కేసుల రాజీకి కృషి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జాతీయ లోక్‌అదాలత్‌లో కేసుల రాజీకి పోలీసులు కృషిచేయాలని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి బి.లక్ష్మీనారాయణ అన్నారు. వచ్చేనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌పై గురువారం పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం.సుధారాణి, 1వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ పి.హనీష, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగరాజు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేకా శివ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


