించడం ద్వారా
63 మార్కుల వరకు సాధించవచ్చు.
ముఖ్యంగా 1, 3, 7, 13, 14 అధ్యాయాలు మిగతా వాటితో పోలిస్తే సులభంగా ఉండటమే కాకుండా, ఎక్కువ మార్కులను తెచ్చిపెడతాయి.
ఎస్‌ఎస్ అహ్మద్, ఫిజికల్ సైన్స్ టీచర్, భీమడోలు జెడ్పీ హైస్కూల్
ముందుగా 8 మార్కులు, తర్వాత 4 మార్కులు, 2 మార్కులు, చివరిగా ఒక మార్పు ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా రాయాలి.
8 మార్కుల ప్రశ్నల విభాగంలో పట్టు కోసం బ్లూప్రింట్ పాఠాలు చదవాలి.
4 మార్కుల ప్రశ్నల విభాగంలో ముఖ్యంగా చిత్రపటాలు, రేఖా చిత్రాల పాఠాలపై పట్టు సాధించాలి.
2, 1 మార్కుల ప్రశ్నల విభాగంలో ప్రశ్నలను క్షుణ్ణంగా సిద్ధం చేసుకోవాలి.
ఎం.మంజుల, తెలుగు టీచర్, భీమడోలు హైస్కూల్
అవగాహన–ప్రతిస్పందన విభాగంలో సమాధానాలను పూర్తి వాక్యాలతో స్పష్టంగా రాయాలి.
పద్య, గద్యభాగం, ఉపవాచకంపై ప్రశ్నల స్వభావాన్ని బట్టి పరిధి మేరకు సమాధానాలు రాయాలి.
పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉండే అభ్యాసాలను క్షుణ్ణంగా చదవాలి.
చక్కని దస్తూరి, విరామ చిహ్నాలను పాటిస్తూ అక్షర దోషాలు లేకుండా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
ముఖ్య పదాలను ప్యాసేజ్‌లో వెతికితే సులభంగా సమాధానాలు రాయవచ్చు.
కవి, రచయిత పరిచయాలు తప్పకుండా నేర్చుకోవాలి.
పద్యభాగంలోని 4 దోహా లను కంఠస్థం చేయాలి. ఈద్గాహ్, లోక్ గీత్ పాఠాలపై పట్టు సాధించాలి.
స్వరాజ్య కీ నీవ్, అంతర్జాతీయ స్టర్ పర్ హిందీ, పాఠాల నుంచి లఘు ప్రశ్నలు రావచ్చు.


