కాళ్ల: చెరువులో పడి యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం కాళ్లలో చోటుచేసుకుంది. ఎ స్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. దొ డ్డనపూడికి చెందిన గుండా సురేష్ (21) కొంతకాలంగా మానసికంగా బాధపడుతూ, తల్లిదండ్రులను హింస్తూ ఇంట్లో సామాన్లు నాశనం చే స్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చెరువులో పడి మునిగిపోతుండగా అక్కడ క్రికెట్ ఆడుతున్నవారు కేకలు వేశారు. విషయం గమనించిన కొల్లి సాయిరాజేష్ మరికొందరు చెరువులో దూకి సురేష్‌ను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.


