పరిశ్రమలపై వివక్ష | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలపై వివక్ష

Mar 7 2026 9:34 AM | Updated on Mar 7 2026 9:34 AM

పరిశ్రమలపై వివక్ష

ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌

తణుకు అర్బన్‌: పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం వివక్ష చూపుతోందని శాసనమండలిలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ విమర్శించారు. గురువారం శాసనమండలిలో ఈ విషయాన్ని ఆయన లేవనెత్తారు. నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పించే పరిశ్రమ కాటన్‌ స్పిన్నింగ్‌ అని, ఆ పరిశ్రమను ప్రోత్సహించడంలో ఎలాంటి రాజకీయ వివక్ష చూడకూడదని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన ప్రోత్సాహకాలు, రాయితీలు వైఎస్సార్‌సీపీకి సంబంధించిన సంస్థలకు నిలిపివేయడం మంచి పారిశ్రామిక విధానం కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రవళి స్పిన్నర్స్‌, ఎస్‌వీఆర్‌ స్పిన్నింగ్‌ మిల్లులకు చట్టబద్ధంగా విడుదల కావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement