కూటమి నాయకులిచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యారు. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అమలు కోసం విజయవాడలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్‌పై పోలీసులతో దమనకాండకు పాల్పడడం అన్యాయం. ఇప్పటికైనా జీతాలు పెంచకపోతే పోరు ఉధృతం చేస్తాం.
– డి.కల్యాణి, అంగన్‌వాడీ వర్కర్స్
యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
మార్చి 2న శాంతియుతంగా ధర్నా జరుగుతున్న సందర్భంలో మా రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిచి వేతనాలు పెంచుతారని ఎదురు చూశాం. చీకటి పడుతున్నా చర్చలకు పిలవలేదు.శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ మహిళలను అరెస్టు చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వదలడం చాలా బాధాకరంగా ఉంది.
– కానూరి తులసి, పెనుగొండ
అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఒకసారిగా అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. సహచర సిబ్బందికి గాయాలయ్యాయి. నాకు ఫోన్ రావడంతో నేను కూడా బంధువుల సాయంతో ఆ ప్రాంతానికి రాత్రి సమయంలో చేరుకున్నాను. అప్పటికే పోలీసులు మా వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు.
– గంగోలు పెద్దింట్లమ్మ, అంగన్‌వాడీ టీచర్, మొగల్తూరు
కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోంది. న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని కోరిన అంగనన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై పోలీసులతో దౌర్జన్యం చేయడం దారుణం. నిద్రిస్తున్న సమయంలో అక్రమ అరెస్టులు చేసి వారి పట్ల నిర్దయగా ప్రవర్తించడం సరికాదు.
– వాసుదేవరావు,
సీపీఎం జిల్లా కార్యదర్శి, భీమవరం


