పని భారం మోపుతూ.. | - | Sakshi
Sakshi News home page

పని భారం మోపుతూ..

Feb 28 2026 1:27 PM | Updated on Feb 28 2026 1:27 PM

పని భ

పని భారం మోపుతూ..

పని భారం మోపుతూ.. చట్టబద్ధత కల్పించాలి చాలీచాలని వేతనంతో.. సెలవులు ఇవ్వాలి ●

రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్ల న్యాయమైన డి మాండ్లను పరిష్కరించాలి. సర్వేలు, అదనపు పనుల పేరుతో పని భారాలను తగ్గించాలి. ఆశ కార్యకర్తలకు నాణ్యమైన సెల్‌ఫోన్లు అందించాలి. పర్మినెంట్‌ ఉద్యోగులుగా పనిచేయించుకుంటూ అతి తక్కువ వేతనాలు చెల్లించడం దారుణం.

– పి.కమల, జిల్లా అధ్యక్షురాలు,

ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన్‌, ఏలూరు

ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించడం ద్వా రా చట్టబద్ధత కల్పించాలి. దీని ద్వారా బెని ఫిట్స్‌ అందుతాయి. శిక్షణ పొందిన ఆశలకు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యమివ్వాలి. ఈఎస్‌ ఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు కల్పించాలి. ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి.

– పి.కామేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు,

ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన్‌, ఏలూరు

ఆశ వర్కర్లకు ఇస్తున్న గౌరవ వేతనం రూ.10 వేలు ఏ మూలకూ సరిపోవడం లేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలి. వచ్చేనెల 5న విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఆందోళనకు ఆశ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.

– కె.పోశమ్మ, జిల్లా కార్యదర్శి,

ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన్‌, ఏలూరు

ఆశ వర్కర్లకు కూడా పర్మినెంట్‌ ఉద్యోగులు మాదిరిగా సెలవులు ఇవ్వాలి. ఇప్పుడు సెలవు కావాలంటే అధికారుల దయాదాక్షిణ్యాలపై తీసుకునే పరిస్థితి. ఆరోగ్యం బాగోకపోయినా, అత్యవసర పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినా సెలవు అనేది పెద్ద సమస్యగా మారింది.

– ఎం.లోకేశ్వరి, జిల్లా కోశాధికారి,

ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌, ఏలూరు

పని భారం మోపుతూ.. 
1
1/3

పని భారం మోపుతూ..

పని భారం మోపుతూ.. 
2
2/3

పని భారం మోపుతూ..

పని భారం మోపుతూ.. 
3
3/3

పని భారం మోపుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement