కూటమిపై నెటిజనం నిలదీత
న్యూస్‌రీల్
రీల్స్‌తో ఎండగడుతూ..
డయాలసిస్‌తో సతమతం
ఉమ్మడి జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. బాధితులు డయాలసిస్ చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. 8లో u
శురకవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం: సార్వత్రిక ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి తదితర సూపర్ సిక్స్ పథకాలు, వలంటీర్లకు రూ. 10 వేలు జీతం, జాబ్ క్యాలెండర్ తదితర హామీలపై కళాకారులతో ప్రత్యేకంగా యాడ్‌లు చేయించి కూటమి నేతలు తమ అనుకూల ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీ డి యాల ద్వారా ప్రజల్లోకి వదిలారు. రాష్ట్ర బడ్జెట్ గు రించి క్షుణ్ణంగా తెలిసిన విజనరీ అన్నారు. సంపద సృష్టి తెలిసిన అనుభవశాలి అన్నారు. అధికారంలో కి వచ్చిన వెంటనే హామీలన్నీ అమలు చేస్తామంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు, సంత కాలతో బాండ్ పేపర్లు పంచి జనాన్ని నమ్మించారు.
నిలదీస్తూ.. ఎండగడుతూ..
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలను సీబీఐ కొట్టిపారేయడం, మాజీ సీఎం దివంగత వైఎస్సార్‌పైనా నిందలు మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సమర్థవంతంగా తిప్పికొట్టడం, సార్వత్రిక ఎన్నికల్లో రాత్రి ఎ నిమిది గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు లక్షల సంఖ్యలో ఓట్లు నమోదైనట్టు తాజాగా తెరపైకి రావడం తదితర కూటమి వంచన, వైఫల్యాలు, సమకాలిన ఆయా అంశాల్ని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఎండగడుతున్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
మిలియన్ల కొద్దీ వ్యూస్
తిరుమల ఏడు కొండలు వేంకటేశ్వరస్వామివేనని, హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 2007లో నాటి సీఎం వైఎస్సార్ ఇచ్చిన జీ ఓలు, టీడీపీ అధికారంలోకి వస్తే ఆ జీఓలను రద్దు చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలు, అలాగే వేంకటేశ్వస్వామి కోసం వైఎస్సార్ భక్తి ఛానల్‌ను ప్రారంభిస్తే అసెంబ్లీలో చంద్రబాబు దానిని వ్యతిరేకించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అన్ని తప్పులూ మీరు చేసి వైఎస్సార్‌సీపీ పై బురద జల్లుతున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నా రు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ తదితర సా మాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి సర్కారు వైఫల్యాలు, వంచనపైనే రీల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. సామాన్య ప్ర జానీకం వాటికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తెలుపుతుండటంతో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్, షేర్స్‌తో షేక్ చేస్తున్నాయి.
ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రం అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు మాటలపై ట్రోలింగ్
బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ ఇస్తూ కూటమి ప్రచారం చేసుకున్న యాడ్‌పై సైటెరికల్ రీల్ ఇది..
సీన్ ఓపెన్ చేస్తే.. కల్లు కాంపౌండ్. అక్కడొక వ్యక్తి మాటల సందర్భంలో నీకు పింఛన్ వస్తుంది కదాని కల్లుగీత కార్మికుడిని ప్రశ్నిస్తాడు. పింఛన్ 60 ఏళ్లకు కదా? నాకు ఇప్పుడు 50 ఏళ్లని బదులిస్తాడు గీత కార్మికుడు. ఇంతలో అక్కడికి వచ్చిన గీత కార్మికుడి మనువడి దృష్టి కింద పడి ఉన్న ఒక పేపర్‌లోని యాడ్‌పై పడుతుంది. తన తాతయ్యకు ఆ యాడ్ చూపించి చదవమంటాడు మనువడు. నాకు చదవురాదు కదరా నువ్వే చదవమని చెప్పడంతో.. ‘50 ఏళ్లకే బీసీలకు పెన్షన్. నెలకు రూ.4 వేలు. చంద్రబాబు గారు గెలిస్తే తాతయ్యా’ అనడంతో... అక్కడున్న వారంతా మళ్లీ చదువంటూ ఎంతో ఆసక్తిగా అడుగుతారు. మళ్లీ మళ్లీ బాలుడితో ఆ హామీని ఆలకిస్తారు. ఇంకేం మనువడా ఆయన్నే గెలిపించుకుంటామంటూ అంతా ఆనందంతో మైమరిచిపోయి చప్పట్లు కొట్టడంతో యాడ్ ముగుస్తుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కానుంది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కొన్నింటికి కోతపెట్టి అరకొర కేటాయింపులు చేయగా, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి తదితర వాటి ఊసే లేకుండా చేసింది. కూటమి చేసిన వంచనతో పేదవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధాన హామీలను పట్టాలెక్కించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నిలదీస్తున్నారు.
‘సోషల్’ చెడుగుడు
కూటమికి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు
హామీల ఎగవేత, వైఫల్యాలపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు
సూపర్ సిక్స్ నుంచి శ్రీవారి లడ్డూ వ్యవహారం వరకు..
సైటెరికల్ రీల్స్‌తో ట్రోల్స్
ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ట్రెండింగ్
పెద్ద సంఖ్యలో వ్యూస్, కామెంట్స్, లైక్స్, షేర్స్
సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తోందంటూ చంద్రబాబు, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రం అమ్మాలంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, కల్తీ నెయ్యి వ్యవహరంపై పవన్‌కళ్యాణ్ పూటకోమాట.. ఇలా కూటమి నేతల ఊసరవెల్లి రాజకీయాలు, ఓట్లు కోసం ఎన్నికల ముందు వారు చేసిన విన్యాసాలు, నాటి పలుకులకు సంబంధించిన వీడియోలకు నెటిజన్లు తమ సృజనాత్మకత జోడిస్తున్నారు. సినిమాల్లోని హాస్య సన్నివేశాలకు సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ తదితర మంత్రులు, ఇతర నాయకు లు చెప్పిన మాటలను వాయిస్ ఓవర్ జత చేస్తున్నా రు. పోయాం.. మోసపోయాం, బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, ఆ డబిడ్డ నిధి, నిరుద్యోగ భృతీ ఏవంటూ క్యాప్షన్‌లతో వినూత్న రీతిలో రీల్స్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు.
కూటమిపై నెటిజనం నిలదీత
కూటమిపై నెటిజనం నిలదీత
కూటమిపై నెటిజనం నిలదీత


